mahimasabdam.tv@gmail.com
+91 9390209376

- తమ తల్లిదండ్రులకు విధేయులై మరణము వరకు వారి బాధ్యతను స్వీకరించే యువత కావలెను - యేసు వలె (లూకా 2:51; యోహా 19:25-27)
- లైంగిక అవినీతికి కాదని చెప్పి, శోధనను కలిగించు స్ధలమునుండి, ఆ వ్యక్తి నుండి పారిపోయే యువత కావలెను - యోసేపు వలె (ఆది 39:10-12)
- ప్రతి విధమైన కీడును చెడును పూర్తిగా వదిలివేసే యువత కావలెను - తిమోతి వలె (1 తిమోతి 5:23) (చికిత్స నిమిత్తము కొద్దిగా ద్రాక్షారసము తీసుకొనమని పౌలు అతని బలవంతము చేయవలసి వచ్చెను.)
- బైబిల్ గ్రంధమునకు అంకితము చేయబడి, దాని బోధ ద్వారా వారి జీవితాలను మలుచుకొని సరిచేసుకొను యువత కావలెను - యోసేపు, తిమోతిల వలె (కీర్తన 105:19; 2 తిమోతి 3:15)
- శారీరక, మానసిక, ఆత్మీయ మరియు సాంఘిక విషయములలో సమతూలిక ఎదుగుదలకు కృషిచేసే యువత కావలెను. - యేసు వలె (లూకా 2:52)
- దైవభక్తిగల తల్లిదండ్రులతో సహకరిస్తూ తమ జీవితము పట్ల దేవుని ప్రణాళికను, ఉద్ధేశమును నెరవేర్చకలిగిన యువత కావలెను - ఇస్సాకు వలె (ఆది 22:6,9-14)
- ప్రతివిధమైన బెదిరింపును, హేళనలను సహిస్తూ ధైర్యముగా క్రీస్తు కొరకు సాక్ష్యమివ్వగల యువత కావలెను - పౌలుగా మారిన సౌలు వలె (అపొ 9:29)
- సహ ఉద్యోగుల ఆమోదాన్ని, అధికారుల అభిమానాన్ని కోల్నోదుమన్న భయంతో, వారు నమ్మిన దానికొరకు, తమ విశ్వాసమునకు విరుద్ధమైన దానితో సహకరింపని యువత కావలెను - దానియేలు అతని స్నేహితుల వలె (దాని 3:16-18; 6:10,11,16)
- దేవుడు తగిన సమయమున హెచ్చించునట్లు పెద్దలకు నాయకులకు లోబడి వారిని నమ్మకంగా అనుసరించే యువత కావలెను - యెహోషువా వలె (నిర్గమ 24:13; సంఖ్యా 27:18-20)
- అవసరతలో ఉన్నవారికి ఉపయోగపడి ఆశీర్వదించునట్లు త్యాగబుద్ధితో దేనినైనా ప్రభువునకు ఇచ్చే నమ్మకస్థులైన యువత కావలెను - పేరు తెలియని బాలుని వలె (యోహాను 6:9-11)
- దేవుని మందిరం నుండి ప్రతివిధమైన వేషధారణను అనవసరమైన వాటన్నింటిని తొలగించే యువత కావలెను - అపొస్తలుల కార్యములు 5 నందలి యువకుల వలె (వ 6,9,10)
- నేటి విజ్ఞాన ప్రపంచపు పద్ధతులకు ప్రతికూలంగా, వెనుకబడిన సంఘము కలిగించు నిరుత్సాహములన్నింటి మధ్యలో దేవుని కొరకు ధైర్యముగా గొప్ప కార్యములను చేయుటకు పూనుకొను యువత కావలెను - దావీదు వలె (1 సమూ 17:28,33,43,44)
- తమ ప్రస్తుత ఉద్యోగమును, తమకున్న బంధములన్నింటిని వదిలి, సంపూర్ణ సమయ పరిచర్య కొరకు పిలిచిన వెంటనే విధేయత చూపు యువత కావలెను - యాకోబు, యోహానుల వలె (మత్తయి 4:21,22)
- పై నుండి దర్శనము పొంది, పరిశుద్ధాత్మ శక్తితో ప్రపంచమంతటికి సౌవార్తీకరణ చేయునట్లు బయటకు వెళ్ళు యువత కావలెను - యోవేలు ప్రవచనము యొక్క యువతీ యువకుల వలె (అపొ 2:16-18,21).
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.









































Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech