Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

విజయనగరం జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై భీమిలి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ నిరసన

విజయనగరం జిల్లా/30 November -0001విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అను నినాదంపై ఆంధ్రరాష్ట్రం యావత్తు పోరాటం చేసి సాధించుకున్న స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తామనడం విడ్డూరంగా వుందని ఇటువంటి ఆలోచన మార్చుకోవాలని అలాగే పెట్రోల్‌, గ్యాస్‌, పాలు, నిత్యావసర వస్తువులు ధరలు విపరీతముగా పెంచుకుపోవడం పేదలకు ఇబ్బందిగా వుందని భీమిలి పాస్టర్‌ ఫెలోషిప్‌ అధ్యక్షులు రెవ.డా||డి.జే.మోహన్‌ కుమార్‌, సెక్రెటరీ పి.ఎమ్‌.జాకబ్‌ తీవ్రముగా డిమాండ్‌ చేశారు. 2021 ఫిబ్రవరి 27వ తేది శనివారం భీమిలి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ జరిగింది. తొలుత సేవకులు విశ్వాసులు నిరసన వ్యక్తం చేశారు. అడ్వైజర్‌ జాన్‌ కాంతయ్య, వైస్‌ ప్రెసిడెంట్‌ పి.ఎస్‌.ప్రసాద్‌, ట్రెజరర్‌ సిహెచ్‌ జాషువా డానియేల్‌ మాట్లాడుతూ ఇటీవల పాస్టర్స్‌పైన, చర్చ్‌లపైన, విశ్వాసులపైన మతోన్మాదులు దాడులు విపరీతముగా చేస్తున్నారనీ వాటిని గుర్తించి ప్రభుత్వాలు చర్యలు తీసుకొని, రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం సేవకులు తిమోతి, జాన్‌ పాల్‌, బర్నబాస్‌, జాన్‌ మోజేస్‌, జాషువా సుధాకర్‌ తదితరులు దేశం, రాష్ట్రం, జిల్లాల కోసం అనేక మంది పాప జీవితాన్ని వొదిలి దేవుని వైపు మారాలని ప్రార్థనలు చేశారు. 

523-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

ఎఫెసీయులకు 5: 15-16 కాబట్టి, మీరు ఎలా జీవిస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి - అవివేకంగా కాకుండా తెలివిగా, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ఎందుకంటే రోజులు చెడ్డవి.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech