Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

Advertisement
ADD
10

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

ఉపవాసము
01 December 2014

ఉపవాసము

ఉపవాస దినము ప్రతిష్టించుడి. వ్రత దినము ఏర్పరచుడి. యోవేలు 1 : 14బైబిలులోని భక్తులు అనేకులు ఉపవాసముండి ప్రార్థన చేసారు. నేటి కాలంలో ఉపవాసము చేయుటకు ఎవరును ఆసక్తి చూపుట లేదు. శుక్రవారము ఉపవాస ప్రార్థన చేయుటకు ఏమీ తినకుండా రమ్మని పాస్టరు గారు చెబితే మామూలుగా ఉదయ ఆహారముగా (బ్రేక్‌ఫాస్ట్‌గా) నాలుగు ఇడ్లీలు తినువారు ఉపవాస ప్రార్థన ఎన్ని గంటలకు ముగియునో అని ఆలోచించి ఆ రోజు ఎనిమిది ఇడ్లీలు తిని, రెండు దోసెలు ఆమ్లెట్‌తో తిని, రెండు అరటి పండ్లను తినిన తర్వాత గ్లాసుడు పాలు త్రాగి ఉపవాస ప్రార్థనకు వచ్చెదరు. అట్లు లఘువుగా ఉదయ ఆహారము గావించి వచ్చు వారిని చూచిన తర్వాత నేను బాల్యమందు వినిన కోతుల ఉపవాసము గురించిన కథ జ్ఞాపకం వచ్చుచున్నది.కొన్ని కోతులు ఒకరోజు ఉపవాస ముండవలెనని తలంచినవి. మిగిలిన కోతులన్నీ అందుకు సమ్మతించినవి. వాటి నాయకుడు 'మన ఉపవాసం పూర్తయిన వెంటనే తినుటకు ఆహారమును సిద్ధపరచుకొని అప్పుడు ఉపవాసం ప్రారంభించిన మంచిది. ఉపవాసం వలన నీరసం వచ్చి అప్పుడు ఆహారం సంపాదించుకోలేము' అన్నది. మిగిలిన కోతులన్నీ ఆ మాటకు సమ్మతించినవి. అందువలన కొన్ని కోతులు వెళ్లి నాలుగు అరటి గెలలను తీసుకొని వచ్చినవి. ఉపవాసము ప్రారంభించవలెనని అనుకొనగా ఒక కోతి 'ఉపవాసం అయిన తర్వాత పండ్లను పంచిపెట్టుట కంటే ముందుగానే ఎవరి వాటాను వారి దగ్గర ఉంచుకొంటే మంచిది. ఎందుకంటే ఉపవాసం పూర్తయే సరికి ఎంతో ఆకలితో ఉంటాం కదా?' అని అన్నది. మిగిలిన కోతులన్నీ 'ఇది భేష్‌ అయిన ఆలోచన' అని మెచ్చుకొన్నవి.

?కోతులన్నీ అరటి పండ్లను సమంగా పంచుకొన్నవి. మరొక కోతి మనం ముందుగానే 'తొక్క ఒలిచిపెట్టుకుంటే మంచిదేమో?' అన్నది. మిగిలిన కోతులు 'ఔనౌను, ఉపవాసం ముగియగానే ఒక్క క్షణం కూడ వృథా చేయకుండా తినవచ్చును' అన్నవి. నాయకుడు 'సర్లే మీరు తొక్క ఒలవండి కాని ఎట్టి పరిస్థితుల్లోను తినకూడదు' అని హెచ్చరించింది. కోతులన్నీ తొక్కను ఒలిచి పండ్లను సిద్ధంగా పెట్టుకున్నవి. మరొక కోతి 'చేతిలో ఎందుకు? నోటిలోనే పెట్టుకొనవచ్చును కదా? సాయంత్రం వరకు తినము, కాని నోటిలో పెట్టుకుంటే ఉపవాసం పూర్తికాగానే ఆలస్యం కాకుండా తినవచ్చును' అన్నది. అన్ని కోతులూ దానికి సమ్మతించాయి. కోతులన్నీ అరటి పండ్లను నోటిలో పెట్టుకొని ఉపవాసముండుటకు పూనుకొనినవి. తర్వాత ఏమైందో మీకు అర్ధమైంది కదా? కొద్ది క్షణాల్లో పండ్లు అన్నీమాయమై పోయినవి. ఆ విధంగా వాటి ఉపవాసము ముగిసినది. ?పళ్ళు లేవుగా! చాక్లెట్‌ను చప్పరించి బాదం పప్పులన్నీ ప్లేటులో వేస్తున్నాను' అన్నది. ? - డా||పి.బి.మనోహర్‌

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

బైబిల్ వచనాలు

యెహోవా విరిగిన హృదయముగలవారికి సమీపముగా నుండును.
-కీర్తనలు 34:18

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.