mahimasabdam.tv@gmail.com
+91 9390209376

ఉపకారమును ధర్మమును చేయ మరచి పోకుడి. అట్టి యాగములు దేవుని కిష్టమైనవి. హెబ్రీ 13:16.?
? ? ? ? ? ? ?ఒక పల్లెటూరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక కోడి, ఒక మేక, ఒక ఆవు ఉన్నవి. అతనింట్లో చాలాకాలంనుండి ఒక??ఎలుక నివసిస్తూ ఉండేది. ఒకరోజు రైతు బజారు నుంచి ఒక ఎలుకబోను తీసుకువచ్చాడు. ఎలుకలబోను చూడగానే ఎలుకకు చాలా దుఃఖం కలిగింది. అది గబగబా కోడివద్దకు వచ్చి 'కోడీ కోడీ, రైతు ఎలుకలబోను తీసుకువచ్చి ఇంట్లో పెట్టాడు' అని చెప్పింది.
?? ? ? ? ? ? ? ఆ మాట విన్న కోడి 'ఎలుకలబోను పెడితే నాకేం ? నేనేమైనా వెళ్లి దాన్లో చిక్కుకుంటానా?' అని అన్నది. అప్పుడు ఎలుక 'అది కాదు కోడీ, నా పిల్లలు తెలియక ఆ బోను లోనికి వెళితే ఆ బోనులో చిక్కుకుపోతారు కదా! కనుక నీ కళ్ళతో దాన్ని బయట ఫారవేయి' అన్నది. అందుకు కోడి ఏమీ సమ్మతించలేదు. 'ఎలుకలబోను పెడితే నాకేమీ నష్టం లేదు' అన్నది.
అప్పుడు ఎలుక మేక దగ్గరకు వెళ్ళింది. 'మేకా మేకా, కొంచెం ఆ బోనుని నీ కాలితో బయటకు తన్నివేయవూ ?' అని అడిగింది. అందుకు మేక 'దాని వల్ల నాకేమీ భయం లేదు. నాకేం పట్టింది? దానిని బయట పారవేయటానికి' అని అన్నది.
? ? ? ? ? ? ?? ? ? ? ? ? ? అప్పుడు ఎలుక ఆవు వైపు తిరిగి 'నీ కాలితో ఆ ఎలుకలబోను కొంచెం బయటకు తన్నివేయవా? పొరపాటున నా పిల్లలు చిక్కుకుంటారేమోనని నాకు భయంగా ఉన్నది' అన్నది. అప్పుడు ఆవు ఆ ఎలుకలబోను ఉంటే నాకేమైనా భయమా? నేనేమీ దాన్లో చిక్కుకోనుగా! అని ఎలుక అడిగిన సహాయం చేయడానికి నిరాకరించింది. చేసేది ఏమీలేక ఆ ఎలుక తన పిల్లల్ని తీసుకొని ఆ ఇంటిని విడిచి వేరే ఇంటికి వెళ్ళిపోయింది.
? ? ? ? ? ? ? ఆ రాత్రి టప్ మని?బోను మూసుకున్న శబ్దం అయ్యింది. రైతు భార్య ఎలుక పడిందేమో అనుకుని చీకట్లో ఆ ఎలుకలబోను వద్దకు వెళ్లింది. ఆ బోనులో ఒక పాము చిక్కుకున్నది. రైతు భార్య బోనును ముట్టుకోగానే పాము ఆమెను కాటు వేసింది.
? ? ? ? ? ? ? రైతు ఆమెను గబగబా ఆసుపత్రికి తీసుకొని వెళ్లాడు. డాక్టర్ ఆమెకు మందులిచ్చి 'ఆమెకు మంచి ఆహారం పెట్టాలి. బలమైన ఆహారం పెట్టు' అన్నాడు. రైతు ఇంటికి వచ్చి తన కోడిని కోసి చక్కగా వండి తన భార్యకు తీసుకొని వెళ్లాడు.
? ? ? ? ? ? ? రైతు భార్య ఆరోగ్యం వెంటనే కుదుట పడలేదు. కాబట్టి ఆమెను చూచుటకు రైతు చుట్టాలు, స్నేహితులు వచ్చారు. వారందరికీ భోజనం పెట్టడం కోసం రైతు తన చిన్న మేకను కోయవలసి వచ్చింది. చివరికి రైతు భార్య చనిపోయింది. ఆమె అంతిమ దినానికి చాలామంది బంధువులు మిత్రులు వచ్చారు. వారందరికీ మంచి విందు ఏర్పాటు చేయడం కోసం రైతు ఆవును కోసి పెట్టాడు.
? ? ? ? ? ? ? ?కాబట్టి ఎవరైనా సమస్యల్లో ఇరుక్కున్నాను అని చెబితే నాకేమీ సంబంధం లేదు అనుకోకండి. మనకేమి సంబంధం లేకపోయినా మనము ఆ విషయంలో నష్టపోవచ్చును.
? ? ? ? ? ? ? ?ఆయన కృతజ్ఞత లేనివారి యెడలను, దుష్టుల యెడలను ఉపకారియై యున్నాడు. ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? లూకా 6:35.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.


















 dad.png)










Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376