Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

ADD
10

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూర జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

ప్రముఖ దైవజనులు రెవ. డా॥ బత్తిన విల్సన్ డేవిడ్ రాజు ప్రభువునందు నిద్ర

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూర జిల్లా /31 July 2026 హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ దైవజ్ఞాన కళాశాల (ACTC), హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా, ఆంధ్ర ఇవాంజిలికల్ లూథరన్ సంఘం (AELC)లో పాస్టర్‌గా సుదీర్ఘకాలం విశిష్ట సేవలందించిన ప్రముఖ దైవజనులు రెవ. డా॥ బత్తిన విల్సన్ డేవిడ్ రాజు గారు 2026 జూలై 29వ తేదీ (బుధవారం) ప్రభువునందు నిద్రించారు. విద్యా రంగంలో అనేక మంది దైవసేవకులను తీర్చిదిద్దిన ఆయన, రేడియో ప్రసంగీకుడిగా, ఆరాధన టీవీ వాక్యబోధకుడిగా కూడా విశేషమైన ఆత్మీయ పరిచర్య నిర్వహించారు. ఆయన బోధనలు, సందేశాలు మరియు సేవలు అనేకమంది విశ్వాసుల ఆత్మీయ జీవితాలను ప్రభావితం చేశాయి. 2026 జూలై 30వ తేదీ (గురువారం) ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ నుండి నెల్లూరు జిల్లా శ్రీకృష్ణపట్నం గ్రామానికి తీసుకువచ్చారు. అక్కడ బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు, సంఘ నాయకులు మరియు అనేకమంది విశ్వాసులు ఆయనకు తుదివందనాలు అర్పించి నివాళులు ఘటించారు. అనంతరం క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి, భూస్థాపన కార్యక్రమాన్ని గౌరవప్రదంగా పూర్తి చేశారు. ఆయన మరణం క్రైస్తవ సమాజానికి, ముఖ్యంగా ఆంధ్ర ఇవాంజిలికల్ లూథరన్ సంఘానికి మరియు దైవజ్ఞాన విద్యారంగానికి తీరని లోటుగా భావిస్తున్నారు.

1.8K-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

బైబిల్ వచనాలు

యెహోవా తనను భయపడువారిపై తండ్రి తన కుమారులపై కనికరపడినట్లు కనికరపడును.
-కీర్తనలు 103:13

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.