Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

యవ్వనస్తులకు సందేశము
యవ్వనజ్వాలప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఓ సండేస్కూల్‌ టీచర్‌
08 August 2014

యవ్వనజ్వాలప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఓ సండేస్కూల్‌ టీచర్‌

ఓ సండేస్కూల్‌ టీచర్‌ ప్రపంచాన్ని ప్రభావితం చేయగలడా? ఓ సండేస్కూల్‌ టీచర్‌ తన వ్యక్తిగత సువార్త పరిచర్య ద్వారా ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసాడో తెలియజేసే ఆసక్తికరమైన ఈ క్రింది కధను చదవండి.

బిల్లీగ్రహంగారు కోట్లాది ఆత్మలను క్రీస్తునొద్దకు నడిపించారని మనకు తెలుసు! మరి ఆ బిల్లీగ్రాహం గారిని ప్రభువు చెంతకు తీసుకొచ్చినదెవరు?

1858లో కింబాల్‌ అనే సండేస్కూల్‌ టీచర్‌ తన విద్యార్ధుల పట్ల భారము గలవాడై బోస్టన్‌ ప్రాంతములో చెప్పులు షాపులో పని చేయుచున్న యౌవనస్థుని యొద్దకు వెళ్ళెను. ఆ యౌవనస్థునికి రక్షణ గురించి వివరించి అతన్ని ప్రభువు చెంతకు నడిపించెను. ఆ యౌవనస్థుడు రక్షించబడిన తర్వాత అమెరికా, ఇంగ్లాండ్‌ దేశములను సువార్తతో కదిలించివేసెను. ఆ యౌవనస్థుడే డి.ఎల్‌.మూడీ. ఆ మూడీ గారి సందేశాలు, ఆత్మల పట్ల భారం ఎఫ్‌.బి.మేయర్‌ అనే ఓ కాపరి హృదయంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించెను. ఆ తర్వాత ఆత్మలపట్ల భారంతో నింపబడిన ఎఫ్‌.బి.మేయర్‌ ఒక కాలేజ్‌ క్యాంపస్‌లో సువార్త ప్రకటిస్తుండగా జె.విల్బర్‌ చాప్‌మెన్‌ అనే సహోదరుడు రక్షించబడెను. ఆ తదుపరి చాప్‌మెన్‌ గారు వై.యమ్‌.సి.ఎ.అనే సంస్థలో చురుకుగా పనిచేస్తూ ఒకనాటి గొప్ప బేస్‌బాల్‌ ఆటగాడైన బిల్లీసండేకు వై.ఎమ్‌.సి.ఎ. సువార్త పని అప్పగించెను. నశించిపోతున్న ఆత్మలపట్ల భారం కలిగిన బిల్లీ సండే చార్లెట్‌ అనే ప్రాంతంలో సువార్త సభలు ఏర్పాటు చేయగా, ఆ సభలలో బహుగా దీవించబడిన కొందరు ఆత్మీయులు ఇలాంటి సువార్త సభలు మరలా జరగాలని వారు భారముతో ఏర్పాటు చేసి మొర్దెకై హామ్‌ అనే సువార్తికుడిని సువార్త ప్రకటించుటకు ఆహ్వానించిరి. ఆయన సువార్త ప్రకటిస్తుండగా ఒక యౌవనస్థుడు ఆ సువార్తకు ఆకర్షితుడై తన జీవితాన్ని యేసయ్యకు అంకితం చేసుకున్నాడు. అలా తన జీవితాన్ని యేసయ్యకు సమర్పించిన ఆ యౌవనస్థుడే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ఆత్మలను ప్రభువు సన్నిధికి నడిపించిన డా||బిల్లీ గ్రేహం. ఆహా! ఓ సాధారణమైన సండేస్కూల్‌ టీచర్‌ ఆ రోజు ఆత్మలపట్ల భారం కలిగి డి.ఎల్‌.మూడీని రక్షణలోనికి నడిపిస్తే డి.ఎల్‌.మూడీ ద్వారా ఎఫ్‌.బి.మేయర్‌, మేయర్‌ ద్వారా చాప్‌మన్‌, చాప్‌మన్‌ ద్వారా బిల్లీ సండే, బిల్లీ సండే ద్వారా మొర్దెకై హామ్‌, మొర్దెకై హామ్‌ ద్వారా బిల్లీ గ్రేహం, బిల్లీగ్రేహం ద్వారా లక్షలాది ఆత్మలు రక్షించబడడం ఎంత గొప్ప విషయం.

ప్రియ స్నేహితుడా! నువ్వు చిన్న సండేస్కూల్‌ టీచర్‌వో, యూత్‌ను నడిపే యూత్‌ లీడర్‌వో లేదా చిన్న సంఘానికి కాపరివో, నువ్వు ఎవరివైనా సరే నీకివ్వబడిన సువార్త పనిని, యేసయ్య పనిని శక్తివంచన లేకుండా నశించిపోతున్న ఆత్మలపట్ల భారము కలిగి చెయ్యి. నీ ప్రయాస వలన డి.యల్‌.మూడీ వంటి లేదా బిల్లీ గ్రేహం వంటి గొప్ప సువార్తికులు బయలుదేరుతారేమో ఎవరికి తెలుసు?

కింబాల్‌ అనే సండేస్కూల్‌ టీచర్‌ తన పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఒక్కొక్కరిని వ్యక్తిగతముగా కలసి యేసయ్య చెంతకు వారిని నడిపించడం ఎంత గొప్ప విషయం. నువ్వు కూడా సండేస్కూల్‌ను చూస్తున్నావు కాని వ్యక్తిగతంగా చిన్న బిడ్డలను కలుసుకుని వారిని ప్రభువు చెంతకు నడిపే ప్రయత్నం ఎప్పుడైనా చేశావా?

యేసయ్య చాలా గొప్ప బోధకుడు, వేలమంది ఆయన మాటలు వినేవారు, కాని ఆయన వ్యక్తిగతంగా కూడా అనేకమందిని కలసి రక్షణలోనికి నడిపెను కదా. ఉదా||జక్కయ్య, సమరయ స్త్రీ, గెరాసేనుల దేశంలో సేన అనే దెయ్యం పట్టినవాడు. వీళ్ళంతా యేసయ్య వ్యక్తిగత సేవ ద్వారానే రక్షించబడెను గదా. మనం ఎంత గొప్ప సేవకులమయినా ఎంత బిజీ అయినా మనం కూడా నశించిపోతున్న వారిపట్ల వ్యక్తిగత శ్రద్ధ వహిస్తే, మనం కూడా మూడీ, బిల్లీ గ్రహం లాంటి వారిని ఈ లోకానికి కానుకగా సువార్తికులుగా ఇవ్వగలము నేటినుండైనా ప్రయత్నిద్దాం. - డా||పి.సతీష్‌ కుమార్‌

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 3:16 దేవుడు ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించాడంటే, తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు, తనను నమ్మినవాడు నశించకుండా నిత్యజీవము పొందవలెను.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech