Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

Advertisement
ADD
10

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

రెక్కలు ఆడించాలి
01 November 2014

రెక్కలు ఆడించాలి

ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచి చూచి,  పరిశుద్ధాత్మలో పాలివాడై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగసంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారిని నూతనపరచుట అసాధ్యము.  హెబ్రీ 6 : 4

ఒక అడవి బాతు దక్షిణమునకు ఎగురుచుండగా ఒక వేటగాడు దానిని కొట్టాడు. అడవి బాతు  ఎడమ రెక్కకు దెబ్బ తగిలింది. అది ఎగర లేక ఒక రైతు ఇంటి ఆవరణములో పడింది. ఆ రైతు అనేక కోళ్ళను, బాతులను, టర్కీ కోళ్ళను పెంచుకుంటున్నాడు. ఆకాశం నుండి క్రింద పడిన అడవి బాతును చూచి అవన్నీ ఎంతో ఆశ్చర్యపడ్డాయి. కొంత సేపు గడచిన తర్వాత అవన్నీ సరదాగా మాట్లాడుకొనుట ప్రారంభించినవి. అవి ఎప్పుడూ ఎగర లేదు కనుక అడవి బాతును ఆకాశంలో ఎగురుతుంటే ఎలా ఉంటుందని అడిగాయి.

 అడవి బాతు ఎంతో ఉత్సాహంగా తన ఎగురుటను గూర్చి చెప్పడం ప్రారంభించింది. 'ఎగరటం ఎంతో అద్బుతంగా ఉంటుంది. నీలాకాశంలో ఎగురుట ఎంతో అందంగా ఉంటుంది. మీ పశువుల కొట్టం అంగుళం ఎత్తులో ఉంటుంది. మీరు చిన్న చిన్న నలుసుల్లా ఉంటారు. ఒక్క సారి  పైకి ఎగిరితే ఇక రెక్కలను ఆడించ నక్కరలేదు. గాలి మనలను తోసుకొని పోతుంది. మనం అద్బుత దృశ్యాలను చూస్తూ  ఉండవచ్చును' అని అడవి బాతు అన్నది.

పకక్షులన్నీ అడవి బాతు చెప్పిన కథలు విని ఆశ్చర్యపడ్డాయి. అస్తమానం అడవి బాతు చుట్టూ చేరి ఆ కథలను చెప్పమని కోరెేవి. అడవి బాతు ఒక ఎత్తైన గూటి మీద నిలబడి ఈ విషయాలన్నీ చెప్పుతూ ఉండగా మిగిలిన పకక్షులన్నీ సంతోషముగా వింటూ ఉండేవి. అది ఎగురుటకు ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు అడవి బాతు రెక్క గాయం నయమైనది. అది బాగైన తరువాత కూడ  అడవి బాతు ఎగురుటకు ప్రయత్నం చేయలేదు.

 మనలో చాల మంది ఈ కథలోని  అడవి బాతు వలె ఉన్నాము. మనం క్రైస్తవునివలె  జీవించకుండా క్రెస్తవుడిని అని చెప్పుకొనుట ఎంత సులువైన విషయం! యేసు నా ప్రభువు అని చెప్పుతాము కాని ఆయనకు లోబడము. ఇంట్లో హాయిగా కూర్చుంటాము. సువార్త చెప్పవలసిన అవసరతను నిర్లక్ష్యం చేస్తాము. మాట్లాడుట సులువే కాని ఎగురుటకు రెక్కలను ఆడించాలి.

ప్రభువు 'నన్ను వెంబడింపగోరు వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింప వలెను. మార్కు 8:34 అనిరి. సిలువ అనగా క్రైస్తవునిగా ఉండుట వలన వచ్చు కష్టనష్టములు. నీవు నిజముగా ప్రభువును వెంబడింప కోరినచో కష్టనష్టములు భరించుటకు సిద్ధపడి ఉండవలెను.

 అందుకే ఒక భక్తుడు ' ప్రభువా నాకు మూడు విషయములను దయ చేయుము. మిమ్ములను బాగుగా చూడవలెను. మిమ్ములను బాగుగా ప్రేమించ వలెను. మిమ్ములను బాగుగా ప్రతి దినము వెంబడించవలెను' అని ప్రార్ధించెను. మనము ఈ మూడింటిని నేర్చుకొనిన యెడల మనము తేలికగా సిలువ ఎత్తుకొని నడువ గలము. సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును.

   - డా||పి.బి.మనోహర్‌

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

బైబిల్ వచనాలు

యెహోవా సన్నిధిలో ఆనంద సమృద్ధి కలదు.
-కీర్తనలు 16:11

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.