Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

ఘనముగా జరిగిన క్లాప్స్‌ సహవాస కూడిక

తూర్పు గోదావరి జిల్లా/16 September 2022 2022 సెప్టెంబర్‌ 10వ తేది శనివారం కాకినాడ జిల్లా, పెద్దాపురంలో అధ్యక్షులు రెవ.డా॥డి.పి.డి.కె.జార్జి మేషన్‌ ఆధ్వర్యములో క్లాప్స్‌ సహవాస కూడిక దేవునికి మహిమకరముగా జరిగింది. కోశాధికారి బ్రదర్‌ డి.ఎస్‌.పి.రావు వాక్యపఠనం చేయగా, జాయింట్‌ సెక్రటరీ రెవ.ఎమ్‌.సుధాకర్‌ ఆరాధనలో నడిపించిరి. అనంతరం రెవ.డా.బి.జాన్‌ బాబు శుభములు తెలిపారు. రెవ.డా॥ఎన్‌.భాస్కర్‌ రావు సాక్ష్యం తెలుపగా, రెవ.డా॥బి.విద్యాసాగర్‌ వాక్యసందేశము అందించారు. అనంతరం వారిని సన్మానించారు. క్లాప్స్‌ వ్యవస్థాపకులు, పెద్దాపురం రీజియన్‌ చైర్మన్‌ రెవ.డా॥పురుషోత్తందాస్‌ లంక మాట్లాడుతూ ఇంకా సభ్యత్వం కట్టని వారు సభ్యత్వం కట్టాలని, అది మన బాధ్యత అని తెలిపారు. కాకినాడ జిల్లా యునైటెడ్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ద్వారా ఏర్పాటు చేయబడిన పాస్టర్స్‌ సంక్షేమలో ప్రతీ ఒక్కరు జాయిన్‌ అవ్వాలని కోరారు. అదే విధముగా డిసెంబర్‌ 3న జరగబోయే క్లాప్స్‌ క్రిస్మస్‌ వేడుక కొరకు అందరూ ప్రార్ధించాలని తెలిపారు. అనంతరం క్లాప్స్‌ చీఫ్‌ ఎడ్వయిజర్‌ Ê కాకినాడ జిల్లా యునైటెడ్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ జాయింట్‌ సెక్రటరీ బిషప్‌ డా॥సి.బి.ఐ.సుకుమార్‌ ప్రార్థన ఆశీర్వదంతో కూడిక ముగిసింది. ఈ కార్యక్రమములో హజరయిన దైవజనులకు రెవ.డా॥ఎన్‌.భాస్కర రావు కానుకలు అందించారు. ఈ సమావేశములో రెవ.టి.కృపావరం, బ్రదర్‌ తలారి విజయకుమార్‌, బ్రదర్‌ జి.రాజరావు, రెవ.డా॥వై.ఆర్‌.మన్నా తదితర దైవజనులు పాల్గొన్నారు.

779-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

అందరు మనుష్యులకొరకు ప్రార్థనలు చేయుడి.
-1 తిమోతికి 2:1

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech