Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తాజా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

అత్యంత మహిమకరముగా జరిగిన పరిశుద్ధాత్మ పండుగ

తాజా/30 May 2026

ఆంధ్రప్రదేశ్ పెంటెకొస్టల్ పాస్టర్స్ & లీడర్స్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యములో 2026 మే 24 ఆదివారం సా॥ 5 గం॥లకు రాజమండ్రి, బుచ్చియ్యనగర్, రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా వర్షిప్ సెంటర్‌లో పరిశుద్ధాత్మ పండుగ అత్యంత ఘనముగా జరిగింది. ఈ సభల కన్వీనర్ పెంటెకొస్టల్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు అపొ.పి.జాన్ లాజరస్ గారు ముఖ్యఅతిథులను వేదిక మీదకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమమునకు అధ్యక్షులుగా రెవ.డా॥దీవెన కుమార్ గారు నడిపించారు. పాస్టర్ జాన్‌వెస్లీ గారు, పాస్టర్ ఎమ్.జ్యోతిరాజు గారు, దైవజనులు సామ్యూల్ కర్మోజి గారులు పరిశుద్ధాత్మ పండుగ సందర్భముగా ప్రత్యేక వాక్యసందేశములు అందించారు. బిషప్ ఎమ్.డానియేల్ గారు, రెవ.జాషువా కాళేపల్లి గారు, రెవ.పరిశుద్ధ రాజు గారు, బిషప్ ఎలీషా రాజు గారు, అపొ.ఆర్.సుధాకర్ గారు, రెవ.సంతోష్‌రెడ్డి గారు, రెవ.సజ్జా బర్నబాస్ గారు, రెవ.భగవాన్ దాస్ గారు, బిషప్ జ్యోతికుమార్ గారు తదితరులు శుభములు తెలియజేసారు. రెవ.ప్రకాష్ పాల్ గారు ప్రార్ధన చేయగా అపొ.జాన్ లాజరస్ గారు ఆశీర్వాదముతో ముగిసింది. ఈ మహాసభకు బహుజనసమÖహములు స్వచ్ఛందముగా వేలాదిగా తరలిరావడం విశేషం. యే అవాంతరములు లేకుండా నిరాటంకముగా దాదాపు నాలుగున్నర గంటలు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సేవకులు, ప్రజలు అనుభవించడం విశేషం. వేలాదిగా ప్రజలు దేవుని ఆత్మ అభిషేకము పొంది మహా ఆనందముతో ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. అందరికి సమృద్ధిగా ప్రేమ విందును ఏర్పాటు చేయడమైనది. ఈ పరిశుద్ధాత్మ ఉద్యమం కొరకు ప్రార్ధించండి. మీరును పాలిభాగస్థులుకండి.

6-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

రోమీయులు 6:23 పాపపు వేతనం మరణం, కాని దేవుని ఉచిత బహుమతి మన ప్రభువైన క్రీస్తుయేసులో నిత్యజీవము.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech