Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

జాతీయం వార్తలు

తాజా వార్త
తాజా వార్త

ఉభయతెలుగు రాష్ట్రాల వైఎమ్‌సిఎ ట్రెజరర్‌గా బ్రదర్‌ డి.బి.జె.అంబేద్కర్‌ ఎన్నిక

జాతీయం/16 January 2025

రాజమండ్రి : 2025 జనవరి 11వ తేది శనివారం ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాలకు కలిపి సౌత్‌ ఈస్ట్‌ ఇండియా రీజియన్‌ ఆఫ్‌ వైఎమ్‌సిఎ కు (ఎస్‌ఇఐఆర్‌ఒవై) ట్రెజరర్‌గా రాజమండ్రి వైఎమ్‌సిఎ సెక్రెటరీ బ్రదర్‌ డి.బి.జె.అంబేద్కర్‌ని ఏకగ్రీవముగా ఎన్నిక కాబడినారు. ఆ తేదిన విజయవాడలోని సెయింట్‌ జోసఫ్‌ కన్వెంట్‌లో జరిగిని ఎన్ని కార్యక్రమాన్ని శ్రీ కె.ప్రభాకర్‌ ప్రారంభ ప్రార్ధనతో ఆరంభించబడి రెవ.డా॥ అరుణ్‌ దీపక్‌ (బాప్టిస్ట్‌ చర్చ్‌, విజయనగరం) వాక్య పరిచర్య చేసినారు. అనంతరం ఎన్నికలు నిర్వహించబడినవి. ఎన్నిక కాబడిన వివిధ పదవుల అభ్యర్ధులను ఇండియన్‌ వైఎమ్‌సిఎ అధ్యక్షులు డా॥ విన్సెంట్‌ జార్జ్‌ మరియు ఇండియా వైఎమ్‌సిఎ జనరల్‌ సెక్రెటరీ, శ్రీ బర్నబాస్‌, ఇండియన్‌ వైఎమ్‌సిఎ వైస్‌ ప్రెసిడెంట్‌ కుమారి బిస్తి విలియమ్స్‌, రీజనల్‌ చైర్మన్‌ డా॥ రొనాల్డ్‌ విలియమ్స్‌, ఎఇఎల్‌సి మోడరేటర్‌ బిషప్‌ ఫెడ్రిక్‌ పరదేశ్‌బాబు ఎన్నిక కాబడినవారిని వివిధ పదవులలో ప్రతిష్ఠ చేసినారు. అనంతరం రెవ.శ్రీకాంత్‌ జేమ్స్‌ ఆర్‌.ఆర్‌.కె. ప్రసంగించినారు. నూతనంగా ఎన్నిక కాబడిన అభ్యర్ధులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేసినారు చివరిగా ఎఇఎల్‌సి మోడరేటర్‌ బిషప్‌ ఫెడ్రిక్‌ పరదేశిబాబు ముగింపు ప్రార్ధన దీవెనతో సభ ముగించబడినది. ఈ కార్యక్రమములో రాజమండ్రి వైఎమ్‌సిఎ బోర్డ్‌ ఆర్డినేటర్స్‌ అయిన ఎమ్‌.దైవశ్యామ్‌, టి.మార్టిన్‌ సుధాకర్‌, కె.రవికుమార్‌, కె.బాబ్జి, పి.సునీల్‌ కుమార్‌, డి.విజయ సునంద్‌ మొదలగువారు పాల్గొని బ్రదర్‌ డి.బి.కె.అంబేద్కర్‌కి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసినారు.

550-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

రోమీయులు 6:23 పాపపు వేతనం మరణం, కాని దేవుని ఉచిత బహుమతి మన ప్రభువైన క్రీస్తుయేసులో నిత్యజీవము.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech