Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

Advertisement
ADD
10

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

విధేయత
01 January 2015

విధేయత

తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటె ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము. - 1 సమూయేలు 15 : 22.

దేవుడు ఒక్కొక్కసారి మనలను విచిత్రమైన పనులు చేయమని ఆజ్ఞాపిస్తాడు. ఎందుకు అనవసరంగా ఈ పని చేయాలని మనం అనుకుంటాము. దాని ఫలితం ఏదో ఆయనకే తెలియును. మనము ఆయన మాటకు విధేయత చూపుటయే ముఖ్యము.

కొన్ని సంవత్సరముల క్రితం (Stephen Grellat) స్టీఫెన్‌ గ్రెలట్‌ అను సువార్తికుడు ఒక అడవికి సమీపంలో నివసించుచుండెను. ఒక రోజు దేవుడతనితో అడవిలో కట్టెలు కొట్టువారికి సువార్తను ప్రకటించుమని చెప్పెను. స్టీఫెన్‌ లేచి కట్టెలు కొట్టువారు ఉండు చోటుకు వెళ్ళాడు. అయితే ఆ రోజు కట్టెలు కొట్టువారు తాము ఉన్న చోటును విడచి వేరొక చోటుకు వెళ్లి కట్టెలు కొట్టుచుండిరి. వారి గుడిసె ఖాళీగా ఉండెను.

 ఎవరూ లేరని స్టీఫెన్‌ వెనుకకు తిరిగి వచ్చు చుండగా దేవుడు అతనితో ఆ ఖాళీ గుడిసెకు బోధించమని ఆజ్ఞాపించెను. అతడు 'అచ్చట ఎవరూ లేరు కదా!' అని తిరిగి వచ్చుచుండెను. కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన మరల వెనుకకు తిరిగి ఖాళీ గుడిసె ముందు నిలువబడి  స్టీఫెన్‌ దేవుడు తన హృదయములో ఉంచిన మాటలను బిగ్గరగా పలికెను. దేవుడు తనను ఎందుకు ఖాళీ గుడిసె ముందు సువార్తను ప్రకటించమని ఆజ్ఞాపించాడో అని స్టీఫెన్‌ విస్మయ పడుచూ తన ఇంటికి తిరిగి వచ్చెను.

 కొన్ని సంవత్సరముల తరువాత ఒక వ్యక్తి స్టీఫెన్‌ను సమీపించి 'అమ్మయ్య! ఇంత కాలానికి కనబడ్డారు' అని సంతోషముతో చెప్పెను. అతడు ఎవరో స్టీఫెన్‌కు తెలియలేదు. 'అయ్యా! మీరెవరో నాకు తెలియదు' అని  స్టీఫెన్‌ చెప్పగా అతడు 'కొన్ని సంవత్సరముల ముందు అడవిలో ఖాళీ గుడిసె ముందు నిలువబడి సువార్తను ప్రకటించినది మీరే కదా? అని అడిగెను. అందుకు స్టీఫెన్‌ 'అవును నేనే. కానీ అక్కడ ఎవరూ లేరు' అనెను.

అందుకు ఆ వ్యక్తి 'నేను కట్టెలు కొట్టే వారి మేస్త్రీని. మేము కట్టెలు కొట్టుటకు వేరొక చోటుకు వెళ్లి పని ప్రారంభించితిమి. కానీ నేను ఒక గొడ్డలిని నా గుడిసెలో మరచిపోతిని. గొడ్డలి తీసుకొనుటకు గుడిసెకు వచ్చుచుండగా మీ మాటలు వినబడినవి. నేనొక చెట్టు చాటున నిలబడి మీ ప్రసంగమంతయూ విన్నాను. నేనప్పుడే ప్రభువును అంగీకరించి ఒక బైబిల్‌ కొనుక్కొని చదువుట ప్రారంభించి క్రైస్తవుడను అయినాను. నా క్రింద పనిచేయు వారందరికి సువార్తను ప్రకటించుచూ వెయ్యిమంది కంటే ఎక్కువ మందిని ప్రభువు వద్దకు నడిపించినాను. వారిలో ముగ్గురు పాస్టర్లు కూడా అయినారు' అనెను.

స్టీఫెన్‌కు ఎందుకు ఆనాడు దేవుడు  తనను ఆ ఖాళీ గుడిసెకు బోధించమని ఆజ్ఞాపించెనో అప్పుడు అర్ధమైనది.

- డా||పి.బి.మనోహర్‌

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

బైబిల్ వచనాలు

ప్రభువు మీ హృదయములను దేవుని ప్రేమవైపు నడిపించుగాక.
-2 థెస్సలొనీకయులకు 3:5

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.