mahimasabdam.tv@gmail.com
+91 9390209376
విజయనగరం జిల్లా/05 February 2022క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫౌండర్ అప్పికట్ల జీవరత్నం పిలుపు మేరకు 2022 జనవరి విజయనగరం జిల్లా, యస్.కోట, గాస్పల్ చర్చిలో పాస్టర్ శరత్ కుమార్ ఆధ్వర్యంలో సి.ఆర్.పి.ఎస్.మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమమునకు ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ వై.యస్.చిన్నారావు మరియు నేషనల్ జనరల్ సెక్రటరీ ఆర్.జయకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని సి.ఆర్.పి.ఎస్ ఎజెండ గురించి వివరించారు. క్రైస్తవ హక్కులను పరిరక్షీంచుటకును క్రైస్తవులపై జరుగుతున్నా దాడులను అరికట్టుటకును సిఆర్‌పిఎస్ టీమ్ అన్నివిధాలుగా పనిచేయ్యాలని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గౌరవేతనమునకు హర్హులు గల పాస్టర్స్ ఉన్నారని ధరఖాస్తుకు ఇంకో అవకాశం ఇవ్వాలని వై.ఎస్.చిన్నారావు డిమాండ్ చేసారు. జిల్లా ప్రెసిడెంట్ బిషప్.డి.ఎస్.దేవప్రసాద్, సెక్రటరీ రెవ.డా॥యం.ఐజక్ జాయ్, కోశాధికారి జి.మోజేస్ పాల్, మహిళా విభాగం ప్రెసిడెంట్ జి.నిర్మల మరియు జిల్లా కమీటీ వారు పాల్గొని నియోజకవర్గ కమిటీని ఏర్పాటు చేసారు. ప్రెసిడెంట్‌గా రెవ.డా॥బి.శరత్ కుమార్, సెక్రటరీగా రెవ.కె.డేవిడ్, కోశాధికారిగా రెవ.కె.ఎస్.మిలంగ్‌టన్, గౌరవ అధ్యక్షులుగా రెవ.డా॥వై.బెంజిమన్, అడ్వజర్‌గా రెవ.డా॥జి.జాన్ మార్క, అడ్వజర్‌గా పాస్టర్ బి.మెజస్ ప్రసాద్ మరియు 10 మంది సభ్యులను ఎన్నుకొని నియోజకవర్గం కమిటీని వారు ఏర్పాటు చేసారు. అనంతరం బిషప్ బెంజిమన్ వాక్యసందేశము అందించి, ఆయన ప్రార్ధన ఆశీర్వాదములతో ఈ కార్యక్రమము ముగిసింది.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.



Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech