Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

ప్రభువు నందు నిద్రించిన రెవ.డా.దేవరపల్లి విజయ సునంద్‌

తూర్పు గోదావరి జిల్లా/30 November -0001రాజమండ్రి : బైబిలు ప్లేస్‌ అధినేత, బిషప్‌ జోసఫ్స్‌ చర్చ్‌ పాస్టర్‌, బిషప్‌ జోసఫ్‌ మరియు శ్రీమతి వినుతి జోసఫ్‌ గార్ల ఏకైక కుమారుడు రెవ.డా.దేవరపల్లి విజయ సునంద్‌ 2020 ఆగష్టు 21వ తేదిన ప్రభువు నందు నిద్రించారు. ఆయనకు భార్య శ్రీమతి సోని సునంద్‌, ఇద్దరు కుమారులు విజయ జోసఫ్‌, జోసఫ్‌ దేవదాసు ఉన్నారు. రెవ.డా.దేవరపల్లి విజయ సునంద్‌ 1974 మార్చి 21వ తేదిన జన్మించారు. 21వ తేది సునంద్‌ గారికి ప్రత్యేకమైనదిగా ఉంది. 21వ తేదిన బిషప్‌ జోసఫ్‌ గారు ప్రభువు నందు నిద్రించారు. 21వ తేదిన వివాహ ప్రధానము చేసారు. 21 సంవత్సరముల వివాహ జీవితము. 21వ తేదిన రెవ.డా. దేవరపల్లి విజయ సునంద్‌ జన్మదినము. 21వ తేదిన ప్రభువు నందు నిద్రించారు. ఆయన అందరిని చిరునవ్వుతో పలుకరిస్తూ కష్టములలో ఉన్న వారిని అదుకొనేవారని, ఆయన మృతి పట్ల క్రైస్తవ నాయకులు, ఫెలోషిప్‌ సభ్యులు, సంఘవిశ్వాసులు, కుటుంబసభ్యులు, స్నేహితులు తమ సంతాపమును తెలియజేసారు. విడువబడిన కుటుంబమునకు దేవుని కృప తోడుగా ఉండాలని ప్రార్ధించారు.

181-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech