Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తాజా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

పోప్‌ ఫ్రాన్సిస్‌ చివరి కోరిక

తాజా/23 April 2025

చారిత్రకంగా చూస్తే... పోప్స్‌ మృతదేహాలను వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్స్‌ బాసిలికా నేలమాళిగల్లో ఖననం చేయడం రివాజు. ఈ సంప్రదాయాన్ని కాదని 1903లో పోప్‌ లియో-13 మృతదేహాన్ని ఆయన కోరిక మేరకు సెయింట్‌ జాన్‌ లేటరన్‌ బాసిలికాలో పూడ్చిపెట్టారు. ప్రస్తుత పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆఖరి కోరిక ఏంటో తెలుసా?
తన భౌతిక కాయాన్ని వాటికన్‌ వెలుపల సెయింట్‌ మేరీ మేజర్‌ బాసిలికా చర్చి(రోమ్‌)లో ఖననం చేయాలనేది ఆయన మనోవాంఛ. 2023 డిసెంబరు 12న మెక్సికన్‌ వార్తా సంస్థ ‘ఎన్‌ఎమ్‌’కు ఇంటర్వ్యూ ఇస్తూ ఫ్రాన్సిస్‌ తన అంత్యక్రియలకు సంబంధించి మనసులోని మాట బయటపెట్టారు. అంత్యక్రియల ఏర్పాట్ల గురించి ఆర్చ్‌ బిషప్‌ డీగో జియోవని రవేలీతో అంతకుముందే చర్చించినట్టు తెలిపారు.
సెయింట్‌ మేరీ మేజర్‌ బాసిలికా చర్చి విషయానికొస్తే... ఆరుగురు పోప్స్‌ మృతదేహాలను అక్కడ ఖననం చేశారు. చివరిసారిగా 1669లో పోప్‌ క్లెమెంట్‌-9 అంత్యక్రియలు అక్కడ నిర్వహించారు. శిశువైన జీసస్‌ను కన్య మేరీ ఎత్తుకున్న ‘సేలస్‌ పోపులి రోమని’ (రోమ్‌ ప్రజలకు రక్షణ) పెయింటింగ్‌ ఆ చర్చిలో ఉంది. ఆ చిత్రంతో పోప్‌ ఫ్రాన్సిస్‌ ది ప్రత్యేక అనుబంధం. పోప్‌ హోదాలో పర్యటనలు చేసి తిరిగొచ్చాక ఆయన దాని ఎదుట ప్రార్థనలు చేసేవారు.

1.5K-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 14: 6 యేసు అతనితో, “నేను మార్గం, సత్యం మరియు జీవితం. నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి వద్దకు రారు. ”

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech