mahimasabdam.tv@gmail.com
+91 9390209376
తాజా/30 September 20222022 సెప్టెంబర్ 27వ తేది మంగళవారం పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఏర్పాటు చేయబడిన ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పాస్టర్స్ కాలనీ స్టేట్ సెక్రెటరీ పాస్టర్ ఎమ్.ఆర్.రోషన్ కుమార్ ఆలోచన మరియు ఆధ్వర్యములో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈ ప్రాజెక్టు రాష్ట్ర అధ్యక్షులు రెవ.డా॥జుహాని హలోనెన్ ఆధ్యక్షతన ఘనంగా ప్రతిష్ఠంచబడిరది. అయిదు ఎకరాల స్థలంలో 175 ప్లాట్లతో, విశాలమైన 12 రోడ్లుతో లేఅవుట్ గల కాలనీకి ఎ.ఐ.సి.సి.దావీదు పురము (సిటీ ఆఫ్ డేవిడ్) అని నామకరణం చేసారు. ఈ కాలనీలో కమ్యూనిటీ హాలు, చిల్డ్రన్ పార్కు మరియు వాటర్ ట్యాంకుల కొరకు ప్రత్యేకమైన స్థలాలను కేటాయించారు. కాలనీలోని రోడ్లకు బైబిల్‌లోని ప్రవక్తల పేర్లు పెట్టారు. ముఖద్వారం నుండి లేఅవుట్ మధ్యగా సాగిపోయే రోడ్డుకు మోషే రహదారి అని నామకరణం చేసారు. ఈ ప్రతిష్ట కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ బ్రహ్మనాయుడుతో పాటు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ మరియు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. కాలనీలో ప్లాట్లను పొందుకోబోతున్న పాస్టర్లు, వారి కుటుంబాలు మరియు సంఘములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖద్వారంకు కట్టిన ఏడు రిబ్బన్లను ప్రార్ధనాపూర్వకంగా నేషనల్ వైస్`ప్రెసిడెంట్ బిషప్ పొతాంగ్, శాసనసభ్యులు శ్రీ బ్రహ్మనాయుడు, నేషనల్ సెక్రటరీ బిష్‌ప్ కుమారస్వామి, నేషనల్ అడ్మినిస్ట్రేటర్ రెవ.మధుచంద్ర, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పేట్రన్ బిషప్ డా॥డానియేల్ పాల్, స్టేట్ ప్రెసిడెంట్ రెవ.డా॥జుహాని హలోనెన్, స్టేట్ సెక్రటరీ పాస్టర్ ఎమ్.ఆర్.రోషన్ కుమార్‌లు ప్రార్ధనతో రిబ్బన్లను కట్‌చేసి కాలనీని ప్రతిష్ఠంచారు. అనంతరం శాసన సభ్యులు శ్రీ బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఈ బృహత్తర కార్యక్రమానికి నాంది పలికిన పాస్టర్ రోషన్ కుమార్‌ను అభినందించారు. వైస్ ప్రెసిడెంట్ బిషప్ పొతాంగ్ వాక్యసందేశము అందించాగా, నేషనల్ సెక్రటరీ బిషప్ కుమారస్వామి, నేషనల్ అడ్మినిస్ట్రేటర్ రెవ.మధుచంద్ర, స్టేట్ పేట్రన్ బిషప్.డా.డేనియల్‌పాల్, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జె.ఎలీషా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కాలనీలో ఫౌండేషన్ కొరకు ఏర్పాటు చేయబడిన శిలాఫలకాలను నాయకులు ఆవిష్కరించారు. రెవ.డా॥జుహాని హలోనెన్ మాట్లాడుతూ దేవుని చిత్తమైతే ఈ కాలనీ కొరకు వాటర్ ట్యాంకు మరియు వాటార్ ప్యూరిఫికేషన్ కొరకు ఆర్.ఓ.ప్లాంటు నిర్మిస్తానని వాగ్ధానం చేయగా, పాస్టర్ రోషన్ కుమార్ మరియు పాస్టర్లు రెవ.డా॥జుహాని హలోనెన్‌కు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా నుండి జిల్లా అధ్యక్షులు డా॥కె.మోజెస్‌బాబు, స్టేట్ వైస్`ప్రెసిడెంట్ రెవ.పి.టాటా విక్టర్, స్టేట్ సెక్రటరీ రెవ.ఎమ్.విజయసారధి, జిల్లా నాయకులు రెవ.బి.రాజు, రెవ.టి.సుకుమార్, రెవ.టి.మదన్, రెవ.రాజు జోషియా, రెవ.రక్షణానందం, రెవ.రత్నబాబు, రెవ.సుధాకర్, కాకినాడ జిల్లా నుండి స్టేట్ సెక్రటరీ రెవ.డి. విక్టర్ సామ్యూల్, విశాఖ జిల్లా నుండి స్టేట్ వైస్`ప్రెసిడెంట్ శ్రీమతి పి.వి.లక్ష్మి, అనకాపల్లి జిల్లా నుండి జిల్లా అధ్యక్షులు బిషప్.ఎమ్.జాన్‌పాల్, స్టేట్ సెక్రటరీ జి.యస్.యస్.ఆర్.మూర్తి, కదిరి.సామ్యూల్, అనంతపురం జిల్లా నుండి రెవ. నెహమ్యా, హైదరాబాద్ నుండి ఆంధ్ర, తెలంగాణ కో`ఆర్డినేటర్ రెవ.గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.
Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech