Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

Advertisement
ADD
10

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

తాత్కాలిక విజయము
10 November 2014

తాత్కాలిక విజయము

తాత్కాలిక విజయములు కొంత సంతోషమిచ్చిననూ ?అవి పూర్తి తృప్తిని ఇవ్వజాలవు. నిత్యత్వముతో పోల్చుకొనిన యెడల ఈ విజయములు బహు అల్పమైనవిగా తోచును. దేవుని యందు భక్తి లేకుండా ఈ లోక సంబంధమైన విజయములు నిరర్ధకములు.?

? ప్రపంచములో పేరుగాంచిన ఐదుగురు రాజులను గమనించిన యెడల ఈ విషయము అర్ధమగును. మహా అలెగ్జాండర్ అనేక దేశములను జయించెను. అయిననూ చిన్న వయస్సునందే మరణించి నేను రిక్తహస్తములతో పోవుచున్నాను అనెను. హనిబాల్ అనేక రాజులను చంపి వారి రాజ ముద్రికలతో మూడు కుంచములు నింపెను. అయినను యితడు విషము తాగి ఆత్మహత్య చేసుకొనెను. అతనిని గూర్చి దుఃఖించువారే లేరు. పది లక్షల మంది శత్రువుల రక్తములో తన వస్త్రమును ముంచిన జూలియస్ 800 నగరములను జయించెను. కానీ తన మిత్రుని చేతనే హత్య చేయబడెను. నెపోలియన్ ఐరోపా ఖండమంతటినీ జయించెను కానీ తన చివరి దినములు ప్రవాసములో బ్రతుకవలసి వచ్చెను. హిట్లర్ అనేక వేల మందిని చంపెను. కానీ చివరకు ఆత్మహత్య చేసుకొనెను.
? ? ? ? ? ? దేవునితో సంబంధము లేని ప్రతి జీవితము వ్యర్ధము. నీతి మంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమై పోవును [సామెతలు 10:20] అని సొలోమోను వ్రాయుచున్నాడు.
? ? ? ? ? ? ?మనము దేవుని చిత్తమును నెరవేర్చు వారముగా ఉన్నామా ? లేదా పైన ఉదహరించిన రాజుల వలె దుష్టతలంపులో ఉన్నామా ? ప్రభువు చేత నిర్దేసింప బడనిచో మనకు కలిగినది సమస్త వ్యర్ధము.

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

బైబిల్ వచనాలు

నీవు భయపడకుము, నేను నిన్ను విమోచించితిని; పేరుపెట్టి పిలిచితిని, నీవు నావాడవు.
-యెషయా 43:1

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.