Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

Advertisement
ADD
10

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

ధనాశ
01 November 2014

ధనాశ

ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు.     లూకా 12 : 15

ఒకానొక దేశంలో సామ్రాట్‌ అనే సాహస వంతుడైన యోధుడు ఉండేవాడు. అతనికి సాహసాలంటే ఎంతో ఇష్టం. తమ ఊరికి దూరంగా ఉన్న ఒక గ్రామంలో ఒక బిలము ఉన్నదనీ, ఆ బిలములో ఒక భయంకరమైన రాక్షసుడు నివసిస్తున్నాడనీ అతడు విన్నాడు. సాహసాలంటే ఇష్టపడే సామ్రాట్‌ ఆ రాక్షసుణ్ణి చంపితే తన కెంతో పేరు ప్రతిష్టలు వస్తాయనీ తలంచాడు.

సామ్రాట్‌ ఆ ఊరికి వెళ్లాడు. ఈ ఊరివారందరూ బిలము లోనికి దిగవద్దనీ, అనేక మంది యోధులు లోనికి దిగారు కానీ ఒక్కరు కూడ తిరిగి రాలేదనీ చెప్పారు. సామ్రాట్‌కి బిలం లోనికి దిగాలనే కోరిక మరింత ఎక్కువైంది. అతడు బిలం లోనికి తొంగి చూసాడు.

 తన కవచ శిరస్త్రాణములతో లోనికి దిగుట అసాధ్యము గనుక అతడు వాటన్నిటినీ తీసి ప్రక్కన పెట్టి తన ఖడ్గం మాత్రం తీసుకొని ఒక పొడవైన త్రాడును బిలం లోనికి జారవిడిచాడు. బయట ఉన్న చెట్టుకు ఆ త్రాటిని ముడివేసి ఆ త్రాడు పట్టుకొని మెల్లగా లోనికి దిగాడు. లోపల చీకటిగా ఉన్నది. అతని కళ్లు చీకటికి అలవాటు పడిన తర్వాత అతనికి అనేక అస్తిపంజరములు, ఆయుధములు కనపడ్డాయి. ఇవన్నీ తనకు ముందు వచ్చిన యోధుల అస్తిపంజరాలు, ఆయుధాలు అని గుర్తించాడు.

 అంతలో అతనికి రాక్షసుడు కన్పించాడు. ఆ రాక్షసుణ్ణి చూసి సామ్రాట్‌ చాల ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ రాక్షసుడు ఒక కుందేలు సైజులో ఉన్నాడు. రాక్షసుడు నోరు తెరచి, కీచుమని అరుస్తూ సామ్రాట్‌ను భయపెట్టాడు. కాని సామ్రాట్‌ భయపడకుండా తన కత్తి తీసుకొని రాక్షసుణ్ణి చంపబోయాడు. కన్ను మూసి తెరిచే లోగా రాక్షసుడు బిలంలో ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు. సామ్రాట్‌ వాని వెనకే పరుగెత్తాడు.

 మరల సామ్రాట్‌ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అక్కడ బంగారం నాణెములు రాసులు పోసి ఉన్నవి. వజ్రములు ద్రాక్షపండు సైజులో ఉండి గుట్టలుగా పోసి ఉన్నవి. ఒక గుప్పెడు వజ్రాలను తీసుకొంటే జీవితాంతం రాజాలా బ్రతుకవచ్చును. ఆ నిధిని చూచిన తర్వాత సామ్రాట్‌ రాక్షసుని గురించి మర్చిపోయాడు. ఈ సంపదను పైకి ఎలా తీసుకొని వెళ్లాలి అనే ఆలోచనలో పడ్డాడు. అయితే బిలంలోనికి దిగే ముందు అతడు తన దుస్తులన్నీ తీసి చిన్న నిక్కరుతో మాత్రం వచ్చాడు.

 అప్పుడతనికి ఒక ఆలోచన వచ్చింది. అక్కడ ఉన్న వజ్రములలో అత్యంత పెద్ద దానిని తన నోటిలో పెట్టుకొని బిలములో నుంచి బయటకు వచ్చి ఈసారి సంచులతో మరల వచ్చి మిగతా వాటిని తీసుకొని వెళ్ల వచ్చునని తలంచాడు. అక్కడ ఉన్న వజ్రములలో పెద్ద దానిని నోటిలో పెట్టుకొన్నాడు. తాడు పట్టుకొని పైకి ఎగబ్రాకటం ప్రారంభించాడు. పైకి వెళ్లే కొలదీ అతనికి శ్రమ ఎక్కువై ఆయాసం వచ్చింది. అతడు ముక్కుతోనే కాక నోటితో కూడ గాలిని పీల్చవలసి వచ్చింది.

 నోటితో గాలి పీల్చేసరికి నోటిలో ఉన్న వజ్రం అతని గొంతులో ఇరుక్కుపోయింది. రెండు నిముషాల తర్వాత సామ్రాట్‌ నిర్జీవంగా క్రింద ఉన్న అస్తిపంజరాలపై పడ్డాడు.

 బిలములో ఉన్న రాక్షసుడు నిజంగా రాక్షసుడు కాదు. మన ధనాశే రాక్షసుడు. సులువుగా ధనవంతులు కావలెనని ఆపేక్షించువాడు ఈ రాక్షసుని బారిన పడి తమ ప్రాణాత్మ దేహములను నష్టపోవుదురు.

  - డా||పి.బి.మనోహర్‌

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

బైబిల్ వచనాలు

ప్రేమ అనేక పాపములను కప్పివేయును.
-1 పేతురు 4:8

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.