Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

హీబ్రూ లేఖనాల్లో దేవుని పేరు
03 March 2019

హీబ్రూ లేఖనాల్లో దేవుని పేరు

יהוה అనే నాలుగు హీబ్రూ హల్లులతో సూచించబడే దేవుని పేరు హీబ్రూ లేఖనాల్లో ఇంచుమించు 7,000 సార్లు కనిపిస్తుంది. టెట్రగ్రామటన్‌ అని పిలిచే ఆ నాలుగు అక్షరాలను నూతనలోక అనువాదము (ఆంగ్లం) “జెహోవా” (యెహోవా) అని అనువదించింది. బైబిల్లో ఎక్కువసార్లు కనిపించే పేరు అదే. దేవుడు ప్రేరేపించిన రచయితలు ఆయన ప్రస్తావన తెచ్చినప్పుడు “సర్వశక్తుడు,” “సర్వోన్నతుడు,” “ప్రభువు” లాంటి చాలా బిరుదులు, వర్ణనలు వాడినా, దేవుణ్ణి గుర్తించడానికి మాత్రం వాళ్లు ఆ నాలుగు అక్షరాల పేరునే వాడారు.స్వయాన యెహోవా దేవుడే తన పేరు వాడమని బైబిలు రచయితల్ని నిర్దేశించాడు. ఉదాహరణకు, యోవేలు ప్రవక్త ఇలా రాసేలా యెహోవా ప్రేరేపించాడు: “యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.” (యోవేలు 2:32) అంతేకాదు, దేవుడు ఓ కీర్తనకర్తతో ఇలా రాయించాడు: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక.” (కీర్తన 83:18) ఆ మాటకొస్తే, అప్పట్లో దేవుని సేవకులు పాడేలా, వల్లించేలా కవితా శైలిలో కూర్చిన కీర్తనల గ్రంథంలోనే దేవుని పేరు దాదాపు 700 సార్లు కనిపిస్తుంది. అలాంటిది, చాలా బైబిలు అనువాదాల్లో దేవుని పేరు ఎందుకు లేనట్టు? దేవుని పేరును ఖచ్చితంగా ఎలా ఉచ్చరించాలో ఎందుకు తెలియదు? అసలు, యెహోవా అనే పేరుకు అర్థమేమిటి?

చాలా బైబిలు అనువాదాల్లో దేవుని పేరు ఎందుకు లేనట్టు? దానికి రకరకాల కారణాలున్నాయి. సర్వశక్తిగల దేవుణ్ణి సంబోధించడానికి ఒక ప్రత్యేకమైన పేరంటూ ఏదీ అవసరం లేదని కొందరు అనుకుంటున్నారు. దేవుని పేరు అపవిత్రం అవుతుందేమో అన్న భయంతో ఆ పేరును వాడకూడదనే యూదా ఆచార ప్రభావం మరికొందరి మీద పడిందనిపిస్తోంది. ఆ పేరుకు సరైన ఉచ్చారణ ఏదో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు కాబట్టి “ప్రభువు” లేదా “దేవుడు” లాంటి బిరుదులు వాడడం మేలని ఇంకొందరు నమ్ముతున్నారు. అయితే వాళ్లు అనుకునే వాటిలో పసలేదని చెప్పడానికి ఈ కింది కారణాలు చూడండి:

  • సర్వశక్తుడైన దేవునికి ఓ ప్రత్యేకమైన పేరు అవసరం లేదని వాదించేవాళ్లు ఓ విషయాన్ని మర్చిపోతుంటారు. అదేంటంటే దేవుని వాక్యపు తొలి ప్రతుల్లో, అలాగే క్రీస్తు పూర్వానికి చెందిన ప్రతుల్లో దేవుని పేరు ఉంది. మనం ముందే గమనించినట్టు, దేవుడు తన వాక్యంలో దాదాపు 7,000 సార్లు తన పేరు ఉండేలా చూశాడు. దాన్నిబట్టి, మనం తన పేరు తెలుసుకొని, దాన్ని ఉపయోగించాలన్నదే ఆయన అభిలాష అని స్పష్టమౌతోంది.

  • యూదుల ఆచారం మీద గౌరవంతో దేవుని పేరును తీసేసే అనువాదకులు ఓ కీలకమైన విషయాన్ని గుర్తించరు. కొందరు యూదా శాస్త్రులు దేవుని పేరును ఉచ్చరించడానికి నిరాకరించినా, వాళ్లు తమ బైబిలు ప్రతుల్లో నుండి ఆ పేరును తీసేయలేదు. మృత సముద్రం దగ్గర్లో కుమ్రన్‌లో దొరికిన ప్రాచీన గ్రంథపు చుట్టల్లో చాలా చోట్ల దేవుని పేరు ఉంది. అసలు ప్రతుల్లో ఫలానా చోట దేవుని పేరు ఉండేదని సూచించడానికి కొందరు బైబిలు అనువాదకులు ఆ చోట “ప్రభువు” అనే పదాన్ని పెద్ద అచ్చులో ఉపయోగించారు. కానీ, ఓ ప్రశ్న ప్రశ్నగానే మిగిలింది. బైబిల్లో దేవుని పేరు వేలసార్లు ఉందని తెలిసినా, ఈ అనువాదకులు దేవుని పేరు స్థానంలో వేరే బిరుదును వాడేంత స్వేచ్ఛ లేదా ఆ పేరు తీసేసేంత స్వేచ్ఛ ఎందుకు తీసుకున్నారు? ఆ మార్పు చేసే అధికారం వాళ్లకు ఎవరిచ్చారని వాళ్లు అనుకుంటున్నారు? అది వాళ్లకే తెలియాలి.

  • దేవుని పేరుకు సరైన ఉచ్చారణ తెలియదు కాబట్టి దాన్ని వాడకూడదని చెప్పే వాళ్లు నిజానికి యేసు పేరును స్వేచ్ఛగా వాడేస్తుంటారు. అయితే, మొదటి శతాబ్దంలో యేసు శిష్యులు యేసు పేరును ఉచ్చరించిన తీరుకు, నేడు చాలామంది క్రైస్తవులు ఉచ్చరిస్తున్న తీరుకు చాలా తేడా ఉంది. యూదా క్రైస్తవులు, యేసు పేరును యేషువ (Ye·shuʹa) అని ఉచ్చరించివుంటారు. “క్రీస్తు” అనే బిరుదునేమో మషియాక్‌ (Ma·shiʹach) లేదా “మెస్సీయ” అని ఉచ్చరించేవాళ్లు. గ్రీకు మాట్లాడే క్రైస్తవులు ఆయన్ని ఐయీసస్‌ క్రైస్టోస్‌(I·e·sousʹ Khri·stos) అని, లాటిన్‌ మాట్లాడే క్రైస్తవులు ఐసస్‌ క్రైస్టస్‌ (Ieʹsus Chriʹstus) అని పిలిచేవాళ్లు. అయితే పరిశుద్ధాత్మ ప్రేరణతో బైబిల్లో ఆయన పేరు గ్రీకు భాషలో నమోదైంది. దాన్నిబట్టి, మొదటి శతాబ్దపు క్రైస్తవులు యేసు పేరుకు తమ భాషలో వాడుకలో ఉన్న పదాన్ని ఉపయోగించి తెలివైన పని చేశారని స్పష్టమౌతోంది. అలాగే, ఇప్పుడు నూతనలోక అనువాద బైబిలు కమిటీ కూడా “జెహోవా” (యెహోవా) అనే పదం వాడడం సముచితమని భావిస్తోంది. అది ఖచ్చితమైన ప్రాచీన హీబ్రూ ఉచ్చారణ అయ్యుండకపోయినా, దాన్ని వాడడం యుక్తమని కమిటీ భావన.

దేవుని పేరును ఖచ్చితంగా ఎలా ఉచ్చరించాలో ఎందుకు తెలియదు? టెట్రగ్రామటన్‌లోని (יהוה) నాలుగు అక్షరాలు ఇంగ్లీషులో YHWH అనే హల్లులతో సూచించబడ్డాయి. ప్రాచీన హీబ్రూ భాషలో రాసేటప్పుడు వేటికీ అచ్చులు ఉండేవి కాదు కాబట్టి టెట్రగ్రామటన్‌లో కూడా అచ్చులు లేవు. ప్రాచీన హీబ్రూ భాష మాట్లాడే రోజుల్లో, పాఠకులు తగిన అచ్చుల్ని సులువుగా కలుపుకొని చదువుకునేవాళ్లు.

యెహోవా దేవుని పేరు

1530లో విలియమ్‌ టిండేల్‌ అనువదించిన పెంటాట్యూక్‌లోని ఆదికాండము 15:2లో దేవుని పేరు

హీబ్రూ లేఖనాలు రాయడం పూర్తయిన దాదాపు వెయ్యేళ్ల తర్వాత, హీబ్రూ చదివేటప్పుడు ఏ అచ్చుల్ని కలపాలో గుర్తించేందుకు వీలుగా యూదా విద్వాంసులు ఉచ్చారణ గుర్తుల్ని రూపొందించారు. కానీ ఆ సమయానికల్లా, దేవుని పేరును బయటకు పలకడం తప్పనే మూఢనమ్మకం చాలామంది యూదుల్లో ఉండడంతో ఆ పేరుకు బదులు ప్రత్యామ్నాయ పదాలు వాడేవాళ్లు. అందుకేనేమో, వాళ్లు టెట్రగ్రామటన్‌ను నకలు చేసేటప్పుడు, ఆ ప్రత్యామ్నాయ పదాల కోసం వాడిన అచ్చుల్ని, దేవుని పేరును సూచించే నాలుగు హల్లులతో కలిపారు. దానివల్ల, దేవుని పేరును హీబ్రూలో అసలు ఎలా ఉచ్చరించేవాళ్లో ఖాయం చేసుకోవడానికి ఆ అచ్చుల గుర్తులు ఉన్న రాతప్రతులు సహకరించవు. దేవుని పేరును “యావే” (“Yahweh”) అని ఉచ్చరించేవాళ్లని కొందరు అభిప్రాయపడుతున్నారు, మరికొందరు రకరకాల అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రీకు భాషలోకి అనువదించిన లేవీయకాండములోని ఓ భాగం ఉన్న మృత సముద్రపు గ్రంథపు చుట్టలో దేవుని పేరును యావో (Iao) అని లిప్యంతరీకరించారు. అదేకాక, తొలి గ్రీకు రచయితలు సహితం యాయే (Iae), యాబే (I·a·beʹ), యావూవి (I·a·ou·eʹ) అనే ఉచ్చారణలు కూడా ఉండివుంటాయని అన్నారు. అయితే, ఈ విషయంలో పిడివాదం చేయాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే, పూర్వం దేవుని సేవకులు హీబ్రూలో దేవుని పేరును ఎలా ఉచ్చరించేవాళ్లో మనకు తెలియదంతే. (ఆదికాండము 13:4; నిర్గమకాండము 3:15) మనకు తెలిసిందల్లా, దేవుడు తన ప్రజలతో మాట్లాడేటప్పుడు తన పేరును చాలాసార్లు ప్రస్తావించాడు, వాళ్లు ఆ పేరుతో ఆయనను సంబోధించారు, ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆ పేరును విరివిగా వాడారు.—నిర్గమకాండము 6:2; 1 రాజులు 8:23; కీర్తన 99:9.

దేవుని పేరును తెలిపే నాలుగు హీబ్రూ హల్లులు

టెట్రగ్రామటన్‌ YHWH: “తానే కర్త అవుతాడు”

 “అవ్వు” అనే క్రియాపదం, హీబ్రూలో

క్రియాపదం HWH: “అవ్వు”

యెహోవా అనే పేరుకు అర్థం ఏమిటి? హీబ్రూలో, యెహోవా అనే పేరు “అవ్వు” అనే అర్థమున్న క్రియాపదం నుండి వచ్చింది. కాబట్టి, నూతనలోక అనువాద బైబిల్‌ కమిటీ అవగాహన ప్రకారం దేవుని పేరుకు అర్థం, “తానే కర్త అవుతాడు.” విద్వాంసులకు రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఆ అర్థం గురించి పిడివాదం చేయలేం. అయితే, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తగా, తన సంకల్పాన్ని నెరవేర్చే వ్యక్తిగా యెహోవా పాత్రకు ఆ నిర్వచనం చక్కగా సరిపోతుంది. ఎందుకంటే, యెహోవా ఈ భౌతిక విశ్వం, తెలివిగల ప్రాణులు ఉనికిలోకి వచ్చేలా చేశాడు, అంతేకాదు ఆరునూరైనా ఆయన ఎప్పుడూ తన చిత్తం, తన సంకల్పం నెరవేరేలా చేస్తాడు.

కాబట్టి, యెహోవా పేరుకున్న అర్థం నిర్గమకాండము 3:14⁠లో ఆ పేరును వర్ణించడానికి వాడిన సంబంధిత క్రియాపదానికి ఉన్న అర్థానికే పరిమితం కాదు, నూతనలోక అనువాదం ప్రకారం ఆ లేఖనం ఇలా చెబుతోంది: “నేను ఎలా అవ్వాలనుక

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

రోమీయులు 6:23 పాపపు వేతనం మరణం, కాని దేవుని ఉచిత బహుమతి మన ప్రభువైన క్రీస్తుయేసులో నిత్యజీవము.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech