mahimasabdam.tv@gmail.com
+91 9390209376
తూర్పు గోదావరి జిల్లా/30 November -0001రాజమండ్రి : రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ సహవాస కార్యక్రమములు 2020 ఏప్రిల్ నెల నుండి జరుగకపోవడం కారణం కరోనా వైరస్ వల్ల లాక్‌డౌన్ అని అందరికి తెలిసినదే. ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుచున్న కారణముగా సేవకులు పడుచున్న ఇబ్బందులను రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు గుర్తించి సభ్యులైన వారందరికీ మరొకసారి నిత్యావసర వస్తువులు, వాటితో పాటు కొంత ధన సహాయము ఇచ్చుటకు చేపట్టిన కార్యక్రమము చాలా ఆశీర్వాదకరముగా 2020 ఆగష్టు 12వ తేది, బుధవారం, ఉ. 7 గం.ల నుండి బిషప్ కె.ప్రతాప్ సిన్హా గారి సి.ఎస్.ఎన్.చర్చి కాంపౌండులో జరిగినది. కుండపోతగా వర్షాలు పడుచున్న అవసరతలలో ఉన్న సభ్యలందురు వచ్చి ఫెలోషిప్ నాయకులు ఏర్పరచిన నిత్యవసర వస్తువులతో పాటు కొంతధన సహాయము కూడా పొందుకొనియున్నారు. బిషప్ కె.ప్రతాప్ సిన్హా సభ్యలందరికి నిత్యావసర వస్తువుల కిట్స్ ఏర్పాటు చేసి యున్నారు. ఈ కార్యక్రమమునకు క్రింది పేర్కొన్న దైవజనులు, నాయకులు ఆర్ధికంగా సేవకులకు చేయూత నివ్వగా వాటిని సభ్యులందరికి ధన రూపములో సహాయము చేసియున్నాము.
ఈ కార్యక్రమములో బిషప్ కె.ప్రతాప్ సిన్హా, బిషప్ శుభాకర శాస్త్రి, రెవ.డా.కె.సుధీర్ కుమార్, రెవ.వి.ఎస్.సి.ప్రసాద్, రెవ.పి. టాటా విక్టర్, రెవ.జి.జాన్ ప్రసాద్, బ్రదర్ ఏలూరి షడ్రక్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రెవ.ఎన్.థామస్ భాస్కర్, రెవ.నాగుర్ మస్తాన్, రెవ.పి.ఎమ్.రాజు తదితర సభ్యులు పాల్గొని సహకరించినారు. సహకరించిన పెద్దలకు, నాయకులకు, దాతలకు అందరికి పాస్టర్లు ఫెలోషిప్ నాయకులు కృత్ఞతలు తెలియజేశారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

























































































Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech