Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

Advertisement
ADD
10

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

చేజార్చుకున్న అవకాశము
01 February 2015

చేజార్చుకున్న అవకాశము

మనము చాలా విషయాల గురించి దేవునిపై సణుగుతూ ఉంటాము. దేవుడు మనకు ఇచ్చే అవకాశాలను మనము సద్వినియోగము చేసుకోకుండా వృధా చేస్తుంటాము. ముఖ్యముగా ఎంతో సమయాన్ని వృధా చేస్తుంటాము.

జాకబ్‌ ఒక ఉండేలు తీసుకొని అడవిలో పకక్షులను వేటాడటానికి వెళ్ళాడు. అడవిలో ఒక చోట కొన్ని రాళ్ళు కుప్పగా ఉండుట కనిపించింది. ఆ రాళ్ళను తన సంచిలో వేసుకొని అడవిలో తిరుగుతూ పకక్షులు కనబడినప్పుడు ఒక్కొక రాయి తీసి ఉండేలుతో వాటిని కొట్టేవాడు. ఆ రోజు ఒక్క  పక్షికి కూడ తగలలేదు కాని రాళ్లన్నీ అయిపోయినవి.

 సంచిలో చేయి పెట్టి చూస్తే ఒకటే రాయి ఉన్నది. అతడు ఆ రాయిని చేతితో పట్టుకొని వస్తూ ఉండగా ఒక వజ్రపు వ్యపారి అతనికి ఎదురైనాడు. 'నీ చేతిలో ఉన్న రాయి నాకు ఇస్తే లక్షరూపాయలు ఇస్తాను' అని అన్నాడు. జాకబ్‌ ఆశ్చర్యపోయినాడు. ఇవన్నీ వజ్రపు రాళ్ళా? తాను పకక్షులను కొట్టుటకు విలువైన వజ్రపు రాళ్ళను వృధా చేశాను అని బాధపడ్డాడు. వాటి విలువ మొదట్లోనే తెలుసుకొన్నట్లయితే లక్షలాది రూపాయలు స్వంతం చేసుకొనేవాడిని. ఇప్పుడు సమయం మించిపోయినది. ఇంత విలువైన సంపదను జీవితములో ఇంకెన్నడూ సంపాదించు కోలేనని దుఃఖపడ్డాడు.

 వచ్చిన అవకాశమును వినియోగించు కొనకపోతే మనం కూడ అలాగే నష్టపోతాము. ముఖ్యంగా కాలం విలువను గ్రహించకపోతే ఎంతో నష్టపోతాము.

 మన సమయాన్ని శ్రమ కోసం వినియోగిస్తే అది మన శక్తికి ఆధారం. చదువుకొనుటకు సమయం  వెచ్చిస్తే అది మన జ్ఞానమునకు మూలం. ఆలోచనకు సమయం వెచ్చిస్తే అది విజయానికి కారణం. వ్యాయామమునకు సమయాన్ని వెచ్చిస్తే అది మన బలమునకు కారణం. ప్రార్ధించుటకు, బైబిల్‌ చదువుటకు మన సమయం వెచ్చిస్తే అది మన రక్షణకు కారణం అవుతుంది.

-  డా||పి.బి.మనోహర్‌

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

బైబిల్ వచనాలు

మీకు సమాధానము కలుగును గాక.
-యోహాను 20:19

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.