mahimasabdam.tv@gmail.com
+91 9390209376
తాజా/16 September 20222022 సెప్టెంబర్ 8వ తేది నుండి 12వ తేది వరకు ఇంగ్లాండు, స్కాట్‌లాండ్‌లో ఉజ్జీవ సభలలో, ఆదివారం ఆరాధనలలో దేవుని వాక్యమును అందించారు. అనంతరం సౌత్ లండన్ బైబిల్ గ్రూప్ వారిని కలిసి వారి నిమిత్తం ప్రార్ధనలు చేసారు. 10వ తేది శనివారం లండన్ సిటి క్రైస్ట్ టెంపుల్‌లో రెవ.భరత్ స్వామి ఏర్పాటు చేసిన రివైవల్ మీటింగ్ ఆశీర్వాదకరముగా జరిగింది. దైవజనులు డా॥ జాన్‌వెస్లీ వాక్యసందేశము అందించి ప్రతి ఒక్కరికి వ్యక్తిగతముగా ప్రార్ధనలు చేసారు. బ్రదర్ శ్రవణ్ పులి, బ్రదర్ విజయ్, బ్రదర్ వరుణ్, బ్రదర్ సుమన్ తదితరులు పాల్గొన్నారు. 11వ తేది ఆదివారం ఉదయం లండన్‌లో హౌంస్లో క్రిస్టియన్ ఫెలోషిప్‌లో పాస్టర్ జాన్ మార్క్, శ్రీమతి రేవతి ఆధ్వర్యములో జరిగిన ఆరాధనలోను, ఆదివారం సాయంత్రం మిల్టన్ కీన్స్ క్రిస్టియన్ ఫెలోషిప్‌లో బ్రదర్ రాబిన్ ఆధ్వర్యములో జరిగిన ఆరాధనలోను దైవజనులు డా॥జాన్‌వెస్లీ గారు వాక్యసందేశము అందించారు. దైవజనులు డా॥ జాన్‌వెస్లీ లండన్‌లోని సిటిరోడ్‌లో ఉన్న మెథడిస్ట్ సంఘ స్థాపకుడైన జాన్‌వెస్లీగారి గృహమును, నిర్మించి పరిచర్య చేసిన చాపెల్ మరియు ఆయన ప్రార్ధనా గది, మ్యూజియంను సందర్శించారు. ఇంగ్లాండులోని బెడ్‌ఫోర్డ్‌లోని జాన్‌బన్యన్‌గారి మ్యూజియాన్ని మరియు లండన్‌లోని సిటిరోడ్‌లో ఉన్న జాన్‌బన్యన్‌గారి సమాధిని దర్శించారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.
Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech