Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

యవ్వనస్తులకు సందేశము
పరిపాలించు అభిషేకం యౌవనస్థులు ఎదుర్కొనే సవాలు
01 November 2014

పరిపాలించు అభిషేకం యౌవనస్థులు ఎదుర్కొనే సవాలు

మన దేవుడు సమస్తమును పరిపాలించే ప్రభువు. మన పితరుల కాలములో ఆయన అలాగుననే ఉన్నాడు 2010 సం||రాల క్రితం ఆయనే ఆత్మ స్వరూపిగా ఈ ప్రపంచానికి వచ్చాడు. యేసు అన్నాడు. దేవుని పరిశుద్ధాత్మ మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. అలాగైనట్లయితే మిమ్మును పరిపాలించును. అలాగుననే దేవుని ఆత్మ తన పిల్లలను పరిపాలించుచున్నాడు ఒక మనుష్యుని యొక్క ఆలోచనలను ఎవరు పరిపాలించలేరు. అయితే దేవుని ఆత్మ ద్వారా మాత్రమే జరుగును. అలాగుననే ఒక మనుష్యుని యొక్క నాలుకను ఎవరు పరిపాలించలేరు. అయితే దేవుని ఆత్మ నాలుకను, హృదయమును పరిపాలించును. అలాగుననే దేవుని ఆత్మ పరిపాలన చేయగలిగినది. గొఱ్ఱెలు మేపే సాధారణ మనుష్యుడైన దావీదును దేవుడు రాజుగా మార్చుటకు ఇష్టపడ్డాడు. దాని కోసం ఏమి చేశాడంటే. తన ప్రవక్తను పంపి దావీదును అభిషేకింపజేశాడు. అప్పుడు దేవుని ఆత్మ అతని మీద బలముగా దిగినది. గనుక పరిపాలించు కృపను పొందుకొన్నాడు. నా ఆశ ఏమిటంటే, దేవుని ఆత్మను పొందుకున్న వారు మన భారతదేశమును పరిపాలించాలి. దేవుని అభిషేకమను పొందినటువంటి వారే ప్రతి రాష్ట్రమును పరిపాలించాలి. దానిని చూసి నేను ఆనందించాలి. గనుక యౌవ్వన సహోదరి సహోదరులారా! త్యాగ హృదయముతో జనులకు సేవ చేయుటకు మిమ్మును మీరు సమర్పించుకుంటారా? ఈనాడు ప్రతి ఒక్కరు డాక్టరవ్వాలి, ఇంజనీరు అవ్వాలని ఇష్టపడుచున్నారు. కాని దేశాన్ని పరిపాలించాలనే ఆలోచన ఎవరికి రావడం లేదు. తల్లిదండ్రులు దానికి ప్రాముఖ్యతను ఇవ్వడము లేదు. ఈ రోజు నుండి మన దేశము మీద మీ ఆలోచనలు ఉండనివ్వండి. మీరు దాహముతో దేవున్ని అడిగినట్లయితే పరిపాలించే శక్తిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆయన అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పాడు. గనుక అడిగి పొందుకుందాం. ఈ చివరి రోజులలో ప్రజలు అన్నిటిని చూసి నూతన శక్తి కోసము ఎదురు చూచుచున్నవారు ఎవరు లేరు. ఒక పార్టి నిర్వహణ నచ్చకపోయినట్లయితే ఇంకొక పార్టి వ్యక్తికే వారు ఓటు వేసెదరు. వేరే ఆప్షన్‌ ఏమీ లేదు. గనుక యౌవనస్తులారా! దేశాన్ని పరిపాలించేవారిగా లేచి రావాలి. ఇప్పటి నుండే దాని కొరకు నీవు సిద్ధపడు! ప్రభువు ముందు యదార్ధముగా ఉండు! నీ మనస్సాక్షిని ఎల్లప్పుడు జాగ్రత్తగా కాచుకొని ప్రయాణించు! నీ హృదయాంతరంగమును పరిశోధించే దేవుడు నిశ్చయముగా నీకు ప్రతిఫలమిచ్చును. దావీదు వలె నేను వెళ్ళుతాను నన్ను పంపించండని చెప్పేవారు అవసరము. దావీదు అలాగే చెప్పి ముందుకు వచ్చాడు, గొల్యాతును చంపడానికి దావీదుకు దేవుడు కృపను అనుగ్రహించాడు. నీవు కూడా ముందుకు వచ్చినట్లయితే దేవుడు నీకు సహాయం చేయగలడు. ఇంటిలోనే మీరు బంధించబడి ఉన్నట్లయితే ఏమియు జరుగదు. గనుక దేవుని వాక్యము చెప్పుచున్నది. లెమ్ము! తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. నీవు నిద్రలోనుండి లెమ్ము! నీవు లేచినట్లయితే దేవుడు నీకు సహాయము చేయగలడు. ప్రియ యౌవనస్థుడా! లోబడుతావా? ఈ పత్రికను చదివేటప్పుడే దేవుని అభిషేకం నీపై వచ్చుట నీవు గ్రహించినట్లయితే ఈ పత్రికను జాగ్రత్తగా ఉంచుకొని, దేవుని మాటలు నన్ను వెతుక్కుంటు వచ్చినవి నాకు సహాయము చేయుమని ప్రభువును అడుగు! ప్రభువు నిన్ను దేశమును పరిపాలించే వ్యక్తిగా నిన్ను సిద్ధపర్చును గాక. ఆమేన్‌. 

- బ్రదర్‌.జడ్సన్‌ అబ్రహాం

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

కొలొస్సయులు 3: 23-24 మీరు ఏమి చేసినా, ప్రభువు కోసం పని చేస్తున్నట్లుగా, మానవ యజమానుల కోసం కాకుండా, హృదయపూర్వకంగా పనిచేయండి, ఎందుకంటే మీరు ప్రభువు నుండి వారసత్వాన్ని బహుమతిగా పొందుతారని మీకు తెలుసు. ఇది మీరు సేవ చేస్తున్న ప్రభువైన క్రీస్తు.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech