Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తాజా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

అత్యంత మహిమకరముగా జరిగిన యేసయ్య ఆశీర్వాద ప్రార్ధనా మందిరము వార్షికోత్సవ ఆశీర్వాద సభ

తాజా/15 July 2026 రాజమండ్రి : దేవుని మహాకృపను బట్టి 2026 జూలై 14వ తేది మంగళవారం సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి, మోరంపూడి, యేసయ్య ఆశీర్వాద ప్రార్ధన మందిరము నందు దైవజనులు జి.శాంసన్ రాజు అయ్యగారి ఆహ్వానము మేరకు యేసయ్య ఆశీర్వాద ప్రార్ధనా మందిర వార్షికోత్సవ ఆశీర్వాద సభ ఎంతో మహిమకరముగా ఆశీర్వాదకరముగా జరిగెను. ఈ సభలకు వేలాది మంది ప్రజలు ప్రవాహం వలె స్వచ్ఛందంగా తరలివచ్చి ఆత్మతో సత్యముతో యేసయ్యను ఆరాధించిరి. దైవజనులు పాస్టర్ సురేష్ వంగూరి గారు అద్భుతమైన వాక్య సందేశమును అందించి సంఘమును ఆత్మీయంగా బలపరిచిరి. అలాగే సిస్టర్ జెస్సి గారు మరియు బ్రదర్ చిన్ని సవరపు గారు అద్భుతమైన పాటలను పాడి యేసయ్యను ఘనపరిచిరి. పాస్టర్ సామ్యూల్ పీటర్ గారు, బ్లెస్సింగ్ క్వాయర్ వారు కలిసి అద్భుతమైన ఆరాధన జరిగించిరి. యేసయ్య ఆశీర్వాద ప్రార్ధనా మందిరమును దేవుడు స్థాపించి 13 సంవత్సరములు పూర్తయిన సందర్భముగాను దైవజనులు పాస్టర్ జి.శాంసన్ రాజు అయ్యగారు 35 సంవత్సరాలు దేవుని సేవలో పూర్తయిన సందర్భముగాను ఈ ఆశీర్వాద కృతజ్ఞత కూడిక ఘనముగా జరిగెను. గడిచిన కాలమంతా కాచికాపాడి ఆయన పరిచర్యలో నమ్మకముగాను యధార్ధముగాను పరిశుద్ధంగాను వాడుకుంటున్న యేసు దేవునికే కోట్ల కొలది స్తుతి స్తోత్ర ఘనత మహిమలు కలుగును గాక! సహకరించిన వారిని ప్రార్ధించిన వారిని పరిచర్య చేసిన వారిని బహుగా ఆశీర్వదించి వర్ధిల్లచేయును గాక మరియు సంఘపెద్దలు, స్త్రీల సమాజం వారు జెబిపిఎమ్ యూత్ బిడ్డలు, సంఘ బిడ్డలు అందరు కలిసి దైవజనులను ప్రేమతో సన్మానించిరి. మరియు చక్కటి ప్రేమ విందును సిద్ధపరిచి వచ్చిన వేలాది మందికి సమృద్ధిగా వడ్డించిరి. సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగును గాక! తండ్రి అయిన దేవుని చేత స్థాపించబడి యేసుక్రీస్తు కృప చేత దినదినము వర్ధిల్లుచు పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించ బడుతున్న ఈ సంఘ పరిచర్యల కొరకు ప్రభు రాకడ వరకు ముందుకు కొనసాగించబడి విస్తరించినట్లు దయచేసి ప్రార్దించండి.

75-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

దేవుని రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము.
-రోమీయులకు 14:17

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech