యవ్వనస్తులుPost Date:2014-08-30//No:30

యవ్వనజ్వాలమంచి సైనికునివలె  ఒక యవ్వనస్తుల కూడికలో యవ్వనస్తుల మధ్య పరిచర్య చేస్తున్న మరో యవ్వన సహోదరుడు ఉజ్జీవంగా, ఉద్రేకంగా ప్రసంగం చేస్తున్నాడు. సాతానుడు ఎలాంటి మోసగాడో వాడి తంత్రాలు ఎలాంటివో వాడి నుండి తప్పించుకొని ఎలాగు నిత్యజీవ మార్గాన్ని పొందాలో ఈ విధంగా తెలియచేయుచున్నాడు.

'ప్రియ యవ్వన సహోదరి, సహోదరులారా! సాతాను ఎంత మోసగాడో తెలుసా? వాడు దొంగ గర్జించు సింహం లాంటివాడు వాడి బారినపడి ఆదికాండము నుండి ప్రకటన గ్రంధం వరకు ఎంతో మంది నాశనం అయ్యారు నాగరికత ఎంతగానో నవీకరించబడిన ఈ రోజుల్లో అనగా చంద్రమండలం ఎక్కేంత తెలివి మీరిన మానవులను సాతాను వాడు పాత పద్ధతిలలోనే వాడి పాత బాణాలు (శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం) 1 యోహాను 2:16 వాడి మోసం చేస్తున్నాడు. దేవుని బిడ్డలను నాశనం చేస్తున్నాడు. కనుక మనం వాడి నుండి తప్పించుకోవాలంటే క్రీస్తుతో అంటు కట్టబడాలి. ఆయనతో ప్రతిరోజు సహవాసం కలిగి జీవించాలి. వాడి తంత్రాలకు భయపడకా మనలోని క్రీస్తు శక్తిద్వారా వాడిని జయించాలి. కనుక యవ్వనస్తులారా మీరందరు మెలకువ కలిగి ముందుకు సాగాలంటూ ఉద్రేక పూరితమైన ప్రసంగాన్ని చేస్తూ ఉండెను. బయట మాత్రం జోరువాన ప్రారంభమయ్యెను అంతే ముఖంనిండా నల్లరంగు పులుముకొని, వికారమైన తెల్లని నామాలు, భుజాలకు నల్లటి జోలె తగిలించుకుని, నల్లటి వస్త్రాలు ధరించుకొనిన పగటి వేషగాడు వానకు తడవకుండా ఉండేందుకు చర్చి ముందుకు వచ్చి వరండాలో నిలబడెను. ఉద్రేక ప్రసంగం చేస్తున్న ఆ యవ్వనస్తుడు ఆ పగటి వేషగాడ్ని చూచి తను చెప్పే మాటలు వలన సాతానుడే ప్రత్యక్షంగా వచ్చాడని ప్రసంగాన్ని ఆపి ఈ రోజు నా పని అయిపోయిందని మానుచుండెను. ఈ లోపు వర్షం ఇంకా పెద్దది అవుట వలన ఆ పగటి వేషగాడు చర్చిలోనికి వచ్చి గోడ ప్రక్కన నిలుచుండెను. ఇంకేముంది ఆ లీడర్‌గా ఉండి నడిపిస్తున్న యవ్వనస్తుడు ఆ ప్రాంతం వదిలి బ్రతికుంటే ఎన్ని ప్రసంగాలైనా ఎంత సేపైనా చెయ్యవచ్చంటూ వామ్మో సాతాను అంటూ బయటకు పరుగు లంకించెను. సాతానా అంటూ వెనుకకు చూచిన మిగిలిన వారు చూచి 'వాక్యం చెప్పే నాయకుడే భయపడి పారిపోతే మా పరిస్థితి ఇకంతే అంటూ 'బ్రతుకు జీవుడా... అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీసెను. కాని ఒక వ్యక్తి మాత్రం అలాగననే ఎటు పరుగెత్తకుండా కూర్చున్న చోట నుండి కదలక ఉన్నాడు.

వీరందరు ఎందుకు పరిగెడుతున్నారో అర్ధంకాని ఆ పగటి వేషగాడు అడిగేందుకు భయపడకుండా ఆ ఒక్కడిగా కూర్చున్న వ్యక్తి దగ్గరకు వచ్చి అబ్బాయ్‌ అని వీపు తట్టబోతుండగా అప్పటికే చెమటలు పట్టి వణుకుతున్న ఆ యవ్వనస్థుడు. 'వామ్మో నీకు దండం పెడతా నన్నేమి చేయకు, నన్ను చంపకు నన్నేం చేయకు నేను నీ వాడినే అని ఎటు పరిగెత్తలేని కాళ్ళు రెండు లేని యౌవ్వనస్తుడు సాతానుడనుకున్న పగటి వేషగాడ్ని కాళ్ళకు మ్రొక్కి పట్టుకొని బ్రతిమాలెను.

ప్రియమైన యవ్వన సహోదరి సహోదరుడా విశ్వాసులను కించపరచాలని హీనపరచాలని ఈ మాటలు వ్రాయడం లేదుకాని, నేటి యవ్వన విశ్వాసుల గుంపులలో కొందరూ సాతాను అడుగులలో నడుస్తున్నారడంలో సందేహం లేదు. 'సంతోషం తుదకు వ్యసనమగును' సామెతలు 14:3.

సరదాగా ప్రారంభించిన త్రాడుగు, వ్యభిచారం, దొంగతనం, పేకాటలు, సిగరెట్లు, జూదాలు చివరకు వ్యసనములుగా మారి ప్రాణాలను హరించి వేస్తున్నాయి. ఇటువంటి కార్యకలాపాలన్ని పాపమని బైబిల్‌ తెలియజేస్తుంది. పాపము వలన జీతం మరణమని బైబిల్‌ తెలియజేస్తుంది. అయితే నీ నా పరిస్థితి ఎలా ఉందో స్వవిమర్శించుకొని యెడల తీర్పులోనికి రాకపోదుము. 1కొరింథి 11:31.

యవ్వన కూడికలకు తండోప తండాలుగా హజరౌతు మాకు మనస్సు లేని నామకార్ధ క్రైస్తవ బిడ్డలుగా ఉన్నామా, లేక క్రీస్తు కొరకు ప్రాణాలర్పించటానికైన వెను తీయని విశ్వాస వీరుల గుంపులో ఉన్నామా ఆలోచించండి. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యా ఆయన కోసం నీ ప్రాణాలిమ్మని అడగటం లేదు. ఆయన కోసం జీవించమని అడుగుతున్నాడు.

దేవుని కొరకు యవ్వన ప్రాయంలో జీవితాలను త్యాగం చేసిన విలియంకేరి, సాదుసుందర్‌సింగ్‌, భక్తసింగ్‌, యేసన్న ఇలా చెప్పుకుంటూపోతే ఎందరో, వీరందరూ దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టి దిగ్విజయంగా ముగించారు. యవ్వన ప్రాయంలో ఆనందంగా హాయిగా జీవితాన్ని ఎంజాయ్‌ చేయక ప్రభురాజ్యవ్యాప్తి కొరకు పాటు పడినారు. యుద్ధ రంగంలో మంచి సైనికుల వలె పారాడినారు. క్రైస్తవుల విశ్వాస జీవితాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. గొప్పవారిగా చరిత్రలో మిగిలిపోయారు. దేవునికి స్తోత్రము.

ప్రియ యవ్వనస్తులారా అరిచే కుక్క కరవదని మనందరికీ తెలిసిన సామెత. అలాగే గర్జించే సింహంలాంటి రూపాన్ని పొందుకుని ఉన్న సాతానుడి ఉడుత ఊపులకు భయపడకా క్రీస్తుయేసు శక్తితో ఆయనకు మంచి సైనికునివలె ముందుకు సాగుదాం. ప్రభువు నీకు తోడుగా ఉండును గాక!

'క్రీస్తు యేసుయొక్క మంచి సైనికునివలె నాతో కూడా శ్రమను అనుభవించుము'. 2 తిమోతి 2:3 - బ్రదర్‌ జి.విజయ కుమార్‌ 
యవ్వనజ్వాలమంచి