mahimasabdam.tv@gmail.com
+91 9390209376
అంతర్జాతీయం/30 November -0001మన భావాన్ని పక్కవారికి తెలియజేయాలంటే ముఖ్యమైనది భాష. కోపం, బాధ, ఆనందం.. ఇలా ఏ బాధను పంచుకోవాలన్నా భాష ఎంతో ముఖ్యం. అయితే మరో ఐదేళ్లలో ఈ మాటలతో ఇక పనిలేకుండా పోతుందా..? అంటే అవుననే చెబుతున్నాడు.. అమెరికన్ టెక్నాలజీ కంపెనీ టెస్లా అధినేత ఎలన్ మస్క్.
మారుతున్న కాలంతో పాటే టెక్నాలజీ వినియోగం శరవేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు మనిషి చేసే పనులను సులభతరం చేయడం కోసమే టెక్నాలజీని వినియోగించగా మనిషి మెదడులోనే చిప్ పెట్టే స్థాయికి మనిషి ఎదగడం గమనార్హం. అమెరికన్ టెక్నాలజీ కంపెనీ టెస్లా అధినేత ఎలన్ మస్క్ త్వరలో మనిషి మెదడులో చిప్ ను అమర్చే టెక్నాలజీ అందుబాటులోకి రాబోతుందని తెలిపారు. ఎలన్ మస్క్ ఇప్పటికే పంది బ్రెయిన్ లో ఒక చిప్ ను అమర్చారు. కాయిన్ సైజ్ లో ఉండే ఈ చిప్ సహాయంతో పంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని ఎలన్ తెలిపారు. దాదాపు 60 రోజుల పాటు ఎలన్ చిప్ ను పంది మెదడులో ఉంచబోతున్నారు. పందిపై చేసిన ప్రయోగాలు సక్సెస్ అయితే భవిష్యత్తులో మానవులు భాషతో సంబంధం లేకుండా చిప్ ల ద్వారా మన భావాలను అవతలి వ్యక్తులకు సులభంగా తెలియజేసే వీలు కలుగుతుందని అన్నారు.
తన న్యూరాలింక్ కంపెనీ ఓ సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోందని, అది అందుబాటులోకి వస్తే ఇక మానవ భాషతో పనిఉండదని చెప్పుకొచ్చాడు. దీని ప్రకారం ఓ చిప్‌ను మానవ మెదడుకు అనుసంధానం చేయడం జరుగుతుందని, దాని ద్వారా అతడి భావాలను మరో చిప్ ధరించిన వ్యక్తికి చేరతాయని వివరించాడు. మరో ఏడాదిలో దీనిపై ప్రాక్టికల్‌గా ప్రయోగాలు చేయనున్నట్లు చెప్పాడు. పుర్రె భాగంలో ఈ చిప్ అమర్చి దాని ద్వారా ఎలక్ట్రోడ్‌లను మెదడులోని నాడీ కణాలకు అనుసంధానం చేయడం జరుగుతుందని మస్క్ వివరించాడు. దీని ద్వారా మెదడులోని ఏ భాగాన్నైనా అనుసంధానం చేయవచ్చని, కంటి చూపు వంటి మెదడుకు సంబంధించిన ఏ వ్యాధినైనా దీని ద్వారా నయం చేయవచ్చని తెలిపాడు.
మొదటి దశ పరికరాలు మెదడులోని వ్యాధులను, సమస్యలను నయం చేసేందుకు ఉపయోగపడతాయని, ఈ చిప్ సహాయంతో మనుషులు ఎదుర్కొంటున్న అల్జీరియా, డైమెన్షియా, వెన్నముక సంబంధిత సమస్యలను సులభంగా నయం చేయవచ్చని సమాచారం. ఆ తరువాత మరింత అభివృద్ధి చేయనున్నామని మస్క్ వివరించాడు. ‘మీ భావాలను వేగంగా, కచ్చితంగా ఎదుటివారికి ఈ పరికరాలు చేరవేయగలవని, ఇక భాషతో పని ఉండకపోవచ్చు. ఒకవేళ వేరే వేరే భాషల్లో మాట్లాడాలనుకుంటే చిప్‌లో కొత్త సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంద’ని మస్క్ పేర్కొన్నాడు. ఈ పరికరాన్ని ఐదేళ్లలో వినియోగంలోకి తీసుకురానున్నమని, పదేళ్లలో పూర్తిగా అందుబాటులో ఉంచుతామని వివరించారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.





.jpeg)










.jpeg)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech