mahimasabdam.tv@gmail.com
+91 9390209376
తాజా/30 September 2022రాష్ట్రంలో ఉన్న క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ చైర్మన్ డా॥ యలమంచిలి ప్రవీణ్ అన్నారు. 2022 సెప్టెంబర్ 28వ తేది బుధవారం గోరంట్ల హోసన్న మందిరం ప్రాంగణములో ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ కోస్తా జిల్లాల ప్రతినిధుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఓషన్ కౌన్సిల్ అధ్యక్షులు వై.బాలరాజు అధ్యక్షత వహించారు. డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పాస్టర్స్‌కు గౌరవవేతనం అందిస్తున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అనేక ప్రాంతల్లో క్రైస్తవ స్మశానవాటికలు లేక ఇబ్బందిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రైస్తవుల సమస్యలను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ సావధానంగానే వింటోందని వెల్లడిరచారు. సమస్యలన్నిటినీ నివేదిక రూపంలో తయారుచేసి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని కలవనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ పి.డేవిడ్ మనోహర్, సెక్రటరీ వి.డేవిడ్ రాజు, జాయింట్ సెక్రెటరీ సిహెచ్.మోజెస్, ట్రెజరర్ ఆర్.విక్టర్ పాల్, గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ పి.గిద్యోస్, బిషప్ ఇ.ప్రభుదాస్. జార్జ్ పాపస్, బిషప్ జె.విజయ్ కుమార్, టి.డేవిడ్, వి.ఆదాం తదితరులు పాల్గొన్నారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.
Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech