mahimasabdam.tv@gmail.com
+91 9390209376
బైబిల్ ఒక సాటిలేని గ్రంధము. 66 పుస్తకముల కలయికగా 1600 సంవత్సరాల కాల వ్యవధిలో భిన్నమైన వృత్తులు, పనులు చేసేవారు విభిన్న ప్రాంతాలలో వుండే వైవిద్యభరితమైన వ్యక్తుల ద్వారా వ్రాయబడింది. బైబిల్ దేవుని చిత్తాన్ని, రక్షణ మార్గాన్ని తెలియజేసే దేవుని వాక్యమని క్రైస్తవులు ప్రకటిస్తారు. ఈ రోజు బోధన ద్వారా బైబిల్ ఒక విశ్వాసికి ఏ విధంగా అర్ధవంతమైనదిగా వుండగలదు మరియు సరియైన దృక్పధంతో బైబిల్‌ను ఏవిధంగా చదవాలి అనే అంశాలను నీవు తెలుసుకుంటావు.
బైబిల్ అత్యధికంగా అమ్మబడుతున్న గ్రంధం : బైబిల్‌ను చదవడం, అధ్యయనం చేయడం ద్వారా ప్రతియొక్కరు ఎంతో ప్రయోజనాన్ని సంపాదించవచ్చు. అన్ని రకాల జాతులు, తరగతులకు చెందిన ప్రజలతో దేవుని వాక్యమైన బైబిల్ మాట్లాడుతుంది. బైబిల్ సమకాలీనమైనదిగా వుండి విశ్వజనీనమైన సమస్యలను ఎత్తిచూపుచు అన్నిరకాల సంస్కృతులకు చెందిన ప్రజలకు వున్న సమస్యలకు పరిష్కారాలను చూపుతుంది. అందుకోసమే ఈ గ్రంధం అత్యధికంగా అమ్ముడుపోయే గ్రంధంగా పేరొందింది.
'దైవజనుడు సన్నద్దుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైయున్నది' (2 తిమోతి 3:16-17).
'ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని యిచ్చను బట్టి కలుగలేదుగాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి' (2 పేతురు 1:20-21) 'ఆకాశమును భూమియు గతించునుగాని నా మాటలు ఏ మాత్రమును గతించవు' (మత్తయి 24:35).
బైబిల్ మనస్సుకు ఒక ప్రకాశవంతమైన దీపము :
బైబిల్ గ్రంధము మనము ఏ మార్గములో వెళ్ళవలెనో దారి చూపించే ఒక వెలుగుచున్న దీపముగా యివ్వబడింది. ప్రమాదభరితమైన నీళ్లలో పయనించే నావికులకు దారి చూపించే ఒక ఎత్తైన దీప స్తంభమువలె వుండి తీరమునకు చేర్చేదిగా వుంది. ఉత్తమమైన, పవిత్రమైన జీవితమును యిక్కడ జీవించి రాబోయే ప్రపంచంలో శాశ్వతమైన సంతోషమును పొందుటకొరకై యిది మార్గదర్శకత్వం వహిస్తుంది.
బైబిల్ దేవుని ప్రేమలేఖ :
బైబిల్ దేవుడు మనకు వ్రాసిన ప్రేమలేఖ. మనకున్న ప్రతికూలమైన, కష్టమైన పరిస్థితులలో దేవుని కాపుదల, సంరక్షణను, ఆదరణను మనకిస్తుంది. దేవునిచేత మనము అత్యధికముగా ప్రేమించబడి, ఆయన యొక్క గొప్ప సంకల్పముతో యిమడ్చబడినామన్న విషయం బైబిల్ మనకు చూపిస్తుంది దేవుడు మనకెంతో గొప్ప విలువను యిస్తూ మన జీవన్మరణములకు ఒక నిరీక్షణాస్పదమును దయచేసియున్నాడనే విషయాన్ని మనకు చూపిస్తుంది.
బైబిల్ అనుదిన జీవితమునకు ఒక చేతి పుస్తకము :
బైబిల్ జీవించుటకు ఒక చేతిపుస్తకము వంటిది. ప్రతిదినము మనము దేవునితో ఏలాగు సహవాసం చేయాలో, ఇతరులతో సమాధానంగా ఎలా జీవించాలో మరియు మనము చేయు పనులలో ఏవిధంగా విజయం పొందాలో బైబిల్ సూచిస్తుంది. జీవితకాలములో మంచి దినములను, సంతోషకరమైన రోజులను కోరుకునేవారికి ఈ చేతి పుస్తకము అత్యంతావశ్యకమైనది.
బైబిల్ గ్రంధము పరిశుద్ధముగా జీవించుటెలాగో బోధిస్తుంది. ఇది పాపమునుండి, చెడు నడవడినుండి మనలను దూరంగా ఉంచుతుంది. బైబిల్ గ్రంధము మనలను నీతి మార్గములోనికి నడిపిస్తుంది మరియు యదార్ధంగా నడుచుకొని వంకర మార్గములను ఎలా సరిచేసుకోవాలో బోధిస్తుంది.
మనస్సాక్షికి సబ్బువంటిది :
బైబిల్ మన తలంపులను శుద్ధీకరించి, జీవిత విధానమును, క్రియలను చక్కబరుస్తుంది. మంచిని చెడును, తప్పొప్పులను గ్రహించుటెట్లో తెలియపరుస్తుంది. సరియైన ఉత్తమమైన నిర్ణయాలను చేయుటకు పురికొల్పుతుంది. నీతిమార్గములో స్థిరంగా, దృఢంగా నడుచునట్లు చేస్తుంది. బైబిల్ మనలను పటిష్టమైన రాజమార్గములో వుంచుట ద్వారా మార్గము తప్పి నశించకుండా కాపాడుతుంది. దేవుడు మనకొరకు నిర్ణయించిన గమ్యస్థానమునకు మనము చేరునట్లుగా మనకు సహాయపడుతుంది. మనము దేనికి, ఎవరికి ఎలాంటి స్థానాన్ని యివ్వాల్లో నేర్చుకుంటాము. అనవసరమైన విషయాలను తొలగించుకొనుటను నేర్పిస్తుంది. మనము చేసేదంతా అమోఘమైనదిగా, తప్పనిసరి ఫలితాన్నిచ్చేదిగా మరియు ఫలవంతమైనదిగా వుండునట్లు ఎలా చేయాలో నేర్పిస్తుంది.
విశ్వాసమునకు ఎరువు :
బైబిల్ ఆలోచనను మరియు జీవమును కలిగిస్తుంది. సిద్ధాంతము మరియు ఆచరణ ద్వారా ఒకరితోఒకరు ఐక్యమత్యముగా వుండునట్లు చేస్తుంది. బైబిల్ విశ్వాసమునకు అత్యుత్తమైన ఎరువుగా వుండి దానిని బలమైనదిగా, శ్రేష్టమైనదిగా మార్చుతుంది. బైబిల్ మనకు సమాధానమును యిస్తుంది. దేవుని సంకల్ప ప్రకారము జీవితము యొక్క సంపూర్ణ గ్రహింపు కలుగడం ద్వారా ఈశాంతి లభిస్తుంది. ఆరోగ్యము మరియు క్షేమకర జీవితం దేవుని సమాధానము యొక్క ఆచరణాత్మకమైన ఫలితాలుగా క్రైస్తవుల జీవితాల్లో వుంటాయి.
బైబిల్ విజయానికి సూత్రము :
బైబిల్ గ్రంధము గ్రహింపును, జ్ఞానమును ఇస్తుంది. దేవుని యొక్క జ్ఞానము మరియు గొప్ప జ్ఞానుల యొక్క అనుభవసారమైన జీవితమును ఈ గ్రంధము ద్వారా పొందవచ్చును. బైబిల్ ఒక వినూత్నమైన విభిన్నమైన గ్రంధము. అన్ని పరిస్థితులలో ఉపయోగపడే జ్ఞానము మరియు ప్రతియొక్కరు అంగీకరించగలిగే జ్ఞానముతో నిండికొనియున్నది. ఈ జ్ఞానము ఎంతో ఉపయుక్తమైనది. అది ఎల్లప్పుడూ సరియైన మార్గములో కార్యమును చేస్తూ మనకు విజయాలను చేకూర్చుతుంది.
బైబిల్ హృదయానికి ఆహారము :
బైబిల్ గ్రంధమందలి వర్తమానాన్ని ఎవరైతే స్వీకరిస్తారో అది వారికి ఆనందాన్ని ఇస్తుంది. దేవుని వాక్యముతో మనం ఎంతగా నింపబడతామో అంతగా ఆనందముతో నింపబడుతాము. దేవుడు ఆశీర్వదించేవాడు గనుక తనయొక్క గ్రంధ
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.
Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech