mahimasabdam.tv@gmail.com
+91 9390209376
తూర్పు గోదావరి జిల్లా/30 November -00012021 ఫిబ్రవరి 22వ తేది ఉ|| 10 గం||ల నుండి మ|| 1 గం|| వరకు రాజమండ్రి, కొంతమూరులో గల హోప్ చర్చ్ రివైవల్ వర్షిప్ సెంటర్ వార్షికోత్సవము ఘనముగా జరిగింది. స్థానిక సంఘసభ్యులు ఆహ్వానము మేరకు జరిగిన ఈ వార్షికోత్సవములో ముఖ్య ప్రసంగీకులుగా దేవుని చేత బలముగా వాడబడుచున్న దైవజనులు హోప్ చర్చ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, ఉజ్జీవ ప్రసంగీకులు, రెవ.యల్.యేసురత్నం గారు, స్త్రీల ప్రేయర్ ఫెలోషిప్ కన్వీనర్ సిస్టర్ యల్.జాయ్ గారు ప్రత్యేక దైవ వర్తమానములు అందించారు. ముఖ్య అతిధిగా బ్రదరన్ మిషను డైరెక్టర్, రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్, రెవ.డా||కె.సుధీర్ కుమార్ గారు పాల్గొని శుభములు తెలియజేసారు. ప్రముఖ సువార్త గాయకులు డా|| జాన్ బిల్ మోరియా గారు ప్రత్యేక పాటలు పాడి దేవునిని మహిమపర్చారు. ఈ సందర్భముగా డా||జాన్ బిల్ మోరియా గారు పాడిన 77వ ఆల్బమ్ రెవ.యల్.యేసురత్నం గారి చేతుల మీదుగా ప్రార్ధన పూర్వకముగా ప్రారంభించారు. తదుపరి హోప్ చర్చ్ ఆధ్వర్యములో నిరీక్షణ క్రైస్తవ భక్తి గీతముల పుస్తకమును మరియు రెవ.యేసురత్నం గారు పాడిన నూతన గీతములు విడుదల చేసారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

























































































Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech