mahimasabdam.tv@gmail.com
+91 9390209376
తూర్పు గోదావరి జిల్లా/30 November -0001గోకవరం : ఆర్థికంగా వెనుకబడిన మహిళలు సమాజంలో గౌరవంగా బతకాలని సంకల్పంతో ఇవాంజికల్ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ వారికి స్వయం ఉపాధి టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి వారికి ఆర్థిక బలం చేకూర్చాలని కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేయడం జరిగిందని ఇవాంజికల్ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నేషనల్ డైరెక్టర్ రెవ.డా||జుహనీ హలోనెన్ అన్నారు. 2020 జూలై 4వ తేదీ, శుక్రవారం గోకవరం మండలంలోని కృష్ణునిపాలెం గ్రామం కేంద్రంగా నిర్వహించబడుతున్న ఇ.హెచ్.హెచ్.చర్చ్ క్యాంపస్‌లో ఎఫ్.ఇ.ఎం సంస్థ డైరెక్టర్ రెవ.డా||జుహనీ హలోనెన్ 40 మంది పేద స్త్రీలకు ఉచితంగా టైలరింగ్ మిషన్లు మరియు సర్టిఫికెట్లు అందజేశారు. వీరికి ఆరు నెలలు ఉచితంగా శిక్షణ ఇచ్చి, కుట్టుపనిలో ప్రతిభను కనబరిచిన వారికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యకక్షులు బిషప్ ప్రతాప్ సిన్హా కొమానపల్లి మ్లాడుతూ రెవ.డా|| జుహనీ హలోనెన్ మరియు వారి బృందం మరింత మందికి వివిధ రకాల సహాయ సహకారాలు అందించాలని కోరారు. తదుపరి రెవ.డా||జుహనీ హలోనెన్ కృష్ణునిపాలెం గ్రామానికి రెండు వందల పేద కుటుంబాలకు నిత్యవసర వస్తువులు మరియు కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా వలన ఏర్పడిన లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పి వరకు వారి సంస్థ ద్వారా ఇంచు మించు 25 వేల మందికి అనేక ప్రాంతాలలో నిత్యవసర వస్తువులు మరియు కూరగాయలు పంపిణీ చేస్తూ సహాయ సహకారాలు చేశామని అన్నారు. త్వరలోనే ఈ కరోనా మహమ్మారి బారినుండి అందరూ భయట పడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి సుహాసిని హలోనెన్, ఆర్మాస్ హలోనెన్, బిషప్ మోజెస్, రెవ.జెకర్యా, రెవ.రాజు, రెవ.నెల్లి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

























































































Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech