యవ్వనస్తులుPost Date:2014-11-01//No:46
పరిపాలించు అభిషేకం యౌవనస్థులు ఎదుర్కొనే సవాలు
మన దేవుడు సమస్తమును పరిపాలించే ప్రభువు. మన పితరుల కాలములో ఆయన అలాగుననే ఉన్నాడు 2010 సం||రాల క్రితం ఆయనే ఆత్మ స్వరూపిగా ఈ ప్రపంచానికి వచ్చాడు. యేసు అన్నాడు. దేవుని పరిశుద్ధాత్మ మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. అలాగైనట్లయితే మిమ్మును పరిపాలించును. అలాగుననే దేవుని ఆత్మ తన పిల్లలను పరిపాలించుచున్నాడు ఒక మనుష్యుని యొక్క ఆలోచనలను ఎవరు పరిపాలించలేరు. అయితే దేవుని ఆత్మ ద్వారా మాత్రమే జరుగును. అలాగుననే ఒక మనుష్యుని యొక్క నాలుకను ఎవరు పరిపాలించలేరు. అయితే దేవుని ఆత్మ నాలుకను, హృదయమును పరిపాలించును. అలాగుననే దేవుని ఆత్మ పరిపాలన చేయగలిగినది. గొఱ్ఱెలు మేపే సాధారణ మనుష్యుడైన దావీదును దేవుడు రాజుగా మార్చుటకు ఇష్టపడ్డాడు. దాని కోసం ఏమి చేశాడంటే. తన ప్రవక్తను పంపి దావీదును అభిషేకింపజేశాడు. అప్పుడు దేవుని ఆత్మ అతని మీద బలముగా దిగినది. గనుక పరిపాలించు కృపను పొందుకొన్నాడు. నా ఆశ ఏమిటంటే, దేవుని ఆత్మను పొందుకున్న వారు మన భారతదేశమును పరిపాలించాలి. దేవుని అభిషేకమను పొందినటువంటి వారే ప్రతి రాష్ట్రమును పరిపాలించాలి. దానిని చూసి నేను ఆనందించాలి. గనుక యౌవ్వన సహోదరి సహోదరులారా! త్యాగ హృదయముతో జనులకు సేవ చేయుటకు మిమ్మును మీరు సమర్పించుకుంటారా? ఈనాడు ప్రతి ఒక్కరు డాక్టరవ్వాలి, ఇంజనీరు అవ్వాలని ఇష్టపడుచున్నారు. కాని దేశాన్ని పరిపాలించాలనే ఆలోచన ఎవరికి రావడం లేదు. తల్లిదండ్రులు దానికి ప్రాముఖ్యతను ఇవ్వడము లేదు. ఈ రోజు నుండి మన దేశము మీద మీ ఆలోచనలు ఉండనివ్వండి. మీరు దాహముతో దేవున్ని అడిగినట్లయితే పరిపాలించే శక్తిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆయన అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పాడు. గనుక అడిగి పొందుకుందాం. ఈ చివరి రోజులలో ప్రజలు అన్నిటిని చూసి నూతన శక్తి కోసము ఎదురు చూచుచున్నవారు ఎవరు లేరు. ఒక పార్టి నిర్వహణ నచ్చకపోయినట్లయితే ఇంకొక పార్టి వ్యక్తికే వారు ఓటు వేసెదరు. వేరే ఆప్షన్ ఏమీ లేదు. గనుక యౌవనస్తులారా! దేశాన్ని పరిపాలించేవారిగా లేచి రావాలి. ఇప్పటి నుండే దాని కొరకు నీవు సిద్ధపడు! ప్రభువు ముందు యదార్ధముగా ఉండు! నీ మనస్సాక్షిని ఎల్లప్పుడు జాగ్రత్తగా కాచుకొని ప్రయాణించు! నీ హృదయాంతరంగమును పరిశోధించే దేవుడు నిశ్చయముగా నీకు ప్రతిఫలమిచ్చును. దావీదు వలె నేను వెళ్ళుతాను నన్ను పంపించండని చెప్పేవారు అవసరము. దావీదు అలాగే చెప్పి ముందుకు వచ్చాడు, గొల్యాతును చంపడానికి దావీదుకు దేవుడు కృపను అనుగ్రహించాడు. నీవు కూడా ముందుకు వచ్చినట్లయితే దేవుడు నీకు సహాయం చేయగలడు. ఇంటిలోనే మీరు బంధించబడి ఉన్నట్లయితే ఏమియు జరుగదు. గనుక దేవుని వాక్యము చెప్పుచున్నది. లెమ్ము! తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. నీవు నిద్రలోనుండి లెమ్ము! నీవు లేచినట్లయితే దేవుడు నీకు సహాయము చేయగలడు. ప్రియ యౌవనస్థుడా! లోబడుతావా? ఈ పత్రికను చదివేటప్పుడే దేవుని అభిషేకం నీపై వచ్చుట నీవు గ్రహించినట్లయితే ఈ పత్రికను జాగ్రత్తగా ఉంచుకొని, దేవుని మాటలు నన్ను వెతుక్కుంటు వచ్చినవి నాకు సహాయము చేయుమని ప్రభువును అడుగు! ప్రభువు నిన్ను దేశమును పరిపాలించే వ్యక్తిగా నిన్ను సిద్ధపర్చును గాక. ఆమేన్.
- బ్రదర్.జడ్సన్ అబ్రహాం

పరిపాలించు అభిషేకం యౌవనస్థులు ఎదుర్కొనే సవాలు
ఎదురీత
అన్న, తమ్ముడు
ప్రేమతోనే విజయం సాధించాలి ''
సినిమాలు చూడటం తప్పా?
పౌరుషంతో ప్రసంగం
యౌవన విశ్వాసీ... జవాబు నీకే తెలుసు
యౌవన విశ్వాసీ... జవాబు నీకే తెలుసు
గడచిన తరుణం
యవ్వనజ్వాలగడచిన తరుణం
యవ్వనజ్వాల యువత కావలెను!
యౌవ్వన జ్వాలయౌవన విశ్వాసీ... జవాబు నీకే తెలుసు
యవ్వనజ్వాలక్రైస్తవులు ముందుకు రావాలి
యవ్వనజ్వాలమంచి సైనికునివలె
యవ్వనజ్వాలయౌవనస్తులారా! సిద్ధపడండి!
యవ్వనజ్వాలప్రేమంటే?!
యవ్వనజ్వాలప్రేమంటే?!
యవ్వనజ్వాలప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఓ సండేస్కూల్ టీచర్
యవ్వన జ్వాల ఎల్లో రిబ్బన్
యవ్వనజ్వాలయౌవనుడా! కాడిమోయి!
స్నేహితుల వత్తిడి
యవ్వనజ్వాల క్రైస్తవ యవ్వనులు - దేశసేవ
యవ్వనజ్వాలదీవెన మరియు శాపము
ప్రతిరోజూ అవసరమా..?
యవ్వన జ్వాలఅమ్మ మాట
నా చెడు చూపులను మార్చుకొనేదెలా...?
యవ్వనజ్వాలనీవైతే ఏం చేస్తావు?
సినిమాలు చూడటం తప్పా ?
సినిమాలు చూడటం తప్పా ?
యవ్వనజ్వాలకా''లేజి''కి వెళుతున్నావా..!
విజ్ఞానం గల యువత -
యవ్వనజ్వాల మూడు ముళ్ల ప్రార్ధన
యవ్వనజ్వాల రాజసేవకై యువతరం
యవ్వనజ్వాల అతి తెలివి
స్కాట్లాండులో ఒక్క యౌవనుడు కూడా లేడా?
యవ్వన జ్వాల క్రీస్తుకు కావలసినవాడు.. యువకుడంటే!!!
యవ్వనజ్వాల ప్రేమను గురించి శాస్త్రీయ సత్యాలు
చరిత్ర చెప్పే సాక్ష్యం
జీవిత భాగస్వామి ఎంపిక -1 - మతతర తెగాంతర వివాహము
కోపము ,అసూయ ,గర్వం ,సోమరితనము
దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికీ రెండు చిట్కాలు