Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

Advertisement
ADD
10

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

సురూపము లేదు
24 November 2014

సురూపము లేదు

అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మన మతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయెను. మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాది ననుభవించిన వాడును గాను, మనుష్యులు చూడనొల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాని గాను దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమనొందిన వాని గాను మన మతనిని ఎంచితిమి. మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచ బడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా 53 : 2

బిల్లీ గ్రాహాం గారు లండన్‌లో మహా సభలను నిర్వహించుచున్నారు. ఒకరోజు మీటింగునకు జార్జి స్మిత్‌ అను వ్యక్తి వచ్చెను. జార్జి స్మిత్‌ ఒక రసాయన ఫ్యాక్టరీలో పని చేసినవాడు. ఒకరోజు ప్రమాదవశాత్తు యాసిడ్‌ ఉన్న తొట్టిలో పడ్డాడు. అందువలన ముఖము, శరీరము కాలి చూచుటకు ఎంతో అందవికారముగా ఉండెను.

అతడు బిల్లీ గ్రాహాం గారి వద్దకు వచ్చి 'అయ్యా నన్ను చూచారు గదా! నా శరీరమంతయు మచ్చలతో నిండియున్నది. నా అంత అందవికారముగా ఉన్న వ్యక్తిని మీరు ఎక్కడనూ చూచియుండరు. ఈ మచ్చల వలన నేను ప్రజల మధ్యకు, సభలకు రాలేక ఎప్పుడూ ఇంటిలోనే ఒంటరిగా ఉంటున్నాను' అని అనెను.?

బిల్లీ గ్రాహాం గారు అతనిని కౌగిలించుకుని 'భలే వాడివయ్యా! ?రోమన్‌ సైనికులు కొట్టిన దెబ్బల వలన నీ కంటే చండాలమైన రూపము గల వ్యక్తిగా మారిన యేసును మేము ఆరాధించు చున్నాము. ఆయన మనందరి నిమిత్తము నీ కంటే అంద వికారుడుగా, ప్రపంచములో అందరికంటే ?అందవికారుడుగా మారాడు' అని చెప్పారు ? ? ? ? ? ? ?డాక్టర్‌ పి.బి.మనోహర్‌.

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

బైబిల్ వచనాలు

మీరు లోకమునకు ఉప్పై యున్నారు.
-మత్తయి 5:13

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.