mahimasabdam.tv@gmail.com
+91 9390209376
విజయనగరం జిల్లా/19 March 2022క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ మహిళా అధ్యక్షురాలు అంబటిపూడి చెన్నమ్మ ఆధ్వర్యములో విజయనగరం, నంద్యాల, రామకృష్ణ కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన సిఆర్పిఎస్ సమావేశము జరిగింది. ఈ కార్యక్రమములో ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధినేత అప్పికట్ల జీవరత్నం పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు నేషనల్ కమిటీ నాయకులు పాల్గొని చెన్నమ్మ చేసిన సేవలను గుర్తించి ఆమెను సన్మానించారు. ఈ కార్యక్రమములో పాస్టర్ కె.జాన్ వాక్యసందేశము అందించారు. సిఆర్పిఎస్ ఫౌండర్ అప్పికట్ల జీవరత్నం మాట్లాడుతూ భవిష్యత్తులో జరుగబోయే ప్రణాళిక, ఎజెండా గురించి అవగాహన కలిగించారు. ఈ సంస్ధ 2012లో ప్రారంభమయ్యి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను విద్యా, వైద్యం, వస్త్రదానం, అన్నదానం, పేదవారికి సహాయసహకారములు అందించడం వంటి సేవలను ఇప్పటికే భారతదేశములో పలు ప్రాంతాల్లో చేశామని, ఈ సేవలను గుర్తించి ఐక్యరాజ్య సమితి ఆమోదించిందని, భారతదేశంలోనేకాక అంతర్జాతీయముగా అతిపెద్ద సొసైటీగా మన్ననలు అందుకున్న సంస్థ సిఆర్పిఎస్ అని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ విషయంలో 11 కోట్లే ప్రకటించి క్రైస్తవులకు అన్యాయం చేశారని, పాస్టర్స్కి ఇస్తానని చెప్పిన గౌరవ వేతనం తక్షణమే అందించాలని వారు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమములో నేషనల్ ప్రెసిడెంట్ కె.జాన్, సెక్రెటరీ బి.జయకుమార్, వైస్ ప్రెసిడెంట్ దావూద్ పాల్, స్టేట్ ఎంప్లాయిస్ సెల్ ప్రెసిడెంట్ జాన్ మోషే, స్టేట్ జనరల్ సెక్రెటరీ రెవ.డా॥వై.ఎస్.చిన్నారావు, లింగాస్వామి మరియు ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల అధ్యక్షులు, క్రైస్తవ నాయకులు, ప్రతినిధులు, దైవజనురాండ్రులు తదితరులు సుమారు 150 మంది పాల్గొన్నారు. వచ్చిన వారికి సర్టిఫికెట్స్, మెంబర్ షిప్ ఫారమ్స్ అందించారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.
Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech