mahimasabdam.tv@gmail.com
+91 9390209376

పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి యున్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. - మత్తయి 13 : 45, 46
ముఖేష్ ముత్యములు అమ్ము ?ఒక వర్తకుని వద్దకు వెళ్లాడు. అతని వద్ద ఉన్న ముత్యములలో ఒక ముత్యము చాలా అద్భుతముగా ఉన్నది.
?'నాకు ఈ ముత్యము కావాలి. దీని ఖరీదెంత?' అని అడిగాడు.
ముత్యములు అమ్ము వర్తకుడు 'అది చాల ఖరీదైనది' అన్నాడు.
'సరే కానీ దాని ఖరీదెంత?'
అది అమూల్యమైనది'
'నేను దీనిని కొనవచ్చునా?'
'ఎవరైనా కొనవచ్చును'
'మీరు చాలా ఖరీదని చెప్తున్నారు. దీని ఖరీదెంత?'
'దాని కోసం మీ దగ్గర ఉన్నదంతా వెచ్చించాలి. అలా వెచ్చించ గలిగిన వారు దీని కొనగలరు'
'నేను దీన్ని కొంటాను'
'మీ దగ్గర ఏమున్నది?'
'నాకు బ్యాంకులో లక్ష రూపాయలున్నవి'
'మంచిది. లక్షరూపాయలున్నవి. ఇంకేమున్నది?'
'ఇంకా ఏమీ లేవు. లక్షరూపాయలు మాత్రమే ఉన్నవి'
'ఇంకేమీ లేదా?'
'నా జేబులో కొన్ని రూపాయలున్నవి'
'ఎన్ని ఉన్నవి'
'లెక్క పెట్టనివ్వండి! 30, 40, మొత్తం 120 రూపాయలు ఉన్నవి'
'చాల మంచిది. నీ వద్ద ఇంకేమున్నది?'
'ఇంకేమీ లేదు'
'నీవెక్కడ ఉంటావు?'
'మీ ఉద్దేశ్యం?'
'స్వంత ఇల్లేనా?'
'ఔను'
'ఆ ఇల్లు కూడ నాకిచ్చెయ్యాలి'
'నా ఇంటిని మీకిచ్చి నేను షెడ్‌లో ఉండాలా?'
'షెడ్ కూడ ఉన్నదా? అది కూడ నాకివ్వాలి'
'షెడ్ మీ కిచ్చి నా కార్లో పండుకోనా?'
'మీకు కారు కూడ ఉన్నదా?'
'ఉన్నది'
'ఇంకేమున్నది?'
'నా వద్ద ఇంకేమీ లేదు'
'నీవు ఈ లోకంలో ఒంటరి వాడవా?'
'కాదు. నాకు ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు'
'వారిని కూడ నాకివ్వాలి. ఇంకేమున్నది నీ వద్ద?'
'నా వద్ద ఇంకేమీ లేవు. నేనొక్కడినే మిగిలాను'
'అలాగా! నీదంతా నాకివ్వాలి. నీ భార్య, పిల్లలు, ఇల్లు, కారు, డబ్బు, బట్టలు, నీకున్న సమస్తము, నీతో సహితము అన్నీ నాకు ఇవ్వాలి. అప్పుడే నీవు అమూల్యమైన ఆ ముత్యమును స్వంతం చేసుకోగలవు'
'అలాగే! నాకు ఆ ముత్యము దొరికితే చాలు' అన్నాడు ముఖేష్.- డా||పి.బి.మనోహర
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.





























Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech