Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

ఆదివారం మందిరాలకు వెళ్ళడానికి అనుకూలంగా కర్ఫ్యూ సడలించాలి

తూర్పు గోదావరి జిల్లా/30 November -0001గోకవరం : ఆదివారం మందిరాలకు వెళ్ళడానికి అనుకూలంగా కర్ఫ్యూ సడలించాలని ఆల్‌ ఇండియా క్రిష్టియన్‌ కౌన్సిల్‌ రాష్ట్ర అధ్యకక్షులు రెవ.జుహాని హలోనెన్‌ తూ.గో.జిల్లా కలెక్టర్‌కు వ్రాతపూర్వకముగా విన్నపములు తెలియజేసారు. కరోనా మహమ్మారిని అరికట్టే విషయంలో జిల్లాలో తీసుకుంటున్న జాగ్రత్తలు మరియు నివారణ చర్యలు ఎంతో అభినందనీయమని, రాత్రనక, పగలనక అహర్నిశలు అధికార యంత్రాంగం ప్రజల క్షేమం కొరకు ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. గడచిన కొన్ని వారాలుగా కేవలం ఆదివారం మాత్రమే 24 గం.ల కర్ఫ్యూ విధిస్తున్నారని తెలియజేసారు.

గతంలో లాక్‌ డౌన్‌ సడలించిన సమయంలో అన్ని దేవాలయాలలో మాస్కులు ధరిస్తూ, శానిటైజర్లు వాడుతూ, సామాజిక దూరం పాటిస్తూ, ప్రభుత్వం మరియు వైద్యులు సూచిస్తున్న అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఎంతో చక్కగా ఆరాధనలు జరుగించుకున్నాము అని అయితే హఠాత్తుగా విధించిన ఆదివారం కర్ఫ్యూ కారణంగా క్రైస్తవ సంఘాలు ఆధ్యాత్మికతకు దూరమై భాధపడుంటే మరోక ప్రక్క చాలామంది పేద దైవ సేవకులు, మందిరాలు, ఆరాధనల మీద ఆధారపడి జీవించేవారు ఆర్ధికంగా ఎంతో ఇబ్బందులు పడుచున్నారని, క్రైస్తవసమాజం మందిరాలకు వెళ్ళానికి అనుకూలంగా కర్ఫ్యూను సడలించాలని, క్రైస్తవ సంఘాలకూ, పేదదైవ సేవకులకు మేలు చేయాలని రెవ.జుహాని హలోనెన్‌ తెలియజేసారు.

171-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 14: 6 యేసు అతనితో, “నేను మార్గం, సత్యం మరియు జీవితం. నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి వద్దకు రారు. ”

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech