mahimasabdam.tv@gmail.com
+91 9390209376

? నీకు అపాయమేమియు రాదు. ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ? ? కీర్తన 91:10,11
ఇంగ్లండు రాజైన ఫ్రెడ్రిరిక్ ఒకరోజు అల్ఫాహారమునకు కూర్చుండెను. ఆయన సేవకుడు పాయసమును తెచ్చి ఆయన ముందుంచెను. ఫ్రెడ్రిరిక్ పాయసమున్న గిన్నెను ఎత్తి త్రాగబోయి తాను??ఆ రోజు బైబిలు చదవలేదని గుర్తు చేసుకొనెను. అతడు వెంటనే పాయసపు గిన్నెను క్రింద పెట్టి బైబిలు చదువుటకు వెళ్ళెను. అతడు తిరిగి వచ్చు సరికి ఒక సాలెపురుగు పాయసముపై ప్రాకుచుండెను. రాజు తన సేవకుని పిలచి ఈ గిన్నె తీసుకుని వెళ్లి మరియొక గిన్నెలో పాయసము తెమ్మని చెప్పెను.
? ? పనివాడు పాయసము ఉన్న గిన్నెను వంటగదిలోనికి తీసికొని వెళ్ళగా వంటవాడు "రాజు గారికి పాయసము అక్కరలేదా?" అని ప్రశ్నించెను. పనివాడు "ఆయనకు వేరొకు గిన్నెలో పాయసము ?కావలెనట" అనెను. వెంటనే వంటవాడు "అయితే రాజుకు తెలిసినదన్న మాట" అని తన జేబు నుండి రివాల్వర్ తీసి తనను తాను కాల్చుకొనెను. పనివాడు ఆశ్చర్యముతో ఆ పాయసమును ఒక కుక్కకు పెట్టగా ఆ కుక్క కొన్ని సెకన్లలో మరణించెను. వంటవాడు పాయసములో విషము కలిపెను. రాజు దానిని తినక వేరొక దానిని తెమ్మని అనినందును తన విషయము బయలు పడినదని వంటవాడు భయపడి ఆత్మహత్య చేసికొనెను.
? ? ?దేవుడు తన యెడల భక్తి గల రాజును కాపాడెను. ఆయన యందు భయభక్తులు గలవారిని ఆయన అనేక విధములుగా రక్షించును.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

















 dad.png)











Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376