Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

కానా పెండ్లి విందు
24 May 2014

కానా పెండ్లి విందు

 యోహా 2:2 'యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువబడిరి'

 మూడవ దినము : మొదటి దినమున బాప్తిస్మమిచ్చే యోహాను చేత బాప్తిస్మము పొంది, పరిశుద్ధాత్మను పొంది రెండవ దినమున కొందరు శిష్యులను ఏర్పరచుకొని మూడవ దినమున తన పరిచర్య ప్రారంభించి కానా అను ఊరిలో మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలు పరచెను. ఆయన పరిచర్య జీవితంలో అనేకమైన సూచకక్రియలు చేసియున్నాడు. మొదటి సూచక క్రియ వివాహంలో ఎందుకు చేసాడు?

(i) ఆయన మొదటి ప్రాధాన్యత వివాహానికి, కుటుంబానికి యిచ్చాడు. అందుకే వివాహము అన్ని విషయములలో ఘనమైనదని పరిశుద్ధ గ్రంధం చెబుతుంది (హెబ్రీ 13:4).

(ii) ఏదేను తోటలో మొదటి వివాహం చేసి వివాహాన్ని ఘనపర్చాడు.(iii) మరియొక వివాహము ప్రకటన గ్రంధములో చదవగలము. 'గొఱ్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు' అని వ్రాయబడినది (ప్రక 19:9)

(iv) అన్ని విషయములలో వివాహము ఘనమైనదయితే, అది పరలోకంలో నిర్ణయించబడినదయితే కుటుంబములో కలతలు ఎందుకు వస్తున్నవి? విభేదాలు ఎందుకు వస్తున్నవి? దాంపత్య జీవితాలు ఎందుకు విడిపోతున్నవి?

కుటుంబ జీవిత విధానం ఏ విధముగా యుండాలని దేవుడు కోరుతున్నాడు? ఈ విషయాలను పరిశుద్ధాత్ముని సహాయముతో ధ్యానము చేయుట యుక్తమైయుంటున్నది.

ఈ వాక్య భాగములో (యోహా 2:1-11) రెండు గుంపులున్నవి. ఇద్దరు వ్యక్తులున్నారు.

1. మొదటి గుంపు పెండ్లి విందువారు : యేసును ఆహ్వానించినవారు.

2. రెండవ గుంపు పరిచారకులు : యేసు మాటకు విధేయత చూపించినవారు.

3. వ్యక్తులు : తన మహిమను కనపరచిన యేసు

4. విశ్వాసమును క్రియా రూపకంగా చూపించిన స్త్రీ - యేసు తల్లి మరియ

(ఎ) యేసును ఆహ్వానించిన పెండ్లి విందు వారు (యెహా2:2) : వివాహ జీవితములో సూచక క్రియలు జరగాలన్న, శాంతియుతమైన లేక సమాధానముతో కూడిన జీవితము కావాలన్నా యేసును ఆహ్వానించాలి. యేసు కానా పెండ్లి విందుకు ఆహ్వానించబడినాడు గనుక, ఆయన వచ్చాడు. ఆయన వచ్చాడు గనుక విందులో కలిగిన లోటు సమకూర్చబడినది. ఆయనను ఆహ్వానిస్తేనే గాని లేక మన హృదయ తలుపులు యిష్టపూర్వకముగా తెరిస్తేనే గాని ఆయన రాడు. బలవంతముగా మన చితికిన బ్రతుకుల్లోనికి ఆయన రాడు - జోక్యం చేసుకోడు. మన వ్యక్తిగత జీవితాలలో, కుటుంబ జీవితాలలో యేసు కన్పించని అతిధిగా ఎల్లప్పుడు యుండాలి. ఆయనకు స్థానం యివ్వాలి. ఆయనను ఆహ్వానించకపోతే అపవాది చొరబడి జీవితాలను పాడు చేసి ఘనమైన వివాహ జీవితాన్ని ఘనహీనంగా మార్చుతాడు. యేసును ఆహ్వానించిన తర్వాత ఆయన ఎల్లప్పుడు నీ కుటుంబములో యుండాలంటే నీ ఆత్మీయ జీవితము, విశ్వాస జీవితము దృఢముగా యుండాలి.

(బి) తల్లి మరియ చేసినది చేయాలి (యోహా 2:3) : 'ద్రాక్ష రసమై పోయినప్పుడు యేసు తల్లి - వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పెను'

(i) యేసు దగ్గరకు వెళ్ళిన తల్లి మరియ : పెండ్లి విందులో ద్రాక్షరసమైపోయినప్పుడు యేసు తల్లి అటు - ఇటు పరుగెత్తలేదు, పెండ్లి విందు వారి దగ్గరకు వెళ్ళలేదు, ఆందోళన చెందలేదు, యేసు దగ్గరకు మాత్రమే వెళ్ళింది. నీ శోధనలు బాధలు ఏవైన, నీ అవసరతలు, అక్కరలు ఏవైనా యేసు దగ్గరకే వెళ్ళాలి. రాజులను నమ్ముకొనుట కంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.

(ii) అవసరతను గుర్తెరిగిన తల్లి మరియ : దైవభీతి, భక్తి యున్న స్త్రీలు కుటుంబములోయున్న అవసరతలను, అక్కరలను, లోటు గుర్తించగలుగుతారు. ఆ పెండ్లి విందులో అతిధులుయున్నారు. విందు ప్రధాని, యజమానులు మరెందరోయున్నారు. గాని ఆ కొరతను గ్రహించినది భక్తురాలైన యేసు తల్లి మాత్రమే.

(iii) పరిచారకులను యేసు యొద్దకు నడిపించిన తల్లి మరియ : యోహా 2:5. యేసు మాత్రమే ఆ సమయములో ఆ లోటును తీర్చగలడు, ఆ కొరతను పూడ్చగలడు అనే గొప్ప నమ్మకముతో ఆ పరిచారకులను యేసు యొద్దకు నడిపించింది. యేసు ఆ సూచక క్రియను పరిచారకుల ద్వారా చేస్తాడు అని ముందుగానే గుర్తెరిగిన స్త్రీగా కన్పించుచున్నది.

(iv) యేసు మాటలకు నొచ్చుకొనని తల్లి మరియ : యోహా (2:4) : 'యేసు ఆమెతో - అమ్మా, నాతో నీకేమి పని? అని పలికిన మాటలకు నొచ్చుకొనలేదు'. నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లి మరియతో ఈ మాట పలికినను, తను ఏ మాత్రము మనస్సులో బాధపడలేదు. ఆ మాటలు దైవ కుమారుడైన యేసు పలికినవని గ్రహించి గొప్ప భక్తురాలిగా వినయమును ప్రదర్శించడం మాత్రమే గాక తదుపరి కార్యక్రమమును పరిచారకులకు అప్పగించినది. ఇటువంటి స్త్రీలు, కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ఎంతో అవసరమైయున్నారు.

(సి) వెంటనే సూచక క్రియను చేయని యేసు (యోహా 2:4) : 'నా సమయమింకను రాలేదు' అని తల్లితో పలికినా, తల్లి మౌనముగా యుండి పోయినట్లు గమనించగలము. ద్రాక్షరసము అయిపోయినదని తల్లి చెప్పినప్పటికిని వెనువెంటనే తన కార్యాన్ని ప్రారంభించలేదు. నా సమయమింకను రాలేదంటున్నాడు. అయితే సమయం ఇంకెప్పుడు వస్తుంది? ఇచ్చట ఒక అమూల్యమయిన సత్యాన్ని గ్రహించాలి. మనము ప్రభువును మన అవసరతల కొరకు, అక్కరల కొరకు ప్రార్ధిస్తూ, విన్నవిస్తూ యుంటాము. వెంటనే జవాబిస్తాడని నమ్ముతాము, గాని అనేకసార్లు 'కాదు' అని జవాబు రావచ్చు. 'ఆగు' అని కూడ జవాబు రావచ్చు. ఎటువంటి జవాబు వచ్చిన ఆయన నిర్లక్ష్యమని తలంచరాదు. అడిగిన వెంటనే నీ సమస్యలన్ని పరిష్కారమవుతాయనుకోకూడదు. నిరీక్షించాలి. నిరీక్షణలోనే తగిన సమాధానం దొరుకుతుందని గ్రహించగలము. ఆ సమాధానం, ఆనందాన్ని కల్గించేదిగా, ఆశ్చర్యాన్ని కల్గించేదిగా యుంటుంది. దీనికి ఒక చక్కని వృత్తాంతము పరిశుద్ధ గ్రంధములో యున్నది. యెహా 11వ అధ్యాయములో మార్త మరియు లాజరు వృత్తాంతము వ్రాయబడి యున్నది. యేసును ప్రేమించిన కుటుంబములో లాజరు రోగియై యున్నాడని యేసుకు వర్తమానము పంపారు. యేసు రాలేదు. లాజరు మరణించాడు. లాజరు మరణించిన నాలుగు దినముల తర్వాత యేసు వచ్చి లాజరును లేపి అద్భుతమును కనపరచాడు. మన ప్రార్ధనలకు వెంటనే జవాబు రాలేదని దేవుని నిందించక, నిరీక్

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech