mahimasabdam.tv@gmail.com
+91 9390209376
-- “నేను ఎలా అవ్వాలనుకుంటే అలా అవుతాను.” ఆ మాటలు దేవుని పేరును పూర్తిగా నిర్వచించడం లేదు. కానీ, దేవుని వ్యక్తిత్వంలోని ఓ పార్శ్వాన్ని వెల్లడిస్తున్నాయి. అదేమిటంటే, ప్రతీ పరిస్థితిలో యెహోవా తన సంకల్పం నెరవేర్చడానికి ఎలా అవసరమైతే అలా అవుతాడు. కాబట్టి, యెహోవా అనే పేరులో ఆ భావం ఉన్నా, అది తాను అనుకున్నది అవ్వడానికి మాత్రమే పరిమితం కాదు. తన సంకల్పం నెరవేర్చడానికి తన సృష్టిని కూడా ఎలా అవ్వాలనుకుంటే అలా అయ్యేలా చేయగలడు.
టెట్రగ్రామటన్‌తో (יהוה) సూచించబడే దేవుని పేరు హీబ్రూ లేఖనాల అసలు ప్రతుల్లో ఇంచుమించు 7,000 సార్లు ఉందని బైబిలు విద్వాంసులు ఒప్పుకుంటున్నారు. అయితే, క్రైస్తవ గ్రీకు లేఖనాల అసలు ప్రతుల్లో మాత్రం దేవుని పేరు లేదన్నది చాలామంది అభిప్రాయం. అందుకే, కొత్త నిబంధనను అనువదించేటప్పుడు చాలా ఆధునిక ఇంగ్లీష్ బైబిళ్లు యెహోవా అనే పేరును ఉపయోగించలేదు. టెట్రగ్రామటన్ ఉన్న హీబ్రూ లేఖనాలను ఉల్లేఖిస్తున్న వాక్యాల్ని అనువదిస్తున్నప్పుడు కూడా చాలామంది అనువాదకులు దేవుని పేరుకు బదులు “ప్రభువు” అని వాడారు.
ఇంగ్లీషులో ఉన్న పరిశుద్ధ లేఖనాల నూతనలోక అనువాదము మాత్రం ఈ పద్ధతిని పాటించలేదు. అది క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో యెహోవా పేరును మొత్తం 237 సార్లు ఉపయోగించింది. అలా పెట్టాలని నిర్ణయించడానికి అనువాదకులు రెండు ప్రాముఖ్యమైన విషయాల్ని పరిగణనలోకి తీసుకున్నారు: (1) నేడు మన దగ్గర ఉన్న గ్రీకు రాతప్రతులు అసలైనవి కావు. నేడు కొన్ని వేల ప్రతులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో చాలా ప్రతులు, అసలు ప్రతులు రూపొందిన కనీసం రెండు శతాబ్దాల తర్వాతే తయారయ్యాయి. (2) అప్పటికే వాటిని నకలు చేసినవాళ్లు టెట్రగ్రామటన్ స్థానంలో “ప్రభువు” అనే పదానికి ఉపయోగించే గ్రీకు పదమైన Kyʹri·os పెట్టేశారు లేదా అప్పటికే అలా పెట్టేసిన ప్రతుల నుండి నకలు చేశారు.
గ్రీకు అసలు రాతప్రతుల్లో టెట్రగ్రామటన్ ఉండేదని అనేందుకు గట్టి రుజువులున్నాయని నూతనలోక బైబిలు అనువాద కమిటీ నిర్ధారించుకుంది. ఆ నిర్ధారణకు ఆధారం ఈ కింది రుజువులే:
యేసు, ఆయన అపొస్తలులు జీవించిన కాలంలో వాడుకలో ఉన్న హీబ్రూ లేఖనాల ప్రతుల్లో అన్నిచోట్లా టెట్రగ్రామటన్ ఉండేది. గతంలో కొందరు ఆ విషయాన్ని ఖండించారు. కానీ ఇప్పుడు, మొదటి శతాబ్దానికి చెందిన హీబ్రూ లేఖనాల ప్రతులు కుమ్రన్ అనే ప్రాంతం దగ్గర వెలుగులోకి రావడంతో టెట్రగ్రామటన్ ఉండేదన్న వాస్తవం తిరుగులేని విధంగా రుజువైంది.
యేసు, ఆయన అపొస్తలులు జీవించిన కాలంలో ఉన్న హీబ్రూ లేఖనాల గ్రీకు అనువాదాల్లో కూడా టెట్రగ్రామటన్ ఉండేది. హీబ్రూ లేఖనాల గ్రీకు సెప్టువజింటు అనువాద రాతప్రతుల్లో టెట్రగ్రామటన్ లేదని విద్వాంసులు శతాబ్దాలుగా అనుకుంటూ వచ్చారు. ఆ తర్వాత 20వ శతాబ్దం మధ్యకాలంలో, యేసు కాలంలో వాడుకలో ఉన్న గ్రీకు సెప్టువజింటు అనువాదపు అతి పురాతన రాతప్రతుల ముక్కలు కొన్ని విద్వాంసుల దృష్టికి వచ్చాయి. వాటిలో దేవుని పేరు హీబ్రూ అక్షరాల్లో ఉంది. అంటే, యేసు కాలంలోని హీబ్రూ లేఖనాల గ్రీకు భాషా ప్రతుల్లో దేవుని పేరు ఉండేది. అయితే సా.శ. నాలుగవ శతాబ్దానికల్లా, కోడెక్స్ వాటికానస్, కోడెక్స్ సైనైటికస్ వంటి ప్రముఖ గ్రీకు సెప్టువజింటు రాతప్రతుల్లోని ఆదికాండము నుండి మలాకీ వరకున్న పుస్తకాల్లో దేవుని పేరు లేదు. (కానీ, దానికి ముందున్న రాతప్రతుల్లో అది ఉండేది.) కాబట్టి, ఆ కాలం నుండి భద్రపరుస్తూ వచ్చిన ప్రతుల్లోని కొత్త నిబంధనలో లేదా గ్రీకు లేఖనాల్లో దేవుని పేరు లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
యేసు స్పష్టంగా ఇలా చెప్పాడు: “నా తండ్రి నామమున వచ్చియున్నాను.” “తండ్రి నామమందు” పనులు చేశానని కూడా ఆయన నొక్కి చెప్పాడు
యేసు తరచూ దేవుని పేరు గురించి మాట్లాడాడని, ఇతరులకు ఆ పేరును తెలియజేశాడని క్రైస్తవ గ్రీకు లేఖనాలే నివేదిస్తున్నాయి. (యోహాను 17:6, 11, 12, 26) యేసు స్పష్టంగా ఇలా చెప్పాడు: “నా తండ్రి నామమున వచ్చియున్నాను.” “తండ్రి నామమందు” పనులు చేశానని కూడా ఆయన నొక్కి చెప్పాడు.—యోహాను 5:43; 10:25.
హీబ్రూ లేఖనాల్లాగే క్రైస్తవ గ్రీకు లేఖనాలను కూడా దేవుడే ప్రేరేపించి రాయించాడు కాబట్టి, అవి కూడా దేవుని వాక్యంలో భాగమే కాబట్టి ఆ ప్రతుల్లో యెహోవా పేరు ఉన్నట్టుండి ఒక్కసారిగా మాయమవ్వడం ఏమిటి? అది అసలు తర్కబద్ధంగా ఉందా? దాదాపు సా.శ. మొదటి శతాబ్దం మధ్యకాలంలో, యెరూషలేములోని పెద్దలతో శిష్యుడైన యాకోబు ఇలా అన్నాడు: “అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను వివరించి యున్నాడు.” (అపొస్తలుల కార్యములు 15:14) మొదటి శతాబ్దంలో దేవుని పేరు ఎవ్వరికీ తెలిసివుండకపోతే లేదా ఆ పేరును ఎవ్వరూ వాడివుండకపోతే యాకోబు ఆ మాట అనడంలో అర్థముండదు.
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో దేవుని పేరు సంక్షిప్త రూపంలో కనబడుతుంది. ప్రకటన 19:1, 3, 4, 6వచనాల్లో దేవుని పేరు అధస్సూచిలో “అల్లెలూయా” (“Hallelujah”) అనే పదంలో నిక్షిప్తమై ఉంది. అది “యెహోవాను స్తుతించండి” (“Praise Jah”) అని అర్థమిచ్చే హీబ్రూ పదం నుండి వచ్చింది. ఇందులో “Jah” అనే పదం Jehovah అనే పేరుకు సంక్షిప్త రూపం. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఉన్న చాలా పేర్లు దేవుని పేరు నుండి తీసుకున్నవే. అంతెందుకు, యేసు అనే పేరుకు “యెహోవాయే రక్షణ” అని అర్థమని కొన్ని రెఫరెన్సు గ్రంథాలు వివరిస్తున్నాయి.
యూదా క్రైస్తవులు తమ రచనల్లో దేవుని పేరును వాడారని తొలి యూదా రచనలు చూపిస్తున్నాయి. క్రైస్తవ రాతల్ని విశ్రాంతి దినాన కాల్చేయవచ్చని, దేవుని పేరు ఉన్న భాగాల్ని కూడా కాల్చేయవచ్చని దాదాపు సా.శ. 300కల్లా పూర్తయిన టొసెఫ్టా అనే మౌఖిక సూత్రాల పుస్తకం చెబుతోంది. అదే పుస్తకంలో, సా.శ. రెండవ శతాబ్దం ఆరంభంలో జీవించిన గలిలయుడైన రబ్బై యోసే చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. ఆయన ఏమన్నాడంటే, వారంలోని వేరే రోజుల్లో “ఆ రాతల్లో [ఇవి క్రైస్తవ రాతలని అనుకుంటున్నారు] దేవుని పేరు ఉన్న భాగాల్ని కత్తిరించి పక్కనబెట్టే వాళ్లు, మిగతా భాగాన్ని తగలబెట్టేవాళ్లు.”
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఉల్లేఖించిన హీబ్రూ లేఖనాల్లో దేవుని పేరు ఉండేవుంటుందని కొందరు బైబిలు విద్వాంసులు ఒప్పుకుంటున్నారు. “కొత్త నిబంధనలో టెట్రగ్రామటన్” అనే శీర్షిక కింద ది యాంకర్ బైబిల్ డిక్షనరీ ఇలా చెబుతోంది: “మొదటి కొత్త నిబంధన ప్రతులు రాయబడినప్పుడు అందులో పాత నిబంధన నుండి ఉల్లేఖించిన కొన్ని భాగాల్లో లేదా అన్ని భాగాల్లో దేవుని పేరైన టెట్రగ్రామటన్ యావే ఉందని అనడానికి కొన్ని రుజువులు ఉన్నాయి.” విద్వాంసుడైన జార్జ్ హావర్డ్ ఇలా అన్నాడు: “తొలి క్రైస్తవులు ఉపయోగించిన గ్రీకు బైబిలు [సెప్టువజింటు] ప్రతుల్లో టెట్రగ్రామ్ ఇంకా ఉండేది కాబట్టి, లేఖనాన్ని ఉల్లేఖిస్తున్నప్పుడు కొత్త నిబంధన రచయితలు టెట్రగ్రామ్‌ని అలాగే ఉంచారని నమ్మడం సబబే.”
గుర్తింపు పొందిన బైబిలు అనువాదకులు క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో దేవుని పేరును ఉపయోగించారు. వీళ్లలో కొందరు, నూతనలోక అనువాదం రూపొందడానికి చాలాకాలం క్రితం నుండే అలా ఉపయోగించారు. ఆ అనువాదకులు, వాళ్ల అనువాదాలు ఇవి: ఎ లిటరల్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ . . . ఫ్రమ్ ద టెక్స్‌ట్ ఆఫ్ ద వాటికన్ మ్యానుస్క్రిప్ట్, హర్మన్ హేయిన్‌ఫెట్టర్ అనువాదం (1863); ది ఎ
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.
Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech