mahimasabdam.tv@gmail.com
+91 9390209376

దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తన 46 : 1.
టోడ్ బీమర్ యొక్క వయస్సు 32 సంవత్సరములు. అతడు భక్తి గల క్రైస్తవుడు. చర్చిలో సండేస్కూల్ చెప్పేవాడు. అతని భార్య పేరు లీసా. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద వాని పేరు డేవిడ్. వయస్సు 3 సంవత్సరాలు. రెండవ కుమారుని పేరు ఆండ్రు. వయస్సు 12 నెలలు. సెప్టెంబర్ 11వ తేదీన అతడు న్యూజెర్సీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి శాన్‌ఫ్రాన్సిస్కో యునైటెడ్ ఫ్లయిట్ 93 ఎక్కాడు.
?రాత్రి అతని భార్యతో జరిపిన సంభాషణ అతనికి జ్ఞాపకము వచ్చింది. ఆమె అతనితో తనకు ఇప్పుడు ఐదవ నెల అనీ మరో నాలుగు మాసాలలో మరొక బిడ్డ తన కుటుంబములోకి వస్తాడని చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చి నవ్వుకున్నాడు.
?తొంభై నిముషాలు గడిచిన తరువాత ముగ్గురు ప్రయాణికులు లేచి నిలువబడి తాము టెర్రరిస్ట్‌లమని విమానమును హైజాక్ చేస్తున్నామని చెప్పారు. విమానంలో ఉన్న 34 మంది ప్రయాణీకులు నివ్వెర పోయారు. విమానంలో ఉన్న ఏడుగురు సిబ్బందిని టెర్రరిస్ట్‌లు స్వాధీన పరచుకున్నారు.
?అప్పటి వరకు పశ్చిమ దిశగా వెళ్లుచున్న విమానం దక్షిణ దిశ వైపు తిరిగింది. టోడ్ వెనక సీట్లో కూర్చుని ఉన్నాడు. అందువల్ల టెర్రరిస్ట్‌లు చూడకుండా గ్రౌండ్ కంట్రోలుకు ఫోన్ చేసి టెర్రరిస్ట్‌లు తమను హైజాక్ చేసారని చెప్పాడు. 'బహుశా ఈపాటికే పైలెట్, కో పైలెట్ మరణించి ఉండవచ్చు లేదా తీవ్రంగా గాయపడి ఉండవచ్చు' అని చెప్పాడు. గ్రౌండ్ కంట్రోల్ నుండి మాట్లాడిన స్త్రీ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు జరిగిన ప్రమాదమును గూర్చి చెప్పింది. టెర్రరిస్ట్‌లు తమ విమానముతో కూడ ఒక ముఖ్యమైన బిల్డింగ్‌ను ఢీకొని దానిని కూల్చి వేయాలని తలంచుచున్నారని టోడ్ గ్రహించాడు. తమ సంభాషణ యావత్తును తన భార్యకు తెలియజేయాలని కోరాడు. తరువాత 23 కీర్తన చదివాడు. 'సహాయం చేయి ప్రభువా!' అని ప్రార్థించాడు. తరువాత 'మీరు సిద్ధమేనా?' అని టోడ్ అడిగిన ప్రశ్న వినబడింది.
కొద్ది నిముషాల్లో పిట్స్‌బర్గ్ సమీపంలో ?ఒక పొలములో ఆ విమానం 40 అడుగుల లోతు వరకు దూసుకొని పోయింది. టోడ్ చేసిన త్యాగం వలన అమెరికాకు పెద్ద ప్రమాదం తప్పింది. రాజధాని నగరంలో ఈ విమానం దేనికైనా గుద్దుకొని ఉంటే ఎంతో ప్రాణం నష్టం జరిగేది. పొలములో ఒక్కరు కూడ మరణించ లేదు. టోడ్ బీమర్ నిజమైన హీరో. నిజమైన క్రైస్తవులు తమకంటే ఎక్కువగా ఇతరుల గురించి ఆలోచిస్తారు. మీరు ఇతరుల గురించి ఆలోచిస్తారా??
అంతటి వీరోచిత కార్యం చేసినందుకు టోడ్ బీమర్ భార్య లీసా దుఃఖించ లేదు గానీ ఎంతో గర్వపడింది. - డా||పి.బి.మనోహర్
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

















 dad.png)










.jpg)
Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376