Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

Advertisement
ADD
10

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

నీ స్నేహం ఎవరితో?
30 November 2014

నీ స్నేహం ఎవరితో?



?మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు ? 2 కొరింథీ 6 : 14
ఒక నది ప్రక్కన ఉన్న తేలు ఒక తాబేలును సమీపించి 'నన్ను ఈ నది దాటించవూ' అని అడిగింది. అందుకు తాబేలు 'అమ్మో నిన్నా! నేను ఈదుచున్నప్పుడు ?నీవు కుట్టావనుకో! నీ విషంతో నేను ఛస్తాను' అన్నది. అందుకు తేలు పకపకా నవ్వి 'తాబేలు బావా! ఎందుకంత భయం? నేను నిన్ను కుడితే నీవు మునిగిపోతే నీతో కూడ నేను కూడ మునిగి చస్తానుగా! నేను చనిపోయే పని నేనెందుకు చేస్తాను?' అన్నది. తాబేలు కొంచెం ఆలోచించి 'అవును నీవు అన్నది నిజమే. నా పైకి ఎక్కు' అన్నది. తేలు తాబేలు పైకి ఎక్కింది.?సగం దూరం వెళ్ళిన తరువాత తేలు బలంగా తాబేలును కుట్టింది. ఆ విషానికి తాబేలు చనిపోయింది. రెండూ మునిగి పోయాయి. మునిగి పోయే ముందు నన్ను కుడితే నీవు కూడ చస్తావని తెలిసి కూడ నన్నెందుకు కుట్టావు? అని తాబేలు అడిగింది. ?అందుకు తేలు 'ఏం చేయను? నా బుద్ధి అంతే!' అని విచారంగా అన్నది.
మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారో చూచుకొనండి. ఎందుకంటే వారి దుష్ట గుణముల వలన వారు ఎలాగూ నశించి పోతారు.కాని వారితో సహవాసం కలిగి ఉన్నందు వలన మనం కూడ నష్టపోతాం. అందువలన పౌలు భక్తుడు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండ వద్దని హెచ్చరించుచున్నాడు..
- డా||పి.బి.మనోహర్‌

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

బైబిల్ వచనాలు

రక్షణను ఇంత గొప్పదానిగా నిర్లక్ష్యము చేస్తే ఎలా తప్పించుకొందుము?
-హెబ్రీయులకు 2:3

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.