mahimasabdam.tv@gmail.com
+91 9390209376
తెలంగాణ రాష్ట్రం/30 November -0001మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ ఎర్నెస్ట్ పి.కొమానపల్లి గారు 2021 మే 24వ తేది, సోమవారం ప్రభువు నందు నిద్రించారు. హైదరాబాద్ లో ఉంటున్న ఆయన అక్కడే తుది శ్వాస విడిచారు. మన్నా మినిస్ట్రీస్ ద్వారా విద్యాసంస్థలు, ఆస్పత్రులు, అనాథ పిల్లలకు ఆశ్రమాలను ఆయన స్థాపించారు. మిరియం స్కూలు, పరంజ్యోతి స్కూలు, పరంజ్యోతి జూనియర్ కళాశాల, మిరియం డిగ్రీ కళాశాల, జ్యోతి ఐటీఐ, మిరియం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేరుతో అనేక విద్యా సంస్థలను స్థాపించారు. రెవ.కె.ఎస్.జోసఫ్ మెమోరియల్ ఆస్పత్రి కూడా ఏర్పాటు చేశారు. కుష్టు, హెచ్ఐవీ రోగులకు న్యూ లైఫ్ సెంటర్లు నిర్వహించారు. ఆయా సంస్థల ప్రతినిధులు మే 25వ తేది, మంగళవారం బిషప్ ఎర్నెస్ట్ పి.కొమనాపల్లి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల ప్రముఖ దైవజనులు, క్రైస్తవ నాయకులు ఆయన చేసిన పరిచర్యను కొనియాడి సంతాపం తెలియజేసారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.




Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech