mahimasabdam.tv@gmail.com
+91 9390209376

మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మత్తయి 25 : 40
చాలా కాలం క్రితం మనకు చాలా దూరముగానున్న ఒకానొక దేశములో ఒక అద్భుతమైన చర్చి భవనము ఉన్నది. ఆ చర్చి ఒక కొండపై కట్టబడి యున్నది. ప్రతీ ఆదివారం నాడు లేదా పండుగలనాడు అనేక మంది అక్కడ ఆరాధించు కొనుటకు వచ్చేవారు. వేలాది మంది ప్రజలు చర్చికి వెళ్ళేటప్పుడు. కొండపైకి ఒకే దిశలో నడుస్తున్నప్పుడు వారంతా చీమల బారులా కనబడేవారు.
?ఆ చర్చి బ్రహ్మాండమైన స్థంభములపై కట్టబడింది. హాలు చాల పెద్దది. ఒక చివర నిలబడినవారు రెండవ చివర నిలబడిన వారిని చూడలేరు. తెల్లని పాలరాయి నేలంతా పరిచారు. శ్రావ్యంగా పాడే ఆర్కెస్ట్రా వారు ఆ చర్చిలో ఉండేవారు. ఏదైనా పండుగల సమయంలో ఆ చర్చిని దీపాలతో చక్కగా అలంకరించేవారు. అప్పుడు ఆ చర్చి అందం చూచుటకు రెండు కళ్ళు చాలవు.
?ఆ చర్చికి ఒక పెద్ద గోపురమున్నది. దానికి ఒక పెద్ద గంట కట్టబడి యున్నది. ఆ గంట చాలా ఎత్తులో ఉండుట వలన ఎవరికీి కనబడేది కాదు. కాని ఆ గంట శబ్దం మాత్రము అందరికీ వినబడేది. ఆ గంట ప్రక్కనే కొన్ని చిన్న గంటలు ఉన్నవి. ఆ చిన్నగంటలు చర్చి కట్టబడినప్పటి నుండి అక్కడ ఉన్నవి. అవి ప్రపంచంలోనే అందమైన గంటలు.
ఆ గంటల రవళి ఎంతో శ్రావ్యంగా ఉండేది. ఒక గొప్ప సంగీత కళాకారుడు ఆ గంటలను పోతపోశాడు. అందువలననే ఆ గంటల రవళి అంత శ్రావ్యంగా ఉంటుందని కొందరు అనే వారు. మరి కొందరు చాలా ఎత్తులో ఉండుట వలన గాలి స్పష్టంగానూ, శుద్ధంగానూ ఉండుట వలన వాటి రవళి అద్భుతముగా ఉంటుందని అనేవారు. అవి ప్రపంచంలోనే అద్భుత రవళి అని అందరూ ఒప్పుకొనే వారు. కొందరైతే 'దేవదూతలే వాటిని మ్రోగిస్తారు గనుక ?అవి అంత శ్రావ్యంగా ఉంటున్నాయి' అని అనేవారు. ?కొందరు గాలి ఆ గంటలను కదుపుతున్నది అనేవారు.
అయితే చాల సంవత్సరాలుగా ఆ గంటల రవళిని ఎవరూ వినలేదు. చర్చి ప్రక్కనే ఉండే ఒక వృద్ధుడు మాత్రం తరచు ఒక మాట చెప్పేవాడు. అతని అమ్మ తన బాల్యంలో ఆ గంటల రవళి విన్నదట. ఆ శబ్దం మహాద్భుతముగా ఉన్నదట. ఇప్పుడు ఆ గంటలను విన్నవారు ఎవ్వరూ లేరు.
ఆ గంటలను మానవులు ఎవరూ మ్రోగించరాదు. అక్కడి ప్రజలకు క్రిస్‌మస్ రోజు సాయంత్రం వేళ యేసు ప్రభువుకు కానుకలను సమర్పించే అలవాటు ఉన్నది. ఎప్పుడైతే గొప్ప కానుక దేవుని సన్నిధిలో ఉంచబడుతుందో అప్పుడే ఆ గంటల రవళి వినబడుతుంది. దేవునికి ఇచ్చే కానుక విషయములో అందరూ అలక్ష్యంగా ఉన్నారని అందువలననే గంటల రవళి వినబడుట లేదని చాలా మంది మేధావుల భావన. ఏది ఏమైనా చాలా కాలంగా గంటల రవళి ఎవరికీ వినబడుట లేదు. ప్రతి సంవత్సరము అనేక మంది ధనవంతులు ఆ చర్చికి వచ్చేవారు. ఇతరుల కంటే గొప్ప కానుకలను ఇవ్వాలని అందరూ ఆశించేవారు. కాని ప్రతి ఒక్కరూ తమకు అక్కరలేని దానిని మాత్రమే ఇచ్చేవారు. తమ కానుకకు గంటల రవళి వినబడుతుందేమో అని ఆశించే వారితో ఆ చర్చి నిండిపోయేది. ఆరాధన అద్భుతముగా ఉండేది. కానుకలు విపరీతముగా వచ్చేవి. కాని గంటల రవళి మాత్రము ఎవ్వరికీ వినబడుట లేదు.
ఆ ఊరికి కొంచెం దూరంలో ఒక గ్రామం ఉన్నది.ఆ గ్రామంలో పెడ్రో, ఆండీ అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. వారు ఈ చర్చి గోపురమును చూచి క్రిస్‌మస్ నాడు ఆ చర్చిలో ఆరాధనకు వెళ్ళాలని కలలు కనేవారు. 'ఆండీ! ఆ చర్చిలో క్రిస్‌మస్ ఆరాధనలో కానుకలు స్వీికరిస్తానికి యేసు ప్రభువే స్వయంగా ?వస్తారంట. మనం ఆయనను చూడగలిగితే ఎంత అదృష్టం' అన్నాడు పెడ్రో. క్రిస్‌మస్ రోజు ఎంతో చలిగా ఉన్నది. మంచు కురుస్తూ ఉన్నది. వీరిద్దరు కాలి నడకన చర్చికి బయలుదేరారు.
?చీకటి పడే సమయానికి వారు చర్చి సమీపమునకు వచ్చారు. రోడ్డు ప్రక్కన ఎవరో మూలుగుతున్న శబ్దాన్ని పెడ్రో విన్నాడు. అది ఎవరో అని చూచుటకు పెడ్రో దగ్గరకి వెళ్ళాడు. ఆమె ఒక పేద ముసలి స్త్రీ. చలికి నడవలేక కూల బడింది. ఆమె ముఖం మీద పడిన మంచును పెడ్రో తొలగించాడు. తన చేతులు రెండూ గబగబా రుద్ది వేడిగా అవగానే ఆమె ముఖముపై ఆ చేతులు ఉంచాడు. అలా రాపిడి కల్గిస్తూ ఆమెకు కొంత వేడి పుట్టించాడు.
'తమ్ముడూ ఆండీ! నేను నీతో రాలేను. ఆమె చలికి చనిపోయెలా ఉన్నది. నీవు ఒక్కడవే వెళ్ళు' అన్నాడు. ఆండీ 'మరి పండుగ చూడవా?' అన్నాడు. పెడ్రో 'లేదు తమ్ముడూ! ఈమెను చూడు! చలికి బిగుసుకొని చనిపోయెలా ఉన్నది. అందరూ చర్చికి వెళ్ళిపోయారు. నీవు వచ్చేటప్పుడు ఎవరినైనా పెద్దవారిని తీసుకొని రా! అంతవరకు నేను ఈమెను చూస్తుంటాను. నా వద్ద ఉన్న రొట్టెను తినిపిస్తాను' అన్నాడు. అప్పుడు ఆండీ 'అయితే నేను కూడ ఇక్కడే ఉంటా' అన్నాడు.
పెడ్రో 'వద్దు. నీవు వెళ్ళు. ఇద్దరం పండుగ సంబరాలను చూడకుండుట ఎందుకు? పాస్టర్ గారి ప్రసంగం జాగ్రత్తగా విను. నీవు వచ్చి నాకు చెప్పాలి సుమా. నేను రావాలని ఎంతగా ఆశ పడుచున్నానో ప్రభువుకి తెలుసు. ప్రభువుకు ఇవ్వడానికి నా దగ్గరా ఏమీ లేదు' అని పెడ్రో తన జేబులో చేయి పెట్టాడు. జేబులో ఒక గోళీ ఉన్నది. ఆ గోళీ తీసి ఆండీకి ఇస్తూ 'నా దగ్గర ఈ గోళీ మాత్రమే ఉన్నది. బాల యేసు దీనితో ఆడుకొంటారు. ఎవ్వరూ చూడనప్పుడు దీనిని కానుకల బల్లపై పెట్టు. మరల ఇక్కడికే రా! నీవు వచ్చేవరకు నేను ఇక్కడే ఉంటాను' అన్నాడు. క్రిస్‌మస్ సంబరాలను చూడనందుకు అతనికి చాలా దుఃఖముగా ఉన్నది. కాని ఈ స్త్రీని వదిలి వెళ్ళితే ఆమె మరణించవచ్చు. పెడ్రో ఆమెను బలంగా ఒక అరుగు మీదకు లాగాడు. అతడు చేసే సపర్యలకు ఆమె కొంత సేపటికి కళ్ళు తెరిచింది. పెడ్రో తన వద్ద ఉన్న రొట్టె ముక్కను ఆమెకు ఇచ్చాడు.
?ఆ రోజు చర్చిలో ఆరాధన అద్భుతముగానున్నది. వేలాది మంది పాడుతున్నప్పుడు ఆ కీర్తన పెడ్రోకు లీలగా వినబడింది. ఆరాధన ముగిసిన తరువాత ధనవంతులందరూ హూందాగా నడుస్తూ కానుకలను బాల యేసునకు సమర్పించడం ప్రారంభించారు. వారు బంగారు ఆభరణములనూ, వజ్రములనూ కానుకగా సమర్పించారు. కొందరైతే తాము తెచ్చిన కాన?
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.







.jpg)





















Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376