ఉపమానములు

నీ చేతిలోనేనీPost Date://No:53
జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ యెదుట పెట్టుచున్నాను
యిర్మియా 21:8
ఆల్ఫ్ పర్వత ప్రాంతాలలో ఒక మహా జ్ఞాని ఉండేవాడు. ఆయన అప్పుడప్పుడు పర్వతపాద ప్రాంతములో ఉన్న గ్రామము లోనికి వచ్చి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడేవాడు. వారి సమస్యలకు సమాధానం చెప్పి పరిష్కరించేవాడు. ఏమి చేస్తే వారి కష్టములు తీరుతాయో చెప్పేవాడు. ఒకసారి కొందరు ఆకతాయి పిల్లలు ఆయనను ఆట పట్టించాలని ఒక పక్షిని పట్టుకుని తమ వెనుక పెట్టుకుని ఆయన వద్దకు వచ్చి స్వామీ ! నా చేతిలో ఏమి ఉన్నది ? అని అడిగాడు. జ్ఞాని ''నీ చేతిలో ఒక పక్షి ఉన్నది'' అన్నాడు.

ఆ అబ్బాయి తన రెండు వ్రేళ్ళను పక్షి మెడ వద్ద పెట్టి స్వామీ ! ఈ పక్షి బ్రతికి ఉన్నదా ? లేక చనిపోయిందా ? అని ప్రశ్నించాడు. జ్ఞాని బ్రతికి ఉన్నది అని చెబితే వెంటనే దాని మెడ నులిమి 'మీరు తప్పు చెప్పారు. ఇది చనిపోయినది' అని చెప్పాలని అనుకున్నాడు. ఒకవేళ చనిపోయింది అని చెబితే చేతులు తెరచి 'ఇది బ్రతికి ఉన్నది' అని చెప్పాలని ఆశించాడు. జ్ఞాని అతని ఆలోచనను గ్రహించాడు. ''ఆ పక్షి నీ చేతిలో ఉన్నది. నీవు ఎలా కోరుకుంటావో అలా ఉంటుంది'' అన్నాడు.

మన జీవితం కూడ అంతే. మనము యేసు ప్రభువును నమ్మి ఆయన ఆజ్ఞల ప్రకారము జీవిస్తే నిత్య జీవమును వశపరచుకుంటాము. లేదా నిత్య నరకానికి గురి అవుతాము. అంతా మన చేతిలోనే ఉన్నది.