Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

Advertisement
ADD
10

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

గోల్డ షిప్
07 November 2014

గోల్డ షిప్

దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్దపరచెనో అవి కంటికి కనపడలేదు. చెవికి వినబడలేదు. మనుష్య హృదయమునకు గోచరము కాలేదు.?-?1కొరింథీ 2:9
? ? ?యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయై యుండదు. - కీర్తన 34:10


?హంగేరీకి చెందిన ఒక జానపద కథ మీకందరికీ తెలుసు. ఆ కథలో ఒక పేద స్త్రీ వల వేసినప్పుడు ఒక గోల్డ్ ఫిష్??దానిలో చిక్కుకున్నది. ఆ గోల్డ్ ఫిష్??తనను మరల నీటి లోనికి వదిలి వేస్తే ఆమెకు కావలసినంత ఐశ్వర్యము ఇస్తానని అంటుంది. ఆమె గోల్డ్ ఫిష్??ను నీటిలోనికి వదిలి ఐశ్వర్యవంతురాలు అయినది. ఇది కధ మాత్రమే కాని నిజంగా గోల్డ్ ఫిష్??ఒక పేద కుటుంబానికి ఐశ్వర్యాన్ని ఇచ్చిన విషయం 1995లో బోస్నియాలో నిజంగా జరిగింది. ?
? ? ? ? ?? ? ?జెజెరో అనే గ్రామంలో స్మాజోమాల్ కోక్ (Smajomalkoc) అనే వ్యక్తి తన కుటుంబంలో నివసించేవాడు. 1990లో అతడు ఆస్ట్రియ నుంచి తిరిగి వస్తూ తన ఇద్దరు కుమారులు జావేద్, కాటిబ్ లు ఆడుకొనుటకు రెండు గోల్డ్ ఫిష్??లను తెచ్చాడు. బోసానియా సెర్బ్ సైన్యము దురాక్రమణ చేస్తూ జెజెరో వరకు వచ్చినది. స్త్రీలు, పిల్లలు పారిపోగా పురుషులు సైనికులను ఎదుర్కొన్నారు. స్మాజోమాల్ కోక్ ఆ యుద్దంలో చనిపోయాడు.
? ? ??? ? ? ?ఆయన భార్య ఫేహిమా (Fehima) రాత్రి వేళ తన గ్రామానికి మిగిలిన స్త్రీలతో వచ్చి తన భర్తను చనిపోయిన కొందరు గ్రామస్తులను పూడ్చిపెట్టి తన ఇంటిలో ముఖ్యమైన వస్తువులను తీసుకొని వెళ్ళుచు గోల్డ్ ఫిష్ లను చూచి జాలిపడింది. ఆ గోల్డ్ ఫిష్ లను ఆమె ప్రక్కనే ఉన్న చెరువులో వదిలివేస్తూ "మా కంటే మీరే అదృష్టవంతులు" అని వాటితో అన్నది.
? ? ? ? 1995లో ఫెహిమా తన ఇద్దరు కుమారులతో జెజెరోకు తిరిగి వచ్చింది. ఆ గ్రామం అంతా పాడుపడి ఉన్నది. ఆమె చెరువు వైపు చూచినప్పుడు వేల కొలది గోల్డ్ ఫిష్ లు దాంట్లో ఉన్నవి. ఫెహిమా ఆమె కుమారులు ఆ గోల్డ్ ఫిష్ లను అమ్మటం ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటిలోనూ దుకానములలోను, రెస్టారెంట్లలోను జెజెరో నుంచి వచ్చిన గోల్డ్ ఫిష్ లు గల గాజు పెట్టెలు ఉన్నవి. ఆ గ్రామంలోని అతి పెద్ద ఇంటిని వారు నిర్మించుకొన్నారు. వారికి లక్షల కొలది రూపాయల ఆదాయం లభించింది.
? ? ? ? మాల్కోక్ ?ఫెహిమా చరిత్ర దేవుని కృపను మనకు ఙ్ఞాపకం చేస్తున్నది. సంకట పరిస్థితులలో దేవుడు ఎట్లు ఆదరించునో తెలుపుచున్నది. బోస్నియాలో యుద్ధం జరుగుచుండగా చెరువులోని చేపలు అభివృద్ధి చెందుచున్నవి. అదే విధముగా మనము కూడ కష్టములు మధ్య సంకటముల మధ్య ఉండవచ్చును. కాని వాటిని తొలగించుటకు దేవుడు ఒక మార్గమును సిద్దపరచి యుంచును.

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

బైబిల్ వచనాలు

రహస్యమందు చూచువాడైన మీ తండ్రి మీకు ప్రతిఫలమిచ్చును.
-మత్తయి 6:4

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.