Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

ADD
10

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

దేవునికి మహిమకరముగా జరిగిన మెన్స్ మీట్

తూర్పు గోదావరి జిల్లా/16 September 2026 అమలాపురం : 2026 సెప్టెంబర్ 09 బుధవారం గాస్పల్ విజన్ 2026 కార్యక్రమంలో భాగంగా లివింగ్ గాడ్ గాస్పెల్ టీం నిర్వహించిన మెన్స్ మీట్ - అమలాపురం, సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ ప్రాంగణంలో దీవెనకరముగా జరిగింది. బిషప్ డా॥ అడపా ప్రసాద్ అధ్యక్షతలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రదర్ పురుషోత్తం రాజ్ సంగీత పరిచర్యలో బ్రదర్ సామ్యుల్ నేతల, బ్రదర్ సజీవరావు పాటలు, స్తుతి ఆరాధనతో సభను సంగీతమయం చేసారు. పాస్టర్ ఎమ్.చిరంజీవి రాజు వాక్యసందేశం అందిస్తూ నిర్గమకాండం 23:17; 34:23లో పురుషులందరూ యెహోవా సన్నిధిని కనబడవలెను అని వ్రాయిబడిన వాక్యమును బట్టి ఈ కార్యక్రమమును ఏర్పాటు చేయుటకు ప్రభువు కృపచూపారు అని చెపుతూ దేవునిని ఆరాధించటంలో సువార్త సేవలో పురుషులు ముందు వరుసలో ఉండాలని తరలి వచ్చిన పురుషులందరిని ప్రోత్సహించారు. బిషప్ డా॥ఎన్.ప్రభుకుమార్, పాస్టర్ యెహోషువ, పాస్టర్ అబ్రహాం ఫిన్నీ, పాస్టర్ చంద్రశేఖర్, పాస్టర్ కృపావరం, పాస్టర్ జాషువా క్లుప్త సందేశములను అందించారు. ఈ కార్యక్రమములో లివింగ్ గాడ్ గాస్పల్ టీం తరుపున సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ సంఘ కాపరి రెవ.కె.కె.పాల్‌కి మరియు చర్చ్ కమిటీ వారికి పాస్టర్ ఎమ్.చిరంజీవి రాజు వందనములు తెలియజేశారు. అమలాపురంలోని దైవజనులందరు బిషప్ అడపా ప్రసాద్‌ని, బిషప్ చిరంజీవి రాజుని ఘనంగా సత్కరించారు. రాబోవు దినాలలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రభువును మహిమపరచిరి. అనంతరం ప్రేమవిందును ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమములో పాస్టర్ జాన్, పాస్టర్ యాకోబు, పాస్టర్ జాన్ పాల్, పాస్టర్ రాజ్ కుమార్, పాస్టర్ విజయ రాజు, పాస్టర్ పాల్ తిమోతి, పాస్టర్ ఆనంద్ తదితర దైవజనులు పాల్గొన్నారు.

1.59K-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

బైబిల్ వచనాలు

యెహోవా నా బలమును నా డాలునై యున్నాడు; నా హృదయము ఆయనయందు నమ్మిక ఉంచెను.
-కీర్తనలు 28:7

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.