mahimasabdam.tv@gmail.com
+91 9390209376
గుంటూరు జిల్లా/30 November -0001వందల ఏళ్లుగా మాతృ భాష, ఆచారాల పరిరక్షణ, తమ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగిస్తామన్న యూదులు
గుంటూరు జిల్లా, కొత్తరెడ్డిపాలెంలో 111 ఏళ్లుగా నివాసం
గుంటూరు : రాష్ట్రంలో యూదు జాతీయులు దాదాపు 125 కుటుంబాలున్నట్టు అంచనా. వారిలో 40 కుటుంబాల వారు గుంటూరు జిల్లా, చేబ్రోలు సమీపంలోని, కొత్తరెడ్డిపాలెంలో జీవనం సాగిస్తున్నారు. వీరంతా ఎఫ్రాయిమ్ గోత్రీకులు. వీరి పూర్వీకులు తొలుత తెలంగాణ, అమరావతిలో నివసించారు. అయితే బ్రిష్ హయాంలో వీరిలో ఒకరికి కొత్తరెడ్డిపాలెం ప్రాంతంలో ఉద్యోగం రావడంతో వీరి మకాం ఇక్కడికి మారింది. ఈ 40 కుటుంబాల్లోని 300 మంది వందల ఏళ్లుగా తెలుగు జన జీవన స్రవంతిలో కలిసి పోయినా తమ మాతృభాష, ఆచార సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఏపీలో యూదుల ఏకైక ప్రార్థన మందిరం (సమాజ మందిరం) బెనె యాకోబ్ సినగాగె. ఇది 111 ఏళ్లుగా కొత్త రెడ్డిపాలెంలో కొనసాగుతోంది. మందిర నిర్వాహకుడి పేరు సాదోక్ యాకోబి. ఆయనతో పాటు ఏడుగురు పెద్దలుంటారు. వీరు మత ప్రచారం చేయరు. దేవుడి పేరు కూడా ఉచ్చరించరు. ప్రతి శనివారం విశ్రాంతి దినం (షబ్బాత్). ఆ రోజు అసలు పనులకు వెళ్లరు. ఆదివారం హెబ్రూ భాషకు సంబంధించిన స్కూలు నడుస్తుంది. హెబ్రూ క్యాలెండర్ ప్రకారం సృష్టి ఆరంభం నుంచి ప్రస్తుతం నడుస్తోంది. 5,781 సంవత్సరం. సృష్టి పుట్టిన దినాన్ని కొత్త సంవత్సరంగా పరిగణిస్తారు. తిషిరి (సెప్టెంబర్‌లో వస్తుంది) నెలతో వీరి సంవత్సరం ప్రారంభమవుతుంది. పండుగ దినాల్లో యూదులంతా కలుస్తారు. పెద్దల ఆధ్వర్యంలో జరిగే వీరి వివాహాల్లో వరకట్నం ఉండదు. వరుడే ఓలి ఇస్తారని సమాజ పెద్ద ఇబ్బక్ తెలియజేసారు.
వీరి ఉనికి అలా తెలిసింది :
బెనె ఎఫ్రాయిమ్ గోత్రాన్ని హెబ్రూలో మగద్దీన్ అంటారు. వీరిని మట్టుబెట్టేందుకు కుట్ర పన్ని, రెక్కీ నిర్వహించారన్న ఆరోపణలపై భారత ప్రభుత్వం 2004లో లష్కరే తోయిబాకు చెందిన 8 మందిని అరెస్ట్ చేసింది. అప్పుడే ఈ ప్రాంతంలో వీరి ఉనికి బహిర్గతమైంది. ఈ ప్రాంతంలోని ఎక్కువ మంది యూదులు వ్యవసాయ కూలీలు. ఉద్యోగాల్లో స్థిరపడ్డ వారూ ఉన్నారు.
లా ఆఫ్ రిటర్న్‌లో తమ వంతు కోసం ఎదురుచూపులు :
ఇజ్రాయిల్ దేశం తెచ్చిన లా ఆఫ్ రిటర్న్ జీవోతో ఎక్కడెక్కడో ఉంటున్న యూదు జాతీయులకు మాతృదేశం వెళ్లే అవకాశం లభించింది. మణిపూర్, మిజోరాం నుంచి మనష్ గోత్రీకులు పెద్ద సంఖ్యలో స్వదేశం వెళ్లారు. తమ వంతు కోసం ఇక్కడి వారు ఎదురుచూస్తున్నారు.
హెబ్రూకు తెలుగుకు సంబంధం :
హెబ్రూ భాషకు తెలుగుకు దగ్గర సంబంధం ఉందని కనుగొన్నామని. రెంటికీ సంబంధమున్న, ఒకే అర్థం కలిగిన 300 పదాలను గుర్తించామని, మరిన్ని విశేషాలతో త్వరలోనే పుస్తకం తీసుకువస్తాము అని మత పరిశోధకుడు షమ్ముయేల్ యాకోబి తెలియజేసారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.








Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech