mahimasabdam.tv@gmail.com
+91 9390209376
తూర్పు గోదావరి జిల్లా/30 November -0001కాకినాడ : కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా రెండు నెలల నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. లాక్‌డౌస్ 5.0 జూన్ 30 వరకు కొనసాగుతున్నప్పికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పికే అనేక సడలింపులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఈనెల 8 నుంచి ప్రార్ధనా మందిరాలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రార్థనా మందిరాలలో ఎలాిం జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.
1. ఒకవేళ ప్రార్ధనా సంస్థలు కంటెయిన్మ్‌ెం జోన్లలో ఉంటే మూసే ఉంచాలని స్పష్టం చేసింది.
2. 65 ఏళ్లకు పైబడిన వయసువారు, ఇతరత్రా రుగ్మతలు ఉన్నవారు, గర్భిణీలు, 10 ఏళ్లలోపు పిల్లలు ప్రార్థనాలయాలకు వెళ్లకపోవడం మంచిది.
3. ఇందుకు అనుగుణంగా ఆలయాలను పర్యవేక్షించే సంస్థలు భక్తులకు సూచనలు ఇవ్వాలి.
4. భక్తులు కనీసం ఆరడుగుల భౌతికదూరం తప్పకుండా పాించాలి. ఇందుకు సంబంధించి ప్రార్థనా స్థలాల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి.
5. ఫేస్ కవర్స్ లేదా మాస్కులు ఉన్నవారిని మాత్రమేలోనికి అనుమతించాలి.
6. వీలైనంత వరకూ సబ్బుతోగానీ (కనీసం 40 సెకన్లు), శానిటైజర్ (కనీసం 20 సెకన్లు)తోగానీ చేతులను అవకాశం ఉన్నపుడల్లా శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
7. దగ్గు, తమ్ములు వచ్చినపుడు తప్పనిసరిగా మోచేతలను అడ్డుపెట్టుకోవడం లేదా కర్చీఫ్, ిష్యూ పేపర్‌ను ఉపయోగించాలి. ిష్యూ పేపర్ ను పారవేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
8. ఆలయ పరిసర ప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని ఖచ్చితంగా నిషేదించాలి.
9. భక్తులందరికి ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్సాల్ చేసుకోవాలని సూచించాలి.
10. ప్రవేశ ద్వారాల వద్ద శానిటైజర్లు, థర్మల్ స్కానర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
11. దగ్గు, జలుబు, జ్వరం విం లక్షణాలు లేనివారినే అనుమతించాలి.
12. కోవిడ్-19 గురించి అవగాహన మరియు నివారణ చర్యలకు సంబంధించిన పోస్టర్లు ఏర్పాటు చేయాలి.
13. భక్తులు వీలైనంత వరకు తమ పాదరక్షలను వాహనాల్లోనే వదిలి వెళ్లాలి. మరీ అవసరమైతే ప్రతి వ్యక్తి / కుటుంబ సభ్యుల కొరకు ప్రత్యేక స్టాళ్ళలో ఉంచాలి.
14. పార్కింగ్ ప్రదేశం లోపల, బయట ఎక్కువ మంది గుమికూడి ఉండకూడదు. అక్కడ తప్పనిసరిగా భౌతిక దూరం పాించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
15. లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి ప్రత్యేక గ్‌ేలు ఉండేలా చూసుకోవాలి.
16. లోపలికి వచ్చేటప్పుడు కనీసం 6 అడుగుల దూరం ఉంటూ క్యూలైన్లో వెళ్లాలి.
17. వారికి వెళ్లే సమయంలోనే సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులు, కాళ్లు కడుక్కోవాలి.
18. మైక్ ద్వారా మ్లాడే వారు/గీతాలు ఆలపించే వారు తప్పనిసరిగా గౌజులు ధరించాలి. సామూహికంగా గీతాలను ఆలపించకూడదు.
19. ప్రార్థనాలయాల పరిసరాల్లో పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, నీి కుళాయిలు, కాళ్లు కడుక్కునే ప్రాంతాల వద్ద ప్రత్యేక దృష్టిసారించాలి.
20. ఆలయాల్లోని వివిధ అంతస్తులను, పరిసర ప్రాంతాలను తరచూ శుభ్రం చేయడం, క్రిమిసంహారం చేయడం తప్పనిసరి.
21. భక్తులు, సందర్శకులు వదిలి వెళ్లిన ఫేస్ కవర్లు, మాస్కులు, చేతి కవర్లను సరైన పద్దతిలో పారవేయడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి.
22. భక్తులు ఎప్పికప్పుడు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎలాిం అనారోగ్యకరమైన లక్షణాలు కనిపించినా వెంటనే జిల్లా హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయాలి.
- శ్రీ పి.ఎస్.ప్రభాకర్ రావు, జిల్లా మైనారిీల సంక్షేమాధికారి, మైనారిీల సంక్షేమ శాఖ, కాకినాడ, తూ||గో||జిల్లా.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.


























































































Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech