Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తెలంగాణ రాష్ట్రం వార్తలు

తాజా వార్త
తాజా వార్త

పేదరోగులను ఆదుకొంటున్న డా|| విక్టర్ ఇమ్మాన్యుల్

తెలంగాణ రాష్ట్రం/30 November -0001కరోనా సోకి ఆస్పత్రుల్లో చేరితే వైద్యానికి లక్షల్లో ఖర్చవుతోంది. ఆ చికిత్సకే ఆస్తులన్నీ అమ్ముకుంటున్న వారూ ఉన్నారు. అలాంటిది కన్సల్టెన్సీ ఫీజుగా రూ. 10 తీసుకొని, కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారో వైద్యుడు. బాధితులు నిరుపేదలైతే ఆ రూ. 10 కూడా తీసుకోవడం లేదు. కరోనాకు సంబంధించిన వివిధ పరీక్షలను తక్కువ ధరకే చేస్తున్నారు. మందులనూ అందుబాటు ధరలకే ఇస్తున్నారు. కోవిడ్ వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిన పరిస్థితుల్లో మేడ్చల్ జిల్లా, పీర్జాదిగూడలో ప్రజ్వల క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ విక్టర్ ఇమ్మాన్యుయెల్ ఆదర్శమిది. ఆయన జనరల్ మెడిసిన్ స్పెషలైజేషన్లో ఎంబీబీఎస్ చేశారు. వివిధ ఆస్పత్రుల్లో పనిచేసిన ఆయన తర్వాత సొంతంగా క్లినిక్ పెట్టుకున్నారు. క్లినిక్ పెట్టినప్పటి నుంచి తన దగ్గరకు వచ్చే రోగులకు కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.200 తీసుకుంటున్నారు. పేదరోగుల నుంచి రూ. 10 మాత్రమే తీసు కుంటున్నారు. దేశం కోసం సరిహద్దుల్లో పోరాడే సైనికులు, ప్రజలకు అన్నం పెట్టే రైతులు, అనాధలు, దివ్యాంగులకు ఫీజు సహా జబ్బు నయం అయ్యే దాకా మందులతో సహా ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. కొందరు దాతలు సహకరిస్తే నిరుపేద రోగులకు టెస్టులు సహా మందులూ ఉ చితంగానే అందిస్తున్నారు. కొవిడ్ సోకిన నిరుపేద రోగులకు ల్యాబ్ పరీక్షలు మొదలుకుని మందులు, ఇంజక్షన్లు సైతం తక్కువ ధరకే అందిస్తున్నారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసొలేషన్ సెంటర్ లోనూ డాక్టర్ ఇమ్మాన్యుయెల్ ఏడాదిగా కరోనా బాధితులకు ఉ చితంగా వైద్య సేవలందిస్తున్నారు. తన వద్దకు వచ్చిన రోగుల్లో నిరు పేదలుంటే వారిని పీర్జాదిగూడ ఐసొలేషన్ సెంటర్ లో చేర్పించి వారికి పూర్తి స్థాయిలో ఉచితంగానే వైద్యం చేయిస్తున్నారు. కరోనా చికిత్స భరించలేని పేద వారికి తక్కువ ధరకు వైద్యం అందించాలనే సంకల్పంతోనే ఇదంతా చేస్తున్నానని డాక్టర్ విక్టర్ ఇమ్మాన్యూల్ తెలిపారు. 

552-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

కొలొస్సయులు 3: 23-24 మీరు ఏమి చేసినా, ప్రభువు కోసం పని చేస్తున్నట్లుగా, మానవ యజమానుల కోసం కాకుండా, హృదయపూర్వకంగా పనిచేయండి, ఎందుకంటే మీరు ప్రభువు నుండి వారసత్వాన్ని బహుమతిగా పొందుతారని మీకు తెలుసు. ఇది మీరు సేవ చేస్తున్న ప్రభువైన క్రీస్తు.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech