Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ వలనే ఇది సాధ్యము

తూర్పు గోదావరి జిల్లా/30 November -0001రాజమండ్రి  : సత్యసువార్తను సునామీ వలే ప్రపంచదేశములలో వ్యాప్తి కొరకు 24x7 క్షణం తీరక లేకుండా కష్టపడుతున్న నేటి తరం దేవుని చేతిలో బహుబలముగా వాడబడుచున్న యంగ్‌ డైనమిక్‌ సువార్తికులు, యంగ్‌ హోలీ టీమ్ డైరెక్టర్‌ డా|| జాన్‌వెస్లీ గారు 16 సంవత్సరముల క్రితము సువార్త బూర చేత పట్టుకొని మారుమూల గ్రామముల నుండి దేశములో అనేక పట్టణములలో సువార్తను ప్రకిస్తు మరియు ప్రపంచములోని 65 దేశములకు పైగా తిరిగి నసించిపోతున్న ప్రజలకు రక్షణ సువార్త అందించి అనేకులను క్రీస్తు వెలుగులోనికి నడపించారు. ఇటు సువార్త పరిచర్యలు, అటు సంఘపరిచర్య, జాన్‌వెస్లీ ఫౌండేషన్‌ ద్వారా సమాజ సేవ చేస్తూ ఇంకా అనేక కార్యక్రమములో బిజీగా వున్న ఈ సమయంలో కరోనా వైరస్‌ ప్రపంచ దేశములను వణికిస్తున్న సందర్భముగా భారతదేశము లాక్‌డౌన్‌ విధించింది. లాక్‌డౌన్‌లో డా|| జాన్‌వెస్లీ గారు రెట్టింపు కార్యక్రమాల ద్వారా ఇంకా ఎక్కువ బిజీ అయినారు.

జనతాకర్ఫ్యూ తరువాత లాక్‌డౌన్‌ విధించారు. మార్చి 23 నుండి క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్‌ ద్వారా ప్రతి ఆదివారం ఆరాధన యూట్యూబ్‌ లైవ్‌ ద్వారా ప్రత్యక్షకార్యక్రమములు అందిస్తూ.. ప్రతి రోజు ఉదయం 7 గం||ల నుండి ఉ|| 8 గం||ల వరకు ప్రేయర్‌ ఫర్‌ ది వరల్డ్‌ అను కార్యక్రమము ప్రారంభించారు. దీనికి విశేషమైన స్పందన వచ్చింది. మన దేశంలో వేలాది కుటుంబాలు మరియు 30 దేశాల నుండి విశ్వాసులు ప్రతి రోజు యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా లైవ్‌ కార్యక్రమములో పాల్గొని ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనేక మంది తమ సాక్ష్యములను పంపిచారు. సుమారు 75 రోజులు ఈ కార్యక్రమము జరిగింది. ఇప్పి వరకు యూట్యూబ్‌ చానెల్‌లో 6 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్‌ కలిగియున్న క్రైస్తవ సేవకులు డా||జాన్‌వెస్లీ. తరువాత క్రిష్టియన్‌ కపుల్స్‌ కాన్ఫెరెన్స్‌ అనే పోగ్రామ్‌ జూమ్‌ యాప్‌ ద్వారా ప్రతి బుధవారం ఈ మీటీంగ్‌లో సుమారుగా 25 దేశాల నుండి వందలాది కుటుంబాలు పాల్గొని దేవుని వాక్యం ద్వారా కుటుంబాలను కట్టుకొనుచున్నారు. సర్వశక్తుడైన దేవుని ద్వారా ప్రారంభించబడిన కుటుంబ వ్యవస్థను కాపాడుకొనుటకు ఈ కార్యక్రమము చాలా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరు దేవునిని మహిమపర్చారు. అలాగే యూత్‌ మీటీంగ్‌ ద్వారా అనేక మంది యవ్వనస్తులతో జూమ్‌ యాప్‌ ద్వారా మాట్లాడి, మంచి వాక్యముతో దేవునిలో బలపర్చబడ్డారు. అనారోగ్యములో ఉన్న పేద ప్రజల కొరకు క్రిష్టియన్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రారంభించి వారి  ద్వారా ప్రజలకు ఆయా రోగాలపై అవగాహణ కల్పించడం మరియు మెడికల్‌ క్యాప్‌లో అసోసియేషన్‌లో ఉన్న డాక్టర్స్‌ పాల్గొని రోగులకు వైద్యము అందించారు. మరియు ఈ లాక్‌డౌన్‌ వల్ల సంఘములన్ని మూతపడిన తరుణములో అనేక మంది దైవసేవకులు చాలా ఇబ్బందిపడ్డారు. వారికి చేయూత ఇవ్వవలెనని జాన్‌వెస్లీ ఇంటర్నేషనల్‌ మినిస్ట్రీస్‌ ద్వారా గ్రామ ప్రాంతములో, ట్రైబుల్‌ ఏరియాలో ఉన్న పేద సేవకులను గుర్తించి ఉభయతెలుగురాష్ట్రములో 3500 మందికి ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున ఇవ్వడము జరిగింది. జూన్‌ 1 నుండి 3 వరకు విబిఎస్‌ కార్యక్రమము ద్వారా సండేస్కూల్‌ పిల్లలకు మంచి స్కిట్స్ , యాక్షన్‌ సాంగ్స్‌, కథలు, పాటలు, వాక్యము యూట్యూబ్‌ లైవ్‌ ద్వారా అందించారు. బైబిలు స్టడీ ద్వారా అనేక వాక్య విశ్లేషణ, చరిత్ర నేపద్యము, సైన్స్‌ మొదలగు విషయమై అవగాహన కల్పించారు. జాన్‌వెస్లీ ఫౌండేషన్‌ ఆధ్వర్యములో దేశములో లాక్‌డౌన్‌ సమయములో ఇబ్బందులు పడుతున్న వారికి రోడ్డు ప్రక్కన ఆహారం లేక ఆకలితో ఉన్న వారికి, కడియం, చైతన్యనగర్‌లో నివసిస్తున్న కుష్టు రోగులకు, రామచంద్రపురంలో న్యూలైఫ్‌ చిల్డ్రన్‌ హోమ్‌లో నివసిస్తున్న వారికి మరియు కరోనా వైరస్‌ను అరికట్టే చర్యలో భాగంగా తమ కుటుంబాలను సహితం ప్రక్కన పెట్టి డ్యూటీ చేస్తున్న పోలీస్‌ డిపార్ట్‌మెంట్  వారికి, హాస్పటల్‌ స్టాఫ్‌కి, ఆశావర్క్‌ర్లుకు, సానిటైజేషన్‌ డిపార్ట్‌మెంట్  వారికి కొంత మందికి నిత్యవసర వస్తువులు, బియ్యం, మజ్జిగ, భోజనము, తదితర వస్తువులు ప్రతి దినము అందించారు. సుమారు వీటన్నికి 60 లక్షలు వరకు ఖర్చు చేసామని డా||జాన్‌వెస్లీ గారు తెలియజేసారు. ఈ కార్యక్రమములన్నిలో సహకరించిన శ్రీమతి బ్లెసివెస్లీ గారు మరియు క్రైస్ట్‌ వర్షిప్‌ స్టాప్‌ ఆర్ధికముగా, ప్రార్ధన సహకారములు అందించిన వారికి అందిరికి ప్రభువుపేరిట వందనములు తెలియజేసారు.పాస్టర్‌ లీగ్‌ ఆఫ్‌ ఇండియా ప్రారంభించి దీనిలో దేశవ్యాప్తముగా అనేక మంది దైవసేవకులు మెంబర్‌గా ఉండి పరిచర్య చేస్తున్నారు. యంగ్‌ హోలీ టీమ్‌ ద్వారా,  క్రిష్టియన్‌ ఎంప్లయిస్‌ అండ్‌ బిజినెస్‌ మెన్స్‌ అసోసియేషన్‌ ద్వారా, బైబిలు వండర్స్‌, స్కూల్‌ ఆఫ్‌ ఇవాంజిలిజమ్‌, షెకీనా పబ్లికేషన్స్‌ ఇంకా అనేక కార్యక్రమముల ద్వారా సువార్త పరిచర్య, సమాజసేవ చేస్తున్న ఇవన్నీ మా శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ వలనే ఇది సాధ్యము... అని దేవునికి మహిమ చెల్లించారు.

169-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

ఆదికాండము 2: 7 అప్పుడు దేవుడైన యెహోవా భూమి నుండి ధూళి మనిషిని ఏర్పరుచుకున్నాడు మరియు అతని నాసికా రంధ్రాలకు జీవన శ్వాసను ఇచ్చాడు, మరియు మనిషి ఒక జీవి అయ్యాడు.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech