Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తాజా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

అల్లూరి సీతారామరాజు జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ కార్యవర్గ ఎన్నిక

తాజా/28 July 2022

2022 జూలై 25వ తేది సోమవారం డివిజన్‌ కేంద్రమైన రంపచోడవరంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ప్రెసిడెంట్‌ బిషప్‌ డా॥ కె.ప్రతాప్‌ సిన్హా ఆధ్వర్యములో అల్లూరి సీతారామరాజు జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ నూతన కార్యవర్గ ఎన్నిక ఘనముగా జరిగింది. ముందుగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. దైవజనులు రెవ.డా॥ఎమ్‌.నిస్సీ కుమార్‌ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా బిషప్‌ టి.మోజస్‌, జనరల్‌ సెక్రటరీగా కె.జెకర్యా, జాయింట్‌ సెక్రటరీగా విక్టర్‌ ఇమ్మానుయేల్‌, గాబ్రియల్‌, ఎగ్జిక్యూటివ్‌ సెక్రటరీగా సంతోష్‌, వైస్‌ ప్రెసిడెంట్‌గా చంటిబాబు, యోహాను ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌గా టి.పండు దొర, బ్రదర్‌ ఎజ్రా, రీజనల్‌ చైర్మన్‌గా ప్రభుదాసు, బ్రదర్‌ జెర్మియా ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గానికి ముఖ్య అతిథులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రెవ.డా॥ఎమ్‌.నిస్సీ కుమార్‌ మాట్లాడుతూ అల్లూరి సీతారామారాజు డివిజన్‌లో ఉన్న పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సభ్యులందరి సహకారంతో అనేక సామాజిక సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమములో అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అధ్యక్షులు బిషప్‌ డా॥ డేనియల్‌ పాల్‌, కాకినాడ జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ అధ్యక్షులు రెవ.శామ్యూల్‌ సాగర్‌, తూ॥గో॥జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ప్రధాన కార్యదర్శి రెవ.డా॥రైమో జుహానీ హలోనెన్‌, ఏజెన్సీ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ సభ్యులు పాల్గొని శుభములు తెలిపారు.

484-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

ఎఫెసీయులకు 5: 15-16 కాబట్టి, మీరు ఎలా జీవిస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి - అవివేకంగా కాకుండా తెలివిగా, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ఎందుకంటే రోజులు చెడ్డవి.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech