mahimasabdam.tv@gmail.com
+91 9390209376
మనము బైబిలును చదవాలి, అధ్యయనం చేయాలి. ఎందుకంటె మనకు ఇవ్వబడిన దేవుని వాక్యమును కాబట్టి.బైబిలు నిక్ఖర్చిగా "దైవావేశమువలన" కలిగినది (2 తిమోతీ 3:16).మరొక మాటలలొ , అది దేవునినిండి మనకు వచ్చిన వాక్కు. వేదాంతపండితులు చాల రకాలుగా ప్రశ్నించిన ప్రశ్నలన్నిటికి జవాబు దేవుడు లేఖనాలలో గుప్తపరచి యున్నారు. జీవిత ఉధ్దేశ్యమేమిటి? నేను ఎక్కడనుండి వచ్చాను? మరణము తర్వాత జీవం ఉందా? నేను పరలోకమునకు ఏవిధంగా వెళ్లగలను? లోకము చెడుతో ఎందుకు నిండియుంది? నేను మంచిచేయటానికి ఎందుకు కష్టపడాలి? వీటికి తోడుగా పెద్డ "ప్రశ్నలు" బైబిలు చాల ప్రయోగాత్మకంగా సలహాలను ఈ విషయాలలో ఇస్తుంది? నా తోటి భాగస్వామిలోనేనేమి చూడాలి? నేను విజయవంతమైన వివాహములను ఏవిధంగా కలిగియుండగలను? నిజమైన మంచి స్నేహితునిగా ఎలాగుండగలను? మంచి తల్లి/ తండ్రిగా ఏవిధంగావుండగలను? విజయము అంటే ఏంటీ? నేను ఏవిధంగా దానిని స్పంధించగలను? నేనెలా మార్పునొందగలను? నిజంగా జీవితంలో నన్నేమి ప్రభావితంచేయును? నేను వెనుకకు తిరిగి భాధనొందకుండ ఏవిధంగా జీవించగలను? పక్షపాతంగా జరుగుతున్న పరిస్థితులకు మరియు చెడు విషయాలకు మించి జీవితంలో విజయవంతంగావుండటానికి ఆ విషయాలపట్ల నేనేవిధంగా స్పందించగలను?
బైబిలును మనము చదవటం/ అధ్యయనం ఎందుకంటే పూర్తిగా నమాదగినది మరియు తప్పులులేనిది. పరిశుధ్దగ్రంధములు అనే చెప్పబడిన వాటిలో బైబిలు ప్రత్యేకమైనది అది నైతిక భోధనలనే భోధించుచూ "నన్ను నమ్మండి" అని చెప్పదు. దానికి మించి వందలకొలదిలోనున్న ప్రవచనాలను విఫులంగా పరీక్షించే అర్హతమనకున్న్నది. చారిత్రాత్మక రికార్డును వ్రాతలను పరీక్షించటానికి, శాస్త్రీయపరమైన సత్యాలను పోల్చి పరీక్షించుటకు అర్హతకలిగినవారిలో వున్నాము. ఎవరైతే బైబిలులో తప్పులున్నాయి అని ఖండిస్తారో సత్యము చూస్తున్నపుడు వారు చెవులు సత్యమువైపు మందగిలినవారైన వారవవచ్చు. యేసు ఒకసారి ఈవిధంగా అడిగారు, "నీ పాపములు క్షమింఅప్బడినవి" లేక నీవు లేచి నీ పరుపెత్తికొని వెళ్లుమని చెప్ఫ్ట సులభమా అని అడిగారు. ఆ తరువాత తన్నుతాను ఋజువు చేసుకున్నాడు పాపములు క్షమించాటనికి అర్హతకలిగినవాడని (మన కండ్లతో చూడలేని వాస్తవం), పక్షవాయువు గలవానికి స్వస్థపరచుటవలన (ఇవి చుట్టునున్న వారందరు కండ్లారాచూచి పరీక్షించగలిగింది). అలాగే, దేవుని వాక్యం సత్యమని ఖచ్చితమైన నిశ్చయత కలిగియుండవచ్చు. అప్పుడు అత్మీయ విషయాలు నీవు చర్చించవచ్చు. మనము ఏదైతే మన ఇంద్రియాలతో పరీక్షించలేమో వాటిని అవి సత్యమేమో అని ఆ విషయాలలో పరీక్షించటానికి , అవి ఏవనగా చారిత్రాత్మక ఖండితం, శాస్త్రీయంగా ఖండితం, ప్రవచనాత్మకంగా ఖండితము కాదో అవునో అని వాటికవే పరీక్షలద్వారా సత్యాన్ని బయలుపరచును.
బైబిలును మనము చదవటం/ అధ్యయనం ఎందుకంటే దేవుడు మార్పు లేనివాడు మరియు కారణము మానజాతి స్వభావములో మార్పుండదు కాబాట్టి. అది ఎప్పుడో వ్రాయబడినప్పుడు ఎలావర్తించేదో ఇప్పుడును అదేవిధంగా మనకు సమకాలీనమైనదై వర్తిస్తుంది. శాస్త్రీయ పరిఙ్ఞానములో మార్పు రావచ్చును గాని మానవజాతి స్వభావము వాని కోర్కెలలో మార్పుచెందదు. బైబిలు చారిత్రక పుటలను చూచినట్లయితే మనము కనుగొనవచ్చు. మనము ఒకవేళ వ్యక్తితో వ్యక్తికి కలిగివున్న సంభంధం గురించి లేక సమాజాల గురించి అని కనుగొనవచ్చు. "సూర్యుని క్రింద నూతనమైనది దేదియు లేదు" (ప్రసంగి 1:9). తప్పుడు స్థలాలలో వెతుకుతున్నట్లయితే - దేవుడు- మననుండి మరి కృపగలిగిన సృష్టికర్త- ఏదైతే మనకు శాశ్వతానందానిస్తుందో చెప్తుంది. ఆయన ప్రత్యక్ష ప్రరచబడిన వాక్యం, బైబిలు. చాలా ప్రాముఖ్యమైనది అనిది యేసు ప్రభువు వారు చెప్పిదేంటంటే "మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని దేవుని నోటనుండివచ్చు ప్రతిమాటవలనను జీవించును" (మత్తయి 4:4). మరొకరీతిలో మనము పూర్తిమంతముగా జీవితం జీవించాలంటే దేవుడు ఉద్డేశించినట్లుగా, మనము దేవుడు వ్రాసిన వాక్యాన్ని చదివి దానిని లక్ష్యము చేయాలి. " చాలా తప్పుడు భోధకులను బట్టి.
బైబిలు మనము కొలతగీసే బద్దగా ఇవ్వబడింది సత్యాన్ని తప్పుని వేరుపరచలేం చాలా తప్పుడు భోధకులను బట్టి. సత్యాన్ని తప్పుని వేరుపరచటానికి బైబిలు మనకు కొలతగీసే బద్దగా ఇవ్వబడింది. దేవునికేది ఇష్టమో అది చెప్తుంది. దేవుని పట్ల తప్పుడు అవగాహన కలిగియుండుటకు మనము విగ్రహాన్ని లేక అబద్దదేవతలను ఆరాధించటమే. మనము ఆరాధించే దేవుడు అట్లాంటి దేవుడు కాదు. బైబిలు భోధిస్తుంది ఒకడు ఏ విధంగా పరలోకమునకు వెళ్ళగలడో , అది కేవలము మంచిగా జీవించుటవలన కాదు లేక బాప్తిస్మము పొందుటవలన కాదు లేక ఈ లోకములో ఏదైనా చేస్తే కాదు ( (యోహాను 14:6; ఎఫెసీయులకు 2:1-10; యెషయా 53:6; రోమా 3:10-18, 5:8, 6:23, 10:9-13). దీనితో పాటు, దేవుని వాక్యం ప్రభోధిస్తుంది దేవుడు ఎంతగా మనలను ప్రేమిస్తున్నాడు(రోమా 5:6-8; యోహాను 3:16). ఈ రితిగా మనము నేర్చుకుంటున్నపుడు దానికి బదులుగా మనము ఆయన ప్రేమించుటకు ఆకర్షితులమవుతాం ( 1యోహాను 1:14).
బైబిలు మనలను తర్ఫీదు చేస్తుంది దేవునిని సేవించాలని (2 తిమోతి 3:17; ఎఫెసీయులకు 6:17; హెబ్రీయులకు 4:12). అది మనలను పాపములనుండి మరియు అంతిమ పర్యవసానమునుండి ఏవిధంగా రక్షింపబడాలో అని తెలుసుకొనుటకై తోడ్పడుతుంది (2 తిమోతి 3:15. దేవుని వాక్యమును ధ్యానించుట మరియు ఆయన భోధనలకు విధేయత చూపించుట, జీవితంలో విజయాన్నిచ్చేదిగా వుంటుంది(యెహోషువ 1:8; యాకోబు 1:25). దేవునివాక్యం మనలోనున్న పాపమును కనిపెట్టుటకు మరియు దానినుండి విముక్తిపొందుటకు సహాపయపడును (కీర్తనలు 119:9, 11).అది మన జీవితాన్ని నడిపించేది, మన భోధకులకన్నా మనలను తెలివి మంతులగా గాచేయును (కీర్తనలు 32:8, 119:99; సామెతలు 1:6). బైబిలు మనలను నిరంతరము నిలిచివుండని వాటినుండి, మన జీవితానికి సంభంధించని విషయాలపై కేంద్రీకరించి సంవత్సరాలను నిరూపయోగం చేయకుండా మనలను కాపడును (మత్తయి 7:24-27).
బైబిలును చదువుట మరియు ధ్యానించుట అనేది ఈ లోకములో తీపిగా కనిపించే ఆకర్షణలలో కొక్కెములా పట్టుకునే పాపపూరితమైన శోధనలలో, మనము వాటిని స్వంతం చేసుకోకుండా ఒకరినొకరి తప్పిదములను మనం సొంతం చేసుకోకుండా వాటినుండి నేర్చుకొనవచ్చు. అనుభవమే మనకు గొప్ప భోధకుడు, గాని పాపమునుండి నేర్చుకొనడానికి వచ్చేటప్పుడు ఇది నిజంగా కష్టతరమైన కౄరమైన భోధకుడు. ఇతరుల తప్పులనుండి మనను నేర్చుకొనుట చాలా ఉత్తమమైనది. బైబిలులోని అనేకమంది జీవితవిషేషాలు నుండి నేర్చుకొనవచ్చు. అందులో కొన్ని మంచి మరియు చెడుకు వేర్వేరు సమయాలలో వారి జీవితాలలే రోల్ మోడల్స్ గానున్నవి. ఉదాహరణకు, దావీదు, గొల్యాతును ఓడించునపుడు, మనలను ఎదుర్కోవాలని ఉద్దేశించినవాటన్నిటిలో దేవుడు గొప్పవాడని భోధిస్తుంది ( 1 సమూయేలు 17), తన్ను తాను బత్షెబతో వ్యభిచారము చేయుటకు శోధనలో పడినప్పుడు ఆ క్షణమాత్రపు ఆనాందాన్నికోసం నిరంతరము మరియు ఘోరమైన పర్యవసానానికి ఏవిధంగా గురవుతారో దానిగూర్చి ప్రత్యక్షపరస్తుంది( 2 సమూయేలు 11)
బైబిలు అనేది కేవలము చదువుటకు ఒక పుస్తకము మాత్రమే కాదు. ఈ పుస్తకమును అధ్యయించి దానిని అన్వయించుకొనుటకే. మరొకలాగైతే, అది ఆహారాన్ని నమలుకుండా మ్రింగివేయుటకు ప్రయత్నించి మరియు దానిని నోటినుండి ఉమ్మివేయుటకే- ఎటువంటి పోషకపధార్థాలను మనము పొందుకొనలేము. బైబిలు దేవుని వాక్యము. అది స్వభావపుయొక్క సరిహద్దులను బంధించేదిగా ఉంటుంది. మనము వాటిని త్రోయపుచ్చవచ్చు, గాని మనకు మనమే నష్టాన్ని తెచ్చుకున్నవారమౌతాం, ఏదో మనము గురుత్వాకర్షణ శక్తిని తృణీకరించినట్లవుతుంది. మనజీవితాలకు బైబిలు ఎంత ప్రాముఖ్యమో అనేది అది ఖచ్చితంగా నొక్కి వక్కాణించదు. బైబిలును అధ్యనయనము చేయుఇట ఒక బంగారపు గనిని త్రవ్విఅడంతో పోలుస్తున్నారు. మనము కొద్ది ప్రయత్నము చేసినట్లయితే "నీటి ప్రవాహమునుండి నుండి ప్రశస్తమైన రాళ్ళను జల్లించి వెతికితీసినట్లే" ఎక్కడో కొంచెము మాత్రమే బంగారపు పొడిని కనుగొనవచ్చు. గాని మనము ఎక్కువగా ప్రయత్నించి పరిశోధించి త్రవ్వినట్లయితే మనము కష్టపడిన రీతికి మరి బహుగా ప్రతిఫలము పొందుతాం.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.
Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech